జీ సినిమాలు ( జనవరి 4th )

Tuesday,January 03,2017 - 10:00 by Z_CLU

nalugu-sthambalata-zee-cinemalu

నటీనటులు  – నరేష్, పూర్ణిమ

ఇతర నటీనటులు – ప్రదీప్, తులసి, సుత్తివేలు, శ్రీలక్ష్మి

మ్యూజిక్ డైరెక్టర్ – రాజన్ నాగేంద్ర

డైరెక్టర్  – జంధ్యాల

విడుదల తేదీ – 1982,   మే 15

1982 అప్పుడే ప్రారంభమైంది. అప్పటికి జంధ్యాల దర్శకుడిగా మారి రెండేళ్లయింది. మొదటి సినిమా హిట్. రెండో సినిమా ఫ్లాప్. అదే టైంలో నరేష్ కూడా హీరోగా మారాడు. మొదటి సినిమా ఏమైందో ఎవరికీ తెలీదు. రెండో సినిమా ఎలా చేద్దామా అని ఆలోచనలో ఉన్న రోజులు.  సరిగ్గా అప్పుడే ఈ హాస్యబ్రహ్మ దృష్టిలో నరేష్ పడ్డాడు. నవత బ్యానర్ పై నాలుగు స్తంభాలాట సినిమాకు నరేష్ ను హీరోగా పెట్టి దర్శకత్వం వహించారు జంధ్యాల. నిజానికి ఇదే నరేష్ మొదటి సినిమాగా కూడా చలామణి అయిపోతోంది. తొలిసినిమా ముద్దమందారంతో జంధ్యాలను లైట్ తీసుకున్న వాళ్లంతా… నాలుగు స్తంభాలాట సినిమాతో ఆయనలోని దర్శకత్వ  చమక్ ను గుర్తించగలిగారు. అలా కామెడీ సినిమాల దర్శకుడిగా జంధ్యాల, కామెడీ హీరోగా నరేష్ ను నిలబెట్టింది నాలుగు స్తంభాలాట సినిమా. కామెడీనే ఈ సినిమాకు హైలెట్ అనుకుంటే… రాజన్ నాగేంద్ర సంగీతం అంతకంటే హైలెట్. చినుకులా రాలి అనే పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

=============================================================================

velugu-needalu-zee-cinemalu

నటీ నటులు : అక్కినేని నాగేశ్వర రావు, జగ్గయ్య, సావిత్రి, గిరిజ, సూర్యకాంతం

ఇతర నటీనటులు : S.V.రంగారావు, రేలంగి వెంకట రామయ్య, రాజ సులోచన, B. పద్మనాభం తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : పెండ్యాల నాగేశ్వర రావు

డైరెక్టర్ : ఆదుర్తి సుబ్బారావు

ప్రొడ్యూసర్ : D. మధుసూదన రావు

నిర్మాత దుక్కిపాటి మధుసూదన రావు స్వీయానుభవం నుండి పుట్టుకొచ్చిందే వెలుగు నీడలు కథ. దానికి ఇంకొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి అత్యద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు వెలుగు, నీడల్లాంటివి అని సున్నితంగా చెప్పే కథాంశమే వెలుగు నీడలు. నాగార్జున తొలిసారిగా స్క్రీన్ పై కనిపించిన సినిమా ఇదే.

=========================================================================== lakshmi-rave-maa-intiki-zee-cinemaluనటీనటులు : నాగశౌర్య, అవికా గోర్

ఇతర నటీనటులు : వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, కాశి విశ్వనాథ్, సప్తగిరి, సత్యం రాజేష్, నల్ల వేణు, ప్రగతి, పవిత్ర లోకేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రాధాకృష్ణ

డైరెక్టర్ : నంద్యాల రవి

ప్రొడ్యూసర్ : గిరిధర్ మామిడిపల్లి

రిలీజ్ డేట్ : డిసెంబర్ 5, 2014

నాగశౌర్య, అవికా గోర్ జంటగా తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా కుటుంబ చిత్రం లక్ష్మీ రావే మా ఇంటికి. నంద్యాల రవి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని థియేటర్ల లోను సూపర్ హిట్ అయింది. రాధాకృష్ణ సంగీతం సినిమాకి హైలెట్.

==============================================================================

patala-bhairavudu-zee-cinemalu

నటీ నటులు : ప్రకాష్ రాజ్, జ్యోతిక

ఇతర నటీనటులు : బెంట్లీ మిచ్ మమ్, అనుపమ్ ఖేర్, నాజర్, కళ్ళు చిదంబరం, ఫాతిమా బేబీ

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ మణి

డైరెక్టర్ : సింగీతం శ్రీనివాసరావు

ప్రొడ్యూసర్స్ : గడ్డం శివ, టి. రామ్ ప్రసాద్

=============================================================================

okka-magadu-zee-cinemalu

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు : నిషా కొఠారి, అశుతోష్ రానా, రవి కాలె, సలీం బేగ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : Y.V.S.చౌదరి

ప్రొడ్యూసర్ :  Y.V.S.చౌదరి

రిలీజ్ డేట్ : 11 జనవరి 2008

బాలకృష్ణ, అనుష్క, సిమ్రాన్ నటించిన కలర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒక్క మగాడు. ఈ సినిమా పూర్తిగా బాలక్రిష్ణ మార్క్ కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమాలో బాలకృష్ణ మ్యానరిజం హైలెట్ గా నిలుస్తుంది. Y.V.S. చౌదరి డైరెక్షన్  చేసిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు.

============================================================================

chanti-zee-cinemalu

నటీనటులు  – రవితేజ,  చార్మి

ఇతర నటీనటులు –  డైజీ బోపన్న, అతుల్ కులకర్ణి, రేవతి, రఘుబాబు, సుబ్బరాజు, వేణుమాధవ్

మ్యూజిక్ డైరెక్టర్  – శ్రీ

డైరెక్టర్  – శోభన్

ప్రొడ్యూసర్ : కృష్ణ కిషోర్

విడుదల తేదీ – 2004, నవంబర్ 12

హీరో రవితేజ అప్పటికే పూర్తిస్థాయి హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇడియట్, ఖడ్గం, ఇట్లు శ్రావణి  సుబ్రమణ్యం లాంటి హిట్స్ ఉన్నాయి. మరోవైపు శోభన్ వర్షం సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ చంటి. చార్మి హీరోయిన్  గా నటించిన ఈ సినిమాకు శ్రీ సంగీతం అందించాడు. దర్శకుడు  శోభన్ కు ఇదే ఆఖరి చిత్రం. ఈ సినిమా తర్వాత కన్నడంలో మరో సినిమా ఎనౌన్స్ చేసినప్పటికీ… అది సెట్స్ పైకి వెళ్లకముందే తీవ్రమైన గుండెపోటుతో శోభన్ చనిపోయారు. అదే ఏడాది శోభన్ సోదరుడు, ప్రముఖ కమెడియన్ లక్ష్మీపతి కూడా కన్నుమూయడం బాధాకరం.

=============================================================================

Trisha, Jeeva in Chirunavvula Chirujallu Movie Wallpapers

నటీనటులు : జీవా, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : వినయ్, సంతానం, నాజర్, జగన్, T.M. కార్తీక్, అభినయ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : I. అహ్మద్

ప్రొడ్యూసర్ : తమిళ్ కుమారన్

రిలీజ్ డేట్ : 20 డిసెంబర్ 2013

జీవా, త్రిష నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిరునవ్వుల చిరుజల్లు. హారిస్ జయరాజ్ అందించిన సంగీతం సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.