జీ సినిమాలు ( మార్చి 22nd )

Tuesday,March 21,2017 - 10:12 by Z_CLU

నటీనటులు : సుమంత్, భూమిక చావ్లా

ఇతర నటీనటులు : జయసుధ, ఆలీ, వేణు మాధవ్

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : A. కరుణాకరన్

ప్రొడ్యూసర్స్ : అక్కినేని నాగార్జున, N. సుధాకర్ రెడ్డి

రిలీజ్ డేట్ : ఆగస్ట్ 2000

కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ యువకుడు. తన తండ్రి లాగే సైనికుడు కావాలని తపన పడే యువకుడిలా సుమంత్ నటన సినిమాకే హైలెట్. భూమిక తెలుగు తెరకు పరిచయమైంది ఈ సినిమాతోనే. తల్లి పాత్రలో జయసుధ నటన చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది.

==========================================================================

నటీనటులు : వెంకటేష్, రజని

ఇతర నటీనటులు : మోహన్ బాబు, జయసుధ, నూతన ప్రసాద్, శ్రీ దివ్య, బేబీ శాలిని, అల్లు రామలింగయ్య తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : దాసరి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : డి. రామానాయుడు

రిలీజ్ డేట్ : 27 ఆగష్టు 1988

1988 లో రిలీజైన బ్రహ్మపుత్రుడు తో వెంకటేష్ ని మాస్ హీరోల లిస్టులోకి చేర్చేసింది. తమిళం లో రీమేక్ అయిన మైకేల్ రాజ్ కి రీమేక్ ఈ సినిమా. వెంకటేష్ ఈ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ సినిమాని దాసరి నారాయణ రావు గారు తెరకెక్కించారు.

============================================================================

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు : నిషా కొఠారి, అశుతోష్ రానా, రవి కాలె, సలీం బేగ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : Y.V.S.చౌదరి

ప్రొడ్యూసర్ :  Y.V.S.చౌదరి

రిలీజ్ డేట్ : 11 జనవరి 2008

బాలకృష్ణ, అనుష్క, సిమ్రాన్ నటించిన కలర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒక్క మగాడు. ఈ సినిమా పూర్తిగా బాలక్రిష్ణ మార్క్ కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమాలో బాలకృష్ణ మ్యానరిజం హైలెట్ గా నిలుస్తుంది. Y.V.S. చౌదరి డైరెక్షన్  చేసిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు.

============================================================================

నటీ నటులు : ప్రకాష్ రాజ్, జ్యోతిక

ఇతర నటీనటులు : బెంట్లీ మిచ్ మమ్, అనుపమ్ ఖేర్, నాజర్, కళ్ళు చిదంబరం, ఫాతిమా బేబీ

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ మణి

డైరెక్టర్ : సింగీతం శ్రీనివాసరావు

ప్రొడ్యూసర్స్ : గడ్డం శివ, టి. రామ్ ప్రసాద్

=============================================================================

నటీనటులు : దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, లీలా స్యామ్ సన్

మ్యూజిక్ డైరెక్టర్ : A.R.రెహ్మాన్

డైరెక్టర్ : మణిరత్నం

ప్రొడ్యూసర్ : మణిరత్నం

రిలీజ్ డేట్ : 17 ఏప్రిల్ 2015

మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఓకె కన్మణి’ కి డబ్బింగ్ వర్షన్ ‘ ఓకె బంగారం’. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ రెండు భాషలలోను ఒకేసారి రిలీజయి సూపర్ హిట్టయింది. మాడరన్ యూత్ మైండ్ సెట్ కి, సాంప్రదాయాలకి మధ్య సాగే యూత్ ఫుల్ ప్లాట్ తో తెరకెక్కిందే ‘ఓకె బంగారం’. ఈ సినిమాకి A.R. రెహ్మాన్ సంగీతం అందించాడు.

===========================================================================

నటీనటులు : అల్లరి నరేష్, స్నేహ ఉల్లాల్

ఇతర నటీనటులు : మర్యమ్ మజారియా, ఆశిష్ విద్యార్థి, ఆలీ, సుబ్బరాజు, ధర్మవరpపు సుబ్రహ్మణ్యం, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్

డైరెక్టర్ : సీతారామరాజు దంతులూరి

ప్రొడ్యూసర్ : వేదరాజు టింబర్

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

అల్లరి నరేష్ నటించిన హిల్లేరియస్ ఎంటర్ టైనర్ మడత కాజా. పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేసే ఒక యువకుడు, మాఫియా డాన్ చేస్తున్న ఆకృత్యాలను ఎలా బయటికి లాగాడనే అనే అంశంతో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమాలో కామెడీ హైలెట్ గా నిలిచింది.

============================================================================

నటీనటులు : ఛార్మి, బాల కుమార్

ఇతర నటీనటులు : కళాభవన్ మణి, మణి వణ్ణన్, మీరా కృష్ణన్, వివేక్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విద్యా సాగర్

డైరెక్టర్ : P. వాసు

ప్రొడ్యూసర్ : మురారిశెట్టి లక్ష్మణ్

రిలీజ్ డేట్ : 2010

ఛార్మి, బాల కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఇందు. తమిళ, తెలుగు భాషల్లో రిలీజైన ఈ సినిమా అటు కోలీవుడ్ లోను, ఇటు టాలీవుడ్ లోను సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడింది. చార్మి నటన సినిమాకి హైలెట్.