జీ సినిమాలు: టాలీవుడ్ రాఖీ స్పెషల్

Monday,August 03,2020 - 05:40 by Z_CLU

టాలీవుడ్ లో కొందరు హీరోలు వారి సిస్టర్స్ ని కూడా తమ ఫీల్డ్ లో ఎంకరేజ్ చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. నచ్చిన డిపార్ట్ మెంట్ లో వారు కూడా ఆ బ్రదర్స్ కి సిస్టర్స్ లా కాకుండా వారి పనిలో బెస్ట్ అనిపించుకుంటూ ముందుకెళ్తున్నారు. టాలీవుడ్లో అలా బ్రదర్స్ సపోర్ట్ తో ముందుకెళ్తున్న స్టార్ సిస్టర్స్ పై ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.


 మంజుల ఘట్టమననేని -మహేష్

సూపర్ స్టార్ కృష్ణ తనయురాలిగా పరిశ్రమలో అడుగుపెట్టింది మంజుల.  ‘షో’ అనే సినిమాతో నటిగా పరిచయమైన మంజుల ఆ సినిమాకు నిర్మాణ భాద్యతలు కూడా చూసుకున్నారు. ఆ తర్వాత ‘కావ్యాస్ డైరీ’, ‘ఆరెంజ్’, ‘సేవకుడు’ అనే సినిమాల్లో నటించారు. ఇక గతేడాది ‘మనసుకి నచ్చింది’ సినిమాతో దర్శకురాలిగా కూడా పరిచయమైంది మంజుల. ఈ సినిమా రిలీజ్ సమయంలో మహేష్ తన అక్కను బాగా సపోర్ట్ చేసాడు. మీడియా ముందుకొచ్చి స్పెషల్  ఇంటర్వ్యూ చేసాడు. దర్శకురాలిగా పరిచయమవుతున్న తరుణంలో అండగా నిలిచాడు.


సుష్మిత – రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిస్టర్ సుష్మిత కూడా ఇండస్ట్రీలో బాగానే గుర్తింపు సంపాదించుకున్నారు. యాక్టింగ్ కాకుండా తనకి నచ్చిన కాస్ట్యూమ్ డిజైనింగ్ ని ఎంచుకున్నారు.. ఖైదీ 150 సినిమాకు డిజైనర్ గా పనిచేసిన సుష్మిత తండ్రిని స్టైలిష్ కాస్ట్యూమ్స్ లో చూపించారు.. ప్రస్తుతం కొణిదెల ప్రొడక్షన్ లో డిజైనర్ గా సెటిలైన ఈమె.. చిరంజీవి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు సైరాకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. తన సిస్టర్ టాలెంట్ గురించి చెప్పడానికి ఎప్పుడూ ముందుంటాడు చరణ్. ఆమెను రెగ్యులర్ గా ఎఁకరేజ్ చేస్తుంటాడు.
మంచు లక్ష్మి- మంచు విష్ణు , మనోజ్

మంచు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లక్ష్మీ మంచు యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత నటిగా మారి పలు సినిమాలు చేశారు. ఆ తర్వాత సమాజానికి ఉపయోగపడే షో నిర్వహించారు.  లక్ష్మీ చేసిన ప్రతీ ప్రయత్నంలో సోదరులు విష్ణు, మనోజ్ ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. అక్క గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చిన తను సుపర్బ్ అని తన సొంత టాలెంట్ తో పైకొచ్చిందని చెప్తుంటారు. అక్కంటే వీళ్లకు అంత ప్రేమ.


నిహారిక – వరుణ్ తేజ్

ముందుగా కొన్ని షోలకు యాంకరింగ్ చేసిన వరుణ్ తేజ్ చెల్లెలు నిహానిక ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. ఇటివలే వచ్చిన ‘సూర్యకాంతం’ సినిమాకు వరుణ్ తేజ్ ప్రజెంటర్ గా కూడా మారాడంటే దానికి కారణం చెల్లెలు నిహారిక. ఒకే రంగంలో నటులుగా రాణిస్తున్న వరుణ్-నిహారిక సందర్భం వచ్చినప్పుడల్లా తమ అన్నా చెల్లెళ్ళ  అనుబంధం గురించి చెప్తుంటారు. అంతేకాదు.. నిహారిక మరో అన్నయ్య రామ్ చరణ్ అయితే ఏకంగా ఆమెకు సైరాలో ఓ రోల్ కూడా ఇచ్చాడు.


సుప్రియ – సుమంత్

అక్కినేని హీరో సుమంత్ సిస్టర్ సుప్రియా కూడా ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత స్టూడియో పనులు చూసుకుంటూ వచ్చిన సుప్రియా లేటెస్ట్ గా ‘గూడచారి’ తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో సుప్రియాని సపోర్ట్ చేస్తూ తన యాక్టింగ్ ని మెచ్చుకున్నాడు సుమంత్. నటిగా తను మరిన్ని సినిమాలు చేయాలని ప్రోత్సహిస్తున్నాడు.


దీప్తి – నాని

నాని సిస్టర్ దీప్తి కూడా లేటెస్ట్ గా ఓ షార్ట్ ఫిలింను డైరెక్ట్ చేశారు.. ముందుగా నానికి ఓ కథ వినిపించగా, నాని ఆ కథతో నువ్వే షార్ట్ ఫిలిం చేయొచ్చుగా అని ఐడియా ఇచ్చాడట. అలా తమ్ముడి సపోర్ట్ తో షార్ట్ ఫిలిం చేసి రిలీజ్ చేసి అందరి ప్రశంసలు అందుకుంది దీప్తి. అక్క ఏం చేసినా దానికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అందిస్తాడు నాని.