జీ సినిమాలు (మార్చి 10th)

Thursday,March 09,2017 - 10:00 by Z_CLU

నటీనటులు : కుమార్ రాజా, సితార ,కె.ఆర్. విజయ, బేబీ షామిలి.

ఇతర నటీనటులు : సుత్తి వేలు, సాక్షి రంగారావు, జీవ, కాకా రావు  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కృష్ణ తేజ

డైరెక్టర్ : రామ్ సురేష్

ప్రొడ్యూసర్ : కన్నెగంటి రామ్ మోహన్ రావు

కుమార్ రాజా, సితార జంటగా రామ్ సురేష్ దర్శకత్వం లో తెరకెక్కిన భక్తి రస చిత్రం ‘శుక్రవారం మహా లక్ష్మి’. కె.ఆర్.విజయ మహాలక్ష్మి దేవతగా నటించిన ఈ సినిమాలో కొన్ని భక్తి సన్నివేశాలు, కె.ఆర్.విజయ నటన, కుమార్ రాజా సితార మధ్య వచ్చే సీన్స్, కృష్ణ తేజ సంగీతం హైలైట్స్.

==============================================================================

నటీ నటులు : నాగార్జున, అమల

ఇతర నటీనటులు : రఘువరన్, J.D.చక్రవర్తి, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, పరేష్ రావల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయ రాజా

డైరెక్టర్ : రామ్ గోపాల్ వర్మ

ప్రొడ్యూసర్ : అక్కినేని వెంకట్

రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 1990

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘శివ’ దాదాపు అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రూపు రేఖల్ని మార్చేసింది. సినిమా అంటే ఇలాగే ఉండాలి అని ఒక రితీన్ ఫార్మూలాలో వెళుతున్న ట్రెండ్ ఒక పెద్ద కుదుపు లాంటిదీ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయి 26 గడిచినా ఆ సినిమా పట్ల ఉన్న క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ సినిమాకి ఇళయ రాజా ఇచ్చిన సంగీతం ఇప్పటికీ ఫ్రెష్ గానే అనిపిస్తుంది.

==============================================================================

 

నటీనటులు : సిద్ధార్థ్, జెనీలియా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయసుధ, సత్య కృష్ణన్, సుదీప పింకీ, సురేఖా వాణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 9 ఆగష్టు 2006

తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బొమ్మరిల్లు. న్యాచురల్ పర్ఫామెన్స్ అలరించిన జెనీలియా, సిద్ధార్థ్ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

=============================================================================

నటీనటులు  – సురేష్, మాలాశ్రీ

ఇతర నటీనటులు – సుధాకర్, నర్రా, బ్రహ్మానందం, మురళీమోహన్, చంద్రమోహన్, జయసుధ

మ్యూజిక్ డైరెక్టర్ –  రాజ్ కోటి

ప్రొడ్యూసర్  –  డాక్టర్ డి.రామానాయుడు

డైరెక్టర్ – బోయిన సుబ్బారావు

రిలీజ్ డేట్ – 1994

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన మరో కుటుంబకథాచిత్రం తోడికోడళ్లు. సురేష్, మాలాశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కీలకపాత్రల్లో జయసుధ, మురళీమోహన్, చంద్రమోహన్ నటించారు. రాజ్ కోటి ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. గోదావరి అందాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

=============================================================================

 

నటీనటులు : రవి తేజ, శ్రియ

ఇతర నటీనటులు :  ప్రకాష్ రాజ్, నాజర్,

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్

ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి

రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005

రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా   ‘భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవి తేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

==============================================================================

నటీనటులు : పృథ్వీ రాజ్, కావ్య మాధవన్

ఇతర నటీనటులు : మనోజ్ K జయన్

మ్యూజిక్ డైరెక్టర్ : M.G. రాధా కృష్ణన్

డైరెక్టర్ : సంతోష్ శివన్

ప్రొడ్యూసర్ : మనియన్ పిల్ల రాజు

రిలీజ్ డేట్ : 4 నవంబర్ 2005

పృథ్వీరాజ్, కావ్య మాధవన్ నటించిన అల్టిమేట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ శివపురం. సంతోష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన ఈ సినిమా 5 స్టేట్ అవార్డులను దక్కించుకుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

నటీనటులు : పోసాని కృష్ణమురళి, ఆర్తి అగర్వాల్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, నాగబాబు, M.S. నారాయణ, ఆలీ, సుధ, సురేఖా వాణి తదితరులు

డైరెక్టర్ : పోసాని కృష్ణ మురళి

ప్రొడ్యూసర్ : నల్లం పద్మజ

రిలీజ్ డేట్ : 2009

పోసాని కృష్ణమురళి డైరెక్షన్ లో వచ్చిన డిఫెరెంట్ సినిమా పోసాని జెంటిల్ మెన్. తన భర్త జెంటిల్ మెన్ అని నమ్మే భార్య, తన భర్త నిజాయితీని తెలసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ తరవాత ఏం జరిగింది అనేదే ప్రధాన కథాంశం.