జీ సినిమాలు : మూవీ ఛానెల్స్ లో ప్రభంజనం

Monday,September 04,2017 - 06:37 by Z_CLU

ప్రారంభమై ఏడాది అయింది
ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది.
జీ సినిమాలు మూవీ ఛానెల్ ప్రారంభమై ఇవాళ్టికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో తెలుగు ప్రేక్షకులు అందించిన ఆదరాభిమానాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటోంది జీ సినిమాలు.

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా గ్రాండ్ గా ప్రారంభమైంది జీ సినిమాలు. అన్ని జానర్స్ కు చెందిన సినిమాలతో  ప్రేక్షకులకు ఓ సరికొత్త ఎంటర్ టైన్ మెంట్ స్టేషన్ గా మారింది జీ సినిమాలు. టాలీవుడ్ ప్రముఖుల అభినందనలు, శుభాకాంక్షల మధ్య సగర్వంగా లాంచ్ అయిన జీ సినిమాలు 24 గంటల మూవీ ఛానెల్ అంచెలంచెలుగా ఎదిగి తనకుంటూ కొన్ని మైలురాళ్లను సంపాదించుకుంది.

ప్రారంభంలో 87 జీఆర్పీతో ప్రారంభమైన జీ సినిమాలు ప్రస్థానం.. ఈ ఏడాదిలో 185 జీఆర్పీని తాకింది. ఏడాదిలోనే దాదాపు వంద జీఆర్పీని మెరుగుపరుచుకొని జెట్ స్పీడ్ తో జీ సినిమాలు మూవీ ఛానెల్ దూసుకుపోతోందంటే దానికి కారణం ప్రేక్షక దేవుళ్లే.

ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ఎన్నో రూపాల్లో ప్రేక్షకులకు చేరువైంది జీ సినిమాలు. మెగా మూవీ ఆప్ ది వీక్, మూవీ ఆఫ్ ది మంత్, ఫ్రైడే బ్లాక్ బస్టర్, వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్, దిల్ పై సూపర్ హిట్ మూవీ.. ఇలా వివిధ కేటగిరీస్ తో సూపర్ హిట్ మూవీస్ తో ప్రతి రోజు ప్రేక్షకుల్ని అలరిస్తోంది జీ సినిమాలు.

నాటి తరం మేటి నటులతో పాటు.. నేటి తరం సూపర్ స్టార్స్ వరకు ఎంతోమంది హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాలు జీ సినిమాలు ఛానెల్ లో ప్రసారం అవుతున్నాయి. త్వరలోనే మరిన్ని వినూత్నమైన సినిమాలతో నిత్య నూతనంగా అలరిస్తూ, ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుంటూ తన ప్రయణాన్ని కొనసాగిస్తుంది జీ సినిమాలు.