జీ సినిమాలు ( మార్చి 31st)

Thursday,March 30,2017 - 10:06 by Z_CLU

నటీనటులు  – సురేష్, యమున, హరీష్, రోజా

ఇతర నటీనటులు – గుమ్మడి, పీఎల్ నారాయణ, కోటశ్రీనివాసరావు, బాబుమోహన్, రమాప్రభ

మ్యూజిక్ డైరెక్టర్  – ఇళయరాజా

ప్రొడ్యూసర్  – డాక్టర్ డి.రామానాయుడు

డైరెక్టర్  – కె.సదాశివరావు

రిలీజ్ డేట్  – 1992

70, 80, 90వ దశకాల్లో సినిమా పాటలు హిట్ అయితే అందులో 90 శాతం పాటలు ఇళయరాజావే ఉండేవి. అలా మూడు దశాబ్దాలకు పైగా సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన మకుటం లేని మహారాజు ఇళయరాజా. అలాంటి సంగీత జ్ఞాని స్వరాలు అందించిన సినిమా ప్రేమ విజేత. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో రెండు పాటలు ఇప్పటికీ జనాల్ని మెప్పిస్తాయి. సురేష్, హరీష్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు కె.సదాశివరావు దర్శకత్వం వహించారు.

============================================================================

నటీనటులు : వినోద్ కుమార్, రోజా, దివ్యవాణి

ఇతర నటీనటులు : వాణిశ్రీ, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : P.S. రామచంద్రా రావు

ప్రొడ్యూసర్ : కోసూరి శ్రీదేవి

రిలీజ్ డేట్ : 1993

ఫ్యామిలీ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న వినోద్, రోజా జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అత్తకు కొడుకు మామకు అల్లుడు. అప్పటికే సిల్వర్ స్క్రీన్ పై అత్తగా వెలిగిపోతున్న సీనియర్ నటి వాణిశ్రీ, సత్యనారాయణకు అల్లుడుగా నటించాడు వినోద్ కుమార్. వీరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

============================================================================

నటీ నటులు : రాహుల్ రవీంద్రన్, తన్వి వ్యాస్

ఇతర నటీనటులు : సంజనా గల్రాణి, శరత్ బాబు, సుమన్, రఘుబాబు, L.B.శ్రీరామ్, కాశీ విశ్వనాథ్

మ్యూజిక్ డైరెక్టర్ : M.M.శ్రీలేఖ

డైరెక్టర్ : P. సునీల్ కుమార్ రెడ్డి

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 8 నవంబర్ 2013

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన మరో సూపర్ హిట్ ఫిలిం ‘నేనేం చిన్నపిల్లనా..’. నిజానికి దర్శక నిర్మాతలు ఈ సినిమాకి టైటిల్ ‘పట్టుదల’ అని డిసైడ్ అయ్యారు. తీరా సినిమా రిలీజ్ కి దగ్గర పడ్డాక ‘నేనేం చిన్నపిల్లనా’ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, తన్వి వ్యాస్ హీరో హీరోయిన్ లు గా నటించారు. M.M.శ్రీలేఖ సంగీతం అందించారు.

=============================================================================

నటీనటులు : వెంకటేష్, టాబూ

ఇతర నటీనటులు : శారద, రావు గోపాల్ రావు

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. సురేష్

రిలీజ్ డేట్ : 12 జూన్ 1991

వెంకటేష్ హీరోగా K. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన కలర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ కూలీ నం 1. ఒక సాధారణ కూలీ, పొగరుబోతులైన తండ్రీ కూతుళ్ళ అహాన్ని ఎలా నేలకూల్చాడనే ప్రధానాంశంతో తెరకెక్కిందే ఈ సినిమా. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

===========================================================================

నటీనటులు :  విశాల్, శృతి హాసన్

ఇతర నటీనటులు : సత్య రాజ్, రాధికా శరత్ కుమార్, ముకేశ్ తివారి, సూరి, జయ ప్రకాష్,  తదిరులు

మ్యూజిక్ డైరెక్టర్ :  యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : హరి

ప్రొడ్యూసర్ : విశాల్

రిలీజ్ డేట్ : 22 అక్టోబర్ 2014

విశాల్, శృతి హాసన్ జంటగా మాస్ సినిమా దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పూజ’.  ప్రతీ సినిమాలో మాస్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసే విశాల్ అలాంటి మాస్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమా లో యాక్షన్ సీన్స్, శృతి హాసన్ గ్లామర్, కామెడీ సీన్స్ , సాంగ్స్  హైలైట్స్ .

==========================================================================

నటీనటులు : మమ్ముట్టి, నఫీసా ఆలీ

ఇతర నటీనటులు : మనోజ్ కె జయన్, బాల, సుమిత్ నావెల్, లీన, మమతా మోహన్ దాస్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : గోపి సుందర్

డైరెక్టర్ : ఆమాల్ నీరద్

ప్రొడ్యూసర్ : షాహుల్ హమీద్ మరికర్

రిలీజ్ డేట్ : 13 ఏప్రియల్ 2007

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్ బిగ్ బి. గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి ఆమాల్ నీరద్ దర్శకత్వం వహించాడు.