జీ సినిమాలు ( జనవరి 24th)

Monday,January 23,2017 - 10:00 by Z_CLU

premaco-zee-cinemalu

ప్రేమ అండ్ కో –

హీరోహీరోయిన్లు – నరేష్, వాణీ విశ్వనాథ్

నటీనటులు – రావుగోపాల్రావు, గిరిబాబు, మల్లికార్జునరావు, శివాజీరాజా, బ్రహ్మానందం

సంగీతం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – వంశీ

విడుదల తేదీ – 1994

లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల, చెట్టుకింద ప్లీడర్.. ఇలా వరుస విజయాలతో వంశీ ఊపుమీదున్న రోజులవి. అయితే సినిమాలు మాత్రం సెలక్టివ్ గానే చేసేవారు వంశీ. కథ, కథనం, సంగీతం అన్నీ సెట్ అయిన తర్వాత మాత్రమే సెట్స్ పైకి వెళ్లేవారు. జోకర్ సినిమా వచ్చిన తర్వాత దాదాపు 7నెలలు గ్యాప్ తీసుకొని వంశీ చేసిన సినిమా ప్రేమ అండ్ కో. నరేష్ వాణీవిశ్వనాద్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుంది. భానుప్రియ, సుహాసిని తర్వాత వంశీ దర్శకత్వంలో ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో నటించిన మూడో హీరోయిన్ గా వాణివిశ్వనాథ్ గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. తన మూవీస్ కు రెగ్యులర్ గా సంగీతం అందించే ఇళయరాజా బిజీగా ఉండడంతో… ప్రేమ అండ్ కో మూవీకి వంశీనే సంగీతం కూడా అందించారు.

=============================================================================

premnagar-zee-cinemalu

ప్రేమ నగర్ 

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ

ఇతర నటీనటులు : కైకాల సత్యనారాయణ, శాంత కుమారి, S.V. రంగారావు, గుమ్మడి వెంకటేశ్వర రావు, S. వరలక్ష్మి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K.V. మహదేవన్

డైరెక్టర్ : K.S. ప్రకాశ రావు

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 24 సెప్టెంబర్ 1971

అక్కినేని నాగేశ్వర రావు కరియర్ లో నటించిన అద్భుత ప్రేమకథల్లో ప్రేమ నగర్ కూడా ఒకటి. వాణిశ్రీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఇప్పటికీ ఆల్ టైం క్లాసిక్ క్యాటగిరీ లో ఉంటుంది. డబ్బు కన్నా ప్రేమ విలువ గొప్పది అని చాటే ఈ సినిమాలో ఇమోషనల్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

pilla-zamindar-zee-cinemalu

పిల్ల జమీందార్

నటీ నటులు : నాని, హరిప్రియ, బిందు మాధవి

ఇతర నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, M.S.నారాయణ, రావు రమేష్, శివ ప్రసాద్, తాగుబోతు రమేష్, ధనరాజ్, వెన్నెల కిశోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సెల్వ గణేష్

డైరెక్టర్ : G. అశోక్

ప్రొడ్యూసర్ : D.S. రావు

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

న్యాచురల్ స్టార్ నాని తన కరియర్ లో చాలా ఇష్టపడి చేసిన సినిమా పిల్ల జమీందార్. పుట్టుకతో కోటీశ్వరుడైన యువకుడు జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడు..? అనే సున్నితమైన కథాంశంతో, పర్ ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది పిల్ల జమీందార్. అష్టా చెమ్మా తరవాత నాని, అవసరాల కలిసి చేసిన సినిమా ఇదే.

==============================================================================

shiva-zee-cinemalu

శివ 

నటీ నటులు : నాగార్జున, అమల 

ఇతర నటీనటులు : రఘువరన్, J.D.చక్రవర్తి, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, పరేష్ రావల్ తదితరులు 

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయ రాజా 

డైరెక్టర్ : రామ్ గోపాల్ వర్మ 

ప్రొడ్యూసర్ : అక్కినేని వెంకట్ 

రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 1990

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన శివదాదాపు అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రూపు రేఖల్ని మార్చేసింది. సినిమా అంటే ఇలాగే ఉండాలి అని ఒక రితీన్ ఫార్మూలాలో వెళుతున్న ట్రెండ్ ఒక పెద్ద కుదుపు లాంటిదీ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయి 26 గడిచినా ఆ సినిమా పట్ల ఉన్న క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ సినిమాకి ఇళయ రాజా ఇచ్చిన సంగీతం ఇప్పటికీ ఫ్రెష్ గానే అనిపిస్తుంది.

==============================================================================

 superpolice-zee-cinemalu

సూపర్ పోలీస్

నటీ నటులు : వెంకటేష్, నగ్మా, సౌందర్య

ఇతర నటీనటులు : D. రామా నాయుడు, కోట శ్రీనివాస రావు, జయసుధ, బ్రహ్మానందం, ఆలీ, జయసుధ

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్

డైరెక్టర్ : K. మురళి మోహన్ రావు

ప్రొడ్యూసర్ : D. సురేష్

రిలీజ్ డేట్ : 23 జూన్ 1994

ఇన్స్ పెక్టర్ విజయ్ (వెంకటేష్) నిజాయితీ గల పోలీసాఫీసర్. తన గర్ల్ ఫ్రెండ్ ఒక ఆక్సిడెంట్ లో చనిపోతుంది. అప్పటి నుండి తాగుడుకు బానిస అయిన విజయ్ జర్నలిస్ట్ రేణుక ఇంటిలో అద్దెకు దిగుతాడు అంతలో విజయ్ కి అదే సొసైటీలో బిగ్ షాట్ గా చెలామణి అవుతున్న అబ్బాన్న తో వైరం ఏర్పడుతుంది. తనతో తలపడే ప్రాసెస్ తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది ఆసిదేంట్ వల్ల కాదు, అది ప్లాన్డ్ మర్డర్ అని తెలుసుకుంటాడు. తనని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..? తన దగ్గర ఉండిపోయిన సాక్ష్యాలేంటి అనే కోణంలో కథ ముందుకు సాగుతుంది. 

=============================================================================

nakili-zee-cinemalu

 

నకిలీ

నటీనటులు : విజయ్ అంటోని, సిద్ధార్థ్ వేణు గోపాల్

ఇతర నటీనటులు : రూప మంజరి, అనుయ భగవత్, విజయ్, విభ నటరాజన్, కృష్ణమూర్తి, ప్రమోద్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ అంటోని

డైరెక్టర్ : జీవ శంకర్

ప్రొడ్యూసర్ : ఫాతిమా విజయ్ అంటోని

రిలీజ్ డేట్ : 15 ఆగష్టు 2012

 విజయ్ అంటోని హీరోగా జీవ శంకర్ డైరేక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ నకిలీ. చిన్నప్పుడే తల్లిని చంపిన హత్యా నేరంలో జైలు కెళ్ళిన కుర్రాడు, జైలునుండి బయటికి వచ్చి ఏం చేశాడు..? అతని జీవితం ఏ మలుపు తిరిగింది అనేదే ప్రధాన కథాంశం.

===========================================================================

maha-zee-cinemalu

మహా

నటీనటులు : భరత్, మల్లిక కపూర్

ఇతర నటీనటులు : అరుణ్ కుమార్, దీపు, M.S. భాస్కర్, రేణుక

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ రాజా

డైరెక్టర్ : విజయ్ మిల్టన్

ప్రొడ్యూసర్ : బన్ని వాసు, సుమంత్

భరత్, మల్లిక నటించిన మహా అవుట్ అండ్ అవుట్ లవ్ ఎంటర్ టైనర్. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మనసులో తను లేనని తెలిసి కూడా, తను ప్రేమించిన అమ్మాయి ప్రేమను గెలిపించడం కోసం ఆ యువకుడు ఏం చేశాడన్నదే ప్రధాన కథాంశం, భరత్ నటన సినిమాకే హైలెట్.