జీ సినిమాలు ( జనవరి 26th)

Wednesday,January 25,2017 - 10:00 by Z_CLU

kaliyuga_pandavulu

కలియుగ పాండవులు

నటీ నటులు : వెంకటేష్, ఖుష్బూ

ఇతర నటీనటులు : అశ్విని, రావు గోపాల్ రావు, నూతన్ ప్రసాద్, రంగనాథ్, రాళ్ళపల్లి తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ :  K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 1986

విక్టరీ వెంకటేష్ నటించిన ఫస్ట్ మూవీ కలియుగ పాండవులు. వెంకటేష్, ఖుష్బూ జంటగా నటించిన ఈ సినిమా వెంకటేష్ కరియర్ లో ఫస్ట్ సినిమా అయినా ఇదే. టర్నింగ్ పాయింట్ సినిమా కూడా ఇదే. మొదటి సినిమాతోనే వెంకటేష్ కి మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టిందీ సినిమా. రాఘవేంద్ర రావు డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించారు.

===========================================================================

ahanapellanta-rajendra-prasad

అహ నా పెళ్ళంట

నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, రజని

ఇతర నటీనటులు : నూతన ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాళ్ళపల్లి, బ్రహ్మానందం, సుత్తి వీరభద్ర రావు, శుభలేఖ సుధాకర్, విద్యా సాగర్

మ్యూజిక్ డైరెక్టర్ : రమేష్ నాయుడు

డైరెక్టర్ : జంధ్యాల

ప్రొడ్యూసర్ : డి. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 27 నవంబర్ 1987

అహ నా పెళ్ళంట. ఈ సినిమా గురించి తెలుగు వారికి పెద్దగా పరిచయం అవసరం లేదు. 1987 లో జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆల్ టైం సూపర్ హిట్ అనిపించుకుంది. పరమ పిసినారిగా కోట శ్రీనివాస రావు నటన సినిమాకే హైలెట్. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం క్యారెక్టర్స్ సినిమా చూస్తున్నంత సేపు నవ్విస్తూనే ఉంటారు. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో జంధ్యాల తరం స్టార్ట్ అయింది.

 

============================================================================

 sivayya

శివయ్య

నటీనటులు : రాజశేఖర్, సంఘవి, మోనికాబేడి

ఇతర నటీనటులు : చలపతి రావు, అశోక్ కుమార్, రమాప్రభ, AVS, అనంత్, గిరిబాబు, వేణు మాధవ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ లేఖ

డైరెక్టర్ : సురేష్ వర్మ

ప్రొడ్యూసర్ : డా. డి. రామానాయుడు

రిలీజ్ డేట్ : 1998 మార్చి 27

ఆంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ శివయ్య. మోనికా బేడీ, సంఘవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి సురేష్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో రవిబాబు విలన్ ఇంట్రడ్యూస్ అయ్యాడు.

=============================================================================

ganesh

గణేష్

నటీ నటులు : వెంకటేష్, రంభ, మధుబాల

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, చంద్ర మోహన్, కోట శ్రీనివాస్ రావు, రేవతి, అశోక్ కుమార్.

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : తిరుపతిస్వామి

నిర్మాత : రామా నాయుడు

రిలీజ్ డేట్ : 19 జూన్ 1998

‘ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్- గణేష్’ . ఈ డైలాగ్ కొన్ని రోజుల వరకు యూత్ నోటిలో ఊతపదంలా వినిపించేది అంత ఇంపాక్ట్ చూపించింది గణేష్ సినిమా. ఒక సాధారణ జర్నలిస్ట్ రోల్ లో అతి సహజంగా నటించాడు విక్టరీ వెంకటేష్. కరప్టెడ్ డాక్టర్స్ వల్ల తన కుటుంబంలో చోటు చేసుకున్న విషాదంతో, తిరగబడ్డ గణేష్ ఎలా సంఘ విద్రోహులను మట్టి కరిపించాడు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ గణేష్. మణిశర్మ సంగీతం సినిమాకి ఎసెట్.

===========================================================================

lakshmi-raave-maa-intiki-first-look-posters-1

లక్ష్మీ  రావే మా ఇంటికి

నటీనటులు : నాగశౌర్య, అవికా గోర్

ఇతర నటీనటులు : వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, కాశి విశ్వనాథ్, సప్తగిరి, సత్యం రాజేష్, నల్ల వేణు, ప్రగతి, పవిత్ర లోకేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రాధాకృష్ణ

డైరెక్టర్ : నంద్యాల రవి

ప్రొడ్యూసర్ : గిరిధర్ మామిడిపల్లి

రిలీజ్ డేట్ : డిసెంబర్ 5, 2014

నాగశౌర్య, అవికా గోర్ జంటగా తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా కుటుంబ చిత్రం లక్ష్మీ రావే మా ఇంటికి. నంద్యాల రవి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని థియేటర్ల లోను సూపర్ హిట్ అయింది. రాధాకృష్ణ సంగీతం సినిమాకి హైలెట్.

===========================================================================

shiva-ganga-zee-cinemalu

శివగంగ

నటీనటులు : శ్రీరామ్, రాయ్ లక్ష్మి

ఇతర నటీనటులు : సుమన్, జాన్ పీటర్, శరవణన్, శ్రీనివాసన్, సింగం పూడి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జాన్ పీటర్

డైరెక్టర్ : V.C. వడివుడియన్

ప్రొడ్యూసర్ : జాన్ మ్యాక్స్, జోన్స్

రిలీజ్ డేట్ : మార్చి 4, 2016

శ్రీ రామ్, రాయ్ లక్ష్మీ నటించిన అల్టిమేట్ హారర్ ఎంటర్ టైనర్ శివగంగ. వడివుడియన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలిచాయి.

============================================================================

prathinidhi

ప్రతినిధి

నటీ నటులు : నారా రోహిత్ , శుబ్ర అయ్యప్ప

ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, విష్ణు, జయ ప్రకాష్ రెడ్డి, గిరిబాబు, రంగనాథ్, రవి ప్రకాష్.

మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్

డైరెక్టర్ : ప్రశాంత్ మండవ

ప్రొడ్యూసర్ : సాంబశివ రావు

రిలీజ్ డేట్ : 25 April 2004

 మొదటి సినిమా బాణంతోనే నారా రోహిత్ అంటే ఎవరో.. అతడి రూటు ఏంటో అందరికీ తెలిసిపోయింది. అలా తనకంటూ ఓ జానర్, సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న ఈ హీరో నటించిన మరో చిత్రం ప్రతినిధి. ఈ సినిమా కూడా సంథింగ్ స్పెషల్ అనిపించుకుంది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే కిడ్నాప్ చేసే స్టోరీలైన్… నారా రోహిత్ సెటిల్ యాక్టింగ్… హీరోయిన్ శుబ్ర అయ్యప్ప, పోసానిల యాక్టింగ్… సాయికార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు హైలెట్స్. 2014లో రిలీజైన ఈ సినిమా మస్ట్ వాచ్ మూవీస్ లో ఒకటంటూ క్రిటిక్స్ తో ప్రశంసలు కూడా దక్కించుకుంది.