జీ సినిమాలు ( మార్చి 5th)

Sunday,March 05,2017 - 04:09 by Z_CLU

నటీనటులు : నిశ్చల్, వందన, R.P. పట్నాయక్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, దువ్వాసి మోహన్, అనిత చౌదరి

మ్యూజిక్ డైరెక్టర్ : R.P. పట్నాయక్

డైరెక్టర్ : R.P. పట్నాయక్

ప్రొడ్యూసర్ : R.P. పట్నాయక్

రిలీజ్ డేట్ : 11 మార్చి 2016

 ఫార్ములా సినిమాలకు భిన్నంగా ఉంటాయి R.P. పట్నాయక్ సినిమాలు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన తులసీదళం 2016 లో రిలీజైన బెస్ట్ సినిమాలలో ఒకటి. సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్స్ లో నటిస్తూనే, ఈ  సినిమాకి దర్శకుడు, నిర్మాత, సంగీతం అన్ని తానాయి చూసుకున్నాడు R.P. పట్నాయక్.

==========================================================================

నటీనటులు : విజయ్ అంటోని, సిద్ధార్థ్ వేణు గోపాల్

ఇతర నటీనటులు : రూప మంజరి, అనుయ భగవత్, విజయ్, విభ నటరాజన్, కృష్ణమూర్తి, ప్రమోద్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ అంటోని

డైరెక్టర్ : జీవ శంకర్

ప్రొడ్యూసర్ : ఫాతిమా విజయ్ అంటోని

రిలీజ్ డేట్ : 15 ఆగష్టు 2012

విజయ్ అంటోని హీరోగా జీవ శంకర్ డైరేక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ నకిలీ. చిన్నప్పుడే తల్లిని చంపిన హత్యా నేరంలో జైలు కెళ్ళిన కుర్రాడు, జైలునుండి బయటికి వచ్చి ఏం చేశాడు..? అతని జీవితం ఏ మలుపు తిరిగింది అనేదే ప్రధాన కథాంశం.

=============================================================================

నటీ నటులు : వెంకటేష్, అంజలా జవేరి

ఇతర నటీనటులు : జయ ప్రకాష్ రెడ్డి, శ్రీహరి, చంద్ర మోహన్, ఆహుతి ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : జయంత్.సి.పనార్జీ

ప్రొడ్యూసర్ : D.సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 9 మే 1997

తెలుగు తెరపై మొట్ట మొదటిసారిగా ఫ్యాక్షనిజం పై తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా చిత్రం ‘ప్రేమించుకుందాం రా’. వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ సినిమా రిలీజిన్ అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శించబడింది. తన ప్రేమకు వ్యతిరేకంగా ఉన్న పెద్ద్లలను ఎదిరించి ఎలా ఒక్కటయ్యారు  అన్నదే కథ. పర్ ఫెక్ట్ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్.

============================================================================

హీరోహీరోయిన్లు – ఉదయనిథి స్టాలిన్, నయనతార

సంగీతం – హరీష్ జైరాజ్

దర్శకత్వం – ఎస్.ఆర్ ప్రభాకరన్

విడుదల తేదీ – 2015

అప్పటికే ఓకే ఓకే సినిమాతో తెలుగులో కూడా పెద్ద హిట్ అందుకున్నాడు ఉదయ్ నిధి స్టాలిన్. ఆ ఉత్సాహంతో 2014లో విడుదలైన తన తమిళ సినిమాను… శీనుగాడి లవ్ స్టోరీ పేరుతో తెలుగులోకి కూడా డబ్ చేసి రిలీజ్ చేశాడు. నయనతార హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాకు తెలుగులో కూడా రీచ్ పెరిగింది. పైగా తెలుగులో ఓకే ఓకే హిట్ అవ్వడంతో.. శీనుగాడి లవ్ స్టోరీకి కూడా క్రేజ్ ఏర్పడింది. ప్రభాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు కూడా ఎప్పట్లానే తానే నిర్మాతగా వ్యవహరించాడు ఉదయ్ నిథి స్టాలిన్.

=============================================================================

నటీ నటులు : వెంకటేష్, రమ్య కృష్ణన్, ప్రేమ

ఇతర నటీనటులు : గిరీష్ కర్నాడ్, శ్రీ విద్య, D. రామానాయుడు

మ్యూజిక్ డైరెక్టర్ : M.M.శ్రీలేఖ

డైరెక్టర్ : సురేష్ కృష్ణ

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 13 జనవరి 1996

విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ సెన్సేషనల్ హిట్ ధర్మచక్రం. డబ్బుందన్న అహంతో తన ప్రేమను తనకు దక్కకుండా చేసిన తండ్రికి తగిన గుణపాఠం చెప్పే కొడుకుగా వెంకటేష్ నటన సినిమాకి హైలెట్. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి M.M.శ్రీలేఖ సంగీతం అందించారు.

===============================================

నటీ నటులు : విశాల్, ప్రియమణి

ఇతర నటీనటులు : అజయ్, ఆశిష్ విద్యార్థి, దేవ రాజ్, ఊర్వశి, నిరోషా, పొన్నాంబలం

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : T. అజయ్ కుమార్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007

హీరో విశాల్ కి తమిళ నాట ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగులోనూ అంతే ఫాలోయింగ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని భూపతి పాండ్యన్ దర్శకత్వం వహించాడు. భయ్యా సినిమా తమిళంలో ‘మలాయ్ కొట్టాయ్’ గా రిలీజయింది. రెండు భాషలలోను సూపర్ హిట్టయింది.

==============================================================================

నటీనటులు : విజయ్, జెనీలియా డిసౌజా

ఇతర నటీనటులు : బేబీ ప్రీతి, బిపాషా బసు, వడివేలు, సంతానం, రఘువరన్, బాలాజీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : జాన్ మహేంద్రన్

ప్రొడ్యూసర్ : కలైపులి యస్. థాను

రిలీజ్ డేట్ : 14 ఏప్రిల్ 2005

విజయ్, జెనీలియా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం సచిన్. జాన్ మహేంద్రన్ డైరెక్షన్ లో తమిళం లో తెరకెక్కిన ‘సచిన్’ సూపర్ హిట్ అయింది దానికి డబ్బింగ్ వర్షనే ఈ తెలుగు సచిన్. బిపాషా బసు ఈ సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ లో అలరిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.