జీ సినిమాలు ( మార్చి 3rd)

Thursday,March 02,2017 - 10:09 by Z_CLU

నటీనటులు : శోభన్ బాబు, జయచిత్ర, జయసుధ

ఇతర నటీనటులు : సత్య నారాయణ, పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య, నగేష్, గిరిబాబు, శాంత కుమారి, అంజలీ దేవి, రమాప్రభ, మంజు భార్గవి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K. V. మహదేవన్

డైరెక్టర్ : K. బాపయ్య

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 1975, డిసెంబర్ 19

బాపయ్య డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ట్రయాంగిల్ లవ్ ఎంటర్ టైనర్ సోగ్గాడు. ఈ సినిమా తరవాతే శోభన్ బాబు  టాలీవుడ్ ఆల్ టైం సోగ్గాడుగా నిలిచిపోయాడు. అప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న జయచిత్ర కూడా ఈ సినిమాతోనే ఫుల్ ఫ్లెజ్డ్ హీరోయిన్ గా పరిచయం అయింది. జయసుధ, జయచిత్ర, శోభన్ బాబుల ఆన్ స్క్రీన్  కెమిస్ట్రీ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇమోషనల్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

=============================================================================

నటీ నటులు : మీనా, శరత్ బాబు, సాయి కిరణ్

ఇతర నటీ నటులు :  సన, సుబ్బరాయ శర్మ, అశోక్ రావు, అనంత, సుధా, శివ పార్వతి, శ్రీరామ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఎం.ఎం.కీరవాణి

డైరెక్టర్ : ఉదయ్ భాస్కర్

ప్రొడ్యూసర్ : దొరై స్వామి రాజు

రిలీజ్ డేట్ : జులై 17, 2009

మీనా, శరత్ బాబు , సాయికిరణ్ వంటి మొదలగు వారితో దర్శకుడు ఉదయ్ భాస్కర్ తెరకెక్కించిన వెంగమాంబ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భక్తి రస చిత్రం ‘వెంగమాంబ’. ఈ చిత్రం లో కథానాయకుడు సాయి కిరణ్ వెంకటేశ్వర స్వామిగా నటించారు. కొన్ని భక్తి రస సన్నివేశాలు, నటీ నటుల గెటప్స్ ఈ సినిమాకు హైలైట్స్.

=============================================================================

నటీనటులు : సురేష్, యమున

ఇతర నటీనటులు : దాసరి నారాయణ రావు, సుజాత, సురేష్, గొల్లపూడి, వేలు, రాళ్ళపల్లి, కాంతారావు, బ్రహ్మానందం, బాబూ మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : వాసూ రావు

డైరెక్టర్ : దాసరి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : డి. రామా నాయుడు

రిలీజ్ డేట్:  1992

కష్టపడి పెంచిన తలిదండ్రులను కన్నా బిడ్డలే పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించారు డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఈ సినిమాలో తండ్రి పాత్ర కూడా స్వయంగా ఆయనే పోషించారు. ఈ సినిమాలో ‘ఒకే ఒక ఆశ’ అంటూ సాగే పాట సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

నటీ నటులు : శ్రీహరి, మధు శర్మ, KR విజయ

ఇతర నటీనటులు : విజయ్ చందర్, రంగనాథ్, ప్రదీప్ రావత్, పింకీ సర్కార్, మానస, దేవి శ్రీ, LB శ్రీ రామ్, కొండవలస, వేణు మాధవ్, కోవై సరళ

మ్యూజిక్ డైరెక్టర్ : వందేమాతరం శ్రీనివాస్

డైరెక్టర్ : చంద్ర మహేష్

ప్రొడ్యూసర్ : శాంత కుమారి

శ్రీహరి హీరోగా తెరకెక్కిన హనుమంతు డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన పక్కా హిట్ ఫార్ములా తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్. పల్లెటూరిలో ఉండే ఒక సాధారణ వ్యక్తి, తన గతం తెలుసుకుని, తన తండ్రి చావుకు కారణమైన వారికి బుద్ధి చెప్పి, సగంలోనే సమసిపోయిన తన తండ్రి లక్ష్యం కోసం కోసం పోరాడే కొడుకుగా, ఫ్లాష్ బ్యాక్ లో స్వాన్త్రం కోసం పోరాడే యోధుడిగా అద్భుతంగా నటించాడు శ్రీహరి. ఈ సినిమాకి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం ప్రాణం.

===========================================================================

నటీనటులు  – నాగచైతన్య, కృతి సానన్

ఇతర నటీనటులు – బ్రహ్మానందం, రవిబాబు, పోసాని, సప్తగిరి, ప్రవీణ్

మ్యూజిక్ డైరెక్టర్  – సన్నీ

డైరెక్టర్  – సుధీర్ వర్మ

రిలీజ్ డేట్  – 2015, ఏప్రిల్ 24

స్వామిరారా సినిమాతో అప్పటికే సూపర్ హిట్ అందుకున్న సుధీర్ వర్మకు పిలిచిమరీ ఛాన్స్ ఇచ్చాడు నాగచైతన్య. స్వామిరారా సినిమాతో తన మార్క్ ఏంటో చూపించిన సుధీర్ వర్మ… తన  రెండో ప్రయత్నంగా తీసిన దోచెయ్ సినిమాకు కూడా అదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. మహేష్ సరసన వన్-నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి సనోన్ కు ఇది రెండో సినిమా. అలా వీళ్లందరి కాంబోలో తెరకెక్కిన దోచెయ్ సినిమా కుర్రాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేసింది. సన్నీ సంగీతం అదనపు ఆకర్షణ. క్లయిమాక్స్ కు ముందొచ్చే బ్రహ్మానందం కామెడీ టోటల్ సినిమాకే హైలెట్.

==============================================================================

నటీనటులు :  విశాల్, శృతి హాసన్

ఇతర నటీనటులు : సత్య రాజ్, రాధికా శరత్ కుమార్, ముకేశ్ తివారి, సూరి, జయ ప్రకాష్,  తదిరులు

మ్యూజిక్ డైరెక్టర్ :  యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : హరి

ప్రొడ్యూసర్ : విశాల్

రిలీజ్ డేట్ : 22 అక్టోబర్ 2014

విశాల్, శృతి హాసన్ జంటగా మాస్ సినిమా దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పూజ’.  ప్రతీ సినిమాలో మాస్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసే విశాల్ అలాంటి మాస్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమా లో యాక్షన్ సీన్స్, శృతి హాసన్ గ్లామర్, కామెడీ సీన్స్ , సాంగ్స్  హైలైట్స్ .

=============================================================================

నటీ నటులు : అక్కినేని నాగార్జున, శోభన

ఇతర నటీనటులు : రోజా, నాజర్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి

డైరెక్టర్ : ఉప్పలపాటి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : అక్కినేని వెంకట్

రిలీజ్ డేట్ : 18 ఫిబ్రవరి 1993

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కరియర్ లో బెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ రక్షణ. ఈ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో విలన్ గా నటించిన కోట శ్రీనివాస్ రావు పర్ఫార్మెన్స్ సినిమాకే హైలెట్. ఉప్పలపాటి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు.