జీ సినిమాలు ( మార్చి 16th )

Wednesday,March 15,2017 - 10:08 by Z_CLU

హీరోహీరోయిన్లు – వినోద్ కుమార్, ప్రేమ

సంగీతం – సుధీర్

దర్శకత్వం – తమ్మారెడ్డి భరధ్వాజ

విడుదల తేదీ – 1997

సమర్పణ – రామానాయుడు

నిర్మాత – ఎ. సూర్యనారాయణ

=============================================================================

నటీనటులు  – బాలకృష్ణ, లైలా

ఇతర నటీనటులు – రోషిని, కోట శ్రీనివాసరావు, సుధాకర్, అలీ, పొన్నాంబలం

మ్యూజిక్ డైరెక్టర్  – కోటి

డైరెక్టర్  – ముత్యాల  సుబ్బయ్య

రిలీజ్ డేట్  – 1998, జూన్  4

నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి 1997లో పెద్దన్నయ్య, ముద్దుల మొగుడు అనే రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. వాటి తర్వాత బాలయ్య సినిమాలపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలా 1998లో భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం పవిత్ర ప్రేమ. అప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న లైలాను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది.

==============================================================================

నటీ నటులు : నాని, శరణ్య మోహన్

ఇతర నటులు : కిషోర్, ధనరాజ్, వినయ్, సంతోష్, శివ, రమేష్, కృష్ణ, చంటి

మ్యూజిక్ డైరెక్టర్  : V. సెల్వ గణేష్

డైరెక్టర్ : తాతినేని సత్య

నిర్మాత : NV ప్రసాద్, పరాస్ జైన్

తమిళంలో సూపర్ హిట్టయిన ‘వెన్నిల కబడీ కుజు’ సినిమాను భీమిలి కబడ్డీ జట్టు గా తెరకెక్కించారు. వైజాగ్ పరిసర ప్రాంతమైన భీమిలి పరిసర ప్రాంతాల్లో జరిగే సెన్సిటివ్ కథగా తెరకెక్కింది భీమిలి కబడ్డీ జట్టు. సెన్సిటివ్ ప్రేమ కథతో మొదలైన కథే అయినా, తన జట్టును గెలిపించడం కోసం, ఆఖరి శ్వాస వరకు పోరాడే యువకుడి క్యారెక్టర్ లో నాని నటన అద్భుతం.

============================================================================

నటీ నటులు : హరీష్, సంఘవి

ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, శ్రీ లక్ష్మి, AVS సుబ్రహ్మణ్యం

మ్యూజిక్ డైరెక్టర్  : M.M.కీరవాణి

డైరెక్టర్ : జంధ్యాల

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 1996

ముగ్గురు బిజినెస్ సక్సెస్ ఫుల్ బిజినెస్ పార్ట్ నర్స్. వారి రిలేషన్ షిప్స్, సంపాదన నిలకడగా ఉండాలన్న ఉద్దేశంతో పిల్లల ఇష్టాయిష్టాలు కూడా కనుక్కోకుండా పెళ్లి  నిర్ణయిస్తారు. ఆ పెళ్లి ఇష్టం లేని ఇద్దరు ఇంట్లోంచి పారిపోతారు.వాళ్ళే హరీష్, సంఘవి. బయట తమను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటం కోసం హరీష్ అమ్మాయిలా, సంఘవి మగాడిలా వేషం మార్చుకుని బావా, మరదళ్ళని చెప్పుకుంటారు. ఆ తరవాత ఎం జరిగిందనేది ప్రధాన కథాంశం.

==============================================================================

నటీ నటులు : NTR, హన్సిక మోత్వాని, తానీషా ముఖర్జీ

ఇతర నటీనటులు : ఆశిష్ విద్యార్థి, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రఘు బాబు, ముకేష్ రిషి, ఆలీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : మెహర్ రమేష్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 9 మే 2008

NTR, హన్సిక మోత్వాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ కంత్రి. స్టైలిష్ ఎంటర్ టైనర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని అశ్విని దత్ నిర్మించారు.  పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో క్లైమాక్స్ కి కాస్త ముందుగా వచ్చే ట్విస్ట్ హైలెట్.

=============================================================================

నటీ నటులు : N.T.రామారావు, జమున, అంజలి

ఇతర నటీనటులు : S.వరలక్ష్మి, L.విజయలక్ష్మి, కాంతారావు, రాజనాల, పద్మనాభం, వాణిశ్రీ

మ్యూజిక్ డైరెక్టర్ : పెండ్యాల

డైరెక్టర్ : K. కామేశ్వర రావు

ప్రొడ్యూసర్ : రామా నాయుడు

రిలీజ్ డేట్ : 1966

NTR కరియర్ లోని పౌరాణిక సినిమాల్లో ఒక ఆణిముత్యం శ్రీ కృష్ణ తులాభారం… శ్రీకృష్ణుడు తన భార్యల మధ్య అపురూప సన్నివేశాలతో అద్భుతంగా తెరకెక్కిందే శ్రీ కృష్ణ తులాభారం. పెండ్యాల సంగీతం అందించిన ఈ సినిమాకి K.కామేశ్వర రావు డైరెక్షన్ చేశారు.

============================================================================

నటీనటులు : కమల్ హాసన్, మాధవన్, త్రిష, సంగీత

ఇతర నటీనటులు : రమేష్ అరవింద్, ఊర్వశి, ఉషా ఊతప్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్  : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : K.S. రవి కుమార్

ప్రొడ్యూసర్ : సుబ్రహ్మణ్యం B, రూపేష్ Y

రిలీజ్ డేట్ : 23 డిసెంబర్ 2010

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి, కామెడీ సినిమాలకి విభిన్నంగా తెరకెక్కిన కమర్షియల్ హిల్లెరియాస్ ఎంటర్ టైనర్ మన్మధ బాణం. సక్సెస్ ఫుల్ హీరోయిన్ అంబుజాక్షి కి, మదన్ ఇంకొన్ని రోజుల్లో పెళ్లి నిర్ణయిస్తారు పెద్దలు. కోటీశ్వరుడైన మదన్ అంబుజా అంటే ఇష్టమే కానీ, ఎక్కడో అంబుజా కి సీక్రెట్ లవర్ ఉన్నాడనే అనుమానం త్లిచివేస్తూ ఉంటుంది. అప్పుడు మదన్ ఆ వ్సిహాం తేల్చుకోవడానికి ఓ డిటెక్టివ్ ని పెడతాడు. ఆ డిటెక్టివ్ క్యారెక్టర్ ని కమల్ హాసన్ పోషించాడు. అంబుజా , మదన్ లుగా, త్రిష, మాధవన్ నటించారు.  అసలు కథ ఏ మలుపులు తిరిగింది..? చివరికి ఏం జరిగిందనేది ZEE Cinemalu లో చూడాల్సిందే…