జీ స్పెషల్ : ఈ తరం లేడీ డైరెక్టర్స్ !

Tuesday,March 10,2020 - 10:02 by Z_CLU

హీరోయిన్ గా పలు సినిమాలు చేసి ప్రస్తుతం నటిగా క్యారెక్టర్స్ చేస్తున్న కళ్యాణి మెగా ఫోన్ పట్టబోతుంది. చేతన్ హీరోగా వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా విల‌క్ష‌ణ ప్రేమ‌క‌థ‌తో దర్శకురాలిగా ఓ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ సినిమా తీయనుంది. త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాతో లేడీ డైరెక్టర్స్ లిస్టులో చేరి కొత్త ఇమేజ్ దక్కించుకోవాలని చూస్తోంది కళ్యాణి.

సుధా కొంగర కూడా వరుస సినిమాలతో దర్శకురాలిగా బిజీ అవుతోంది. ఇప్పటికే మాధవన్ , వెంకటేష్ ను డైరెక్ట్ చేసి సుధా ప్రస్తుతం హీరో సూర్యతో ఓ సినిమా చేస్తుంది. ‘ఆకాశమే నీ హద్దురా’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో దర్శకురాలిగా మరో మెట్టెక్కబోతుంది.

ఇక ప్రెజెంట్ లేడీ డైరెక్టర్ లిస్టులోకి లక్ష్మి సౌజన్య కూడా చేరబోతుంది. ప్రస్తుతం నాగ శౌర్య -రీతు వర్మ జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమాతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయం అవుతోంది సౌజన్య.

‘మధ’ అనే సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది శ్రీ విద్య. స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలతో రాహుల్, త్రిష్నా ముఖర్జీ జంటగా సినిమాను తెరకెక్కించి రిలీజ్ కి రెడీ చేసింది. ప్రస్తుతం సెలెబ్రిటీస్ సినిమా ట్రైలర్ చూసి శ్రీ విద్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ లిస్ట్ లో శేష సింధురావు కూడా ఉన్నారు. చూసీ చూడంగానే సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన ఈమె, తొలి సినిమాతోనే సెన్సిబుల్ డైరక్టర్ అనే గుర్తింపు తెచ్చుకున్నారు. రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరిని సక్సెస్ ఫుల్ గా సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేశారు.

ఇప్పటికే నందిని రెడ్డి లాంటి దర్శకులు టాలీవుడ్ లో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. మరి ఆ లిస్టులో కళ్యాణి, సౌజన్య, శ్రీ విద్య కూడా చేరాలని కోరుకుందాం.