జీ సినిమాలు ( మార్చి 13th)

Sunday,March 12,2017 - 10:07 by Z_CLU

నటీనటులు : సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి

ఇతర నటీనటులు : జగ్గయ్య, కాంతారావు, P.R. వరలక్ష్మి, విజయలక్ష్మి, బిందు మాధవి తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : T. రామారావు

ప్రొడ్యూసర్ : మిద్దె రామారావు

రిలీజ్ డేట్ : 7 సెప్టెంబర్ 1985

సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన ఇమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పచ్చని కాపురం. ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువ జంట, కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోతారు. వారిద్దరూ మళ్ళీ కలుసుకునే క్రమంలో క్రియేట్ అయ్యే ఇమోషనల్ సన్నివేశాలు సినిమాలు హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమాకి తాతినేని రామారావు దర్శకత్వం వహించాడు.

==============================================================================

నటీనటులు – సుమన్ మాలాశ్రీ

ఇతర నటీనటులు – సురేష్, మాలాశ్రీ, లక్ష్మి, శ్రీవిద్య

మ్యూజిక్ డైరెక్టర్ – రాజ్ కోటి

డైరెక్టర్ – గుహనాధన్

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ – 1993

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ పరువు-ప్రతిష్ట. లో-బడ్జెట్ లో తీసిన ఈ సినిమా భారీ విజయాన్నందుకుంది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో మాలాశ్రీ కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా… సుమన్ ఈ తరహా పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయారు. గుహనాధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. 1993 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా పేరుతెచ్చుకుంది.

=============================================================================

నటీనటులు – తరుణ్ ,జెనీలియా

ఇతర నటీనటులు – పరుచూరి గోపాలకృష్ణ, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, రఘుబాబు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్  –  మణిశర్మ, విద్య సాగర్

డైరెక్టర్   –  కృష్ణ వంశీ

రిలీజ్ డేట్ – 2009

వరుస ప్రేమ కథా చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ అందుకొని లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తరుణ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన చిత్రం ‘శశిరేఖ పరిణయం’. జెనీలియా శశి రేఖ గా నటించిన ఈ చిత్రం  2009 లో విడుదలైంది. ఈ చిత్రం తో తొలి సారిగా జత కట్టారు తరుణ్-జెనీలియా. కాబోయే భార్య భర్తల మధ్య ఎమోషనల్ సన్నివేశాలతో లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా అలరించింది. ఈ చిత్రం లో పెళ్లంటే భయపడే అమ్మాయి పాత్రలో  జెనీలియా నటన, ఒక అమ్మాయి గురించి తన జీవితం గురించి ఆలోచించే యువకుడి పాత్రలో తరుణ్ అందరినీ ఆకట్టుకున్నారు. తన ప్రతి సినిమాలో కుటుంబ విలువలను చాటి చెప్పే క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని కూడా అదే కోవలో ఫ్యామిలీ అంశాలతో కూడిన లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించి అలరించారు.

==============================================================================

నటీ నటులు : శ్రీకాంత్, మోనికా బేడి, సంఘవి

ఇతర నటీనటులు : శ్రీహరి, రంగనాథ్, కోట శ్రీనివాస రావు, నూతన్ ప్రసాద్, సుధ, బ్రహ్మానందం

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. శ్రీలేఖ

డైరెక్టర్ : ముప్పలనేని శివ

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 25 మే 1995

శ్రీకాంత్ హీరోగా ముప్పలనేని శివ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ తాజ్ మహల్. శ్రీకాంత్ ని లవర్ బాయ్ గా సిల్వర్ స్క్రీన్ పై లవర్ బాయ్ గా ఎస్టాబ్లిష్ చేసిన  సినిమా ఇది. శ్రీకాంత్ సరసన మోనికా బేడీ, సంఘవి నటించారు. M.M. శ్రీలేఖ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలెట్.

=============================================================================

నటీనటులు :  S.J. సూర్య, తమన్నా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, నమిత, మాళవిక, వడివేలు, సీత, N. సంతానం, నాజర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవ

డైరెక్టర్ : శక్తి చిదంబరం

ప్రొడ్యూసర్ : శక్తి ప్రీతమ్, శక్తి తేజ

రిలీజ్ డేట్ : 13 జూలై 2007

బిల్ గేట్స్ కన్నా గొప్ప ధనవంతుడు కావాలని టార్గెట్ పెట్టుకున్న హీరో, ఈ ప్రాసెస్ లో తన ఫ్యామిలీ లైఫ్ కి పూర్తిగా దూరమైపోతాడు.  దానికి తోడు తను తీసుకున్న ఓ కీలక నిర్ణయం పెద్ద సమస్యనే తీసుకొచ్చి పెడుతుంది.తన తన లైఫ్ లోని ప్రతి అంశాన్ని బిజినెస్ తో ముడిపెట్టే హీరో తన తల్లిని కోల్పోయాక తనెంత పెద్ద తప్పు చేస్తున్నాడో తెలుసుకుంటాడు. శక్తి చిదంబరం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా నటన హైలెట్ గా నిలిచింది.

==============================================================================

నటీ నటులు : N.T.రామారావు, జమున

ఇతర నటీనటులు : S.V. రంగారావు, గిరిజ, రేలంగి, రమణ రెడ్డి, సూర్య కాంతం, రాజనాల, L. విజయ లక్ష్మి

మ్యూజిక్ డైరెక్టర్ : పెండ్యాల నాగేశ్వర రావు

డైరెక్టర్ : తాపీ చాణక్య

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 21 మే 1964

నందమూరి తారక రామారావు గారి కరియర్ లో ఆయన టచ్ చేయని జోనర్ లేదు. కామెడీ జోనర్ లో తెరకెక్కిన ‘రాముడు- భీముడు’ ఆల్ టైం హిట్. ఈ సినిమాని ఇప్పుడు చూసినా అంతే ఎంజాయ్ చేస్తారు ఆడియెన్స్. రొటీన్ లైఫ్ లో బోర్ అయిపోయి చూడటానికి ఒకేలా ఉండే రాముడు భీముడు ఒకరి స్థానంలో ఒకరు రావడంతో, మంచి కామెడీ జెనెరేట్ అవుతుంది. డ్యూయల్ రోల్ లో నటించిన NTR పర్ఫామెన్స్ హైలెట్.

=============================================================================

నటీ నటులు : ఉదయ కిరణ్, మీరా జాస్మిన్

ఇతర నటీనటులు:  రంభ, రోహిణి, రిచర్డ్, రాఘవ లారెన్స్, లక్ష్మి రాయ్

మ్యూజిక్ డైరెక్టర్ : దేవ

డైరెక్టర్ : బలి శ్రీరంగం

ఉదయ కిరణ్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అల్లాడిస్తా’. మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది. ఉదయ కిరణ్ ఈ సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ గా నటించాడు. రంభ ఒక ప్రత్యేక పాత్రలో అలరిస్తుంది. దేవ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలెట్.