జీ సినిమాలు (జనవరి 13th)

Thursday,January 12,2017 - 10:00 by Z_CLU

sukravaram-maha-lakshmi-zee-cinemaluనటీనటులు : కుమార్ రాజా, సితార ,కె.ఆర్. విజయ, బేబీ షామిలి.
ఇతర నటీనటులు : సుత్తి వేలు, సాక్షి రంగారావు, జీవ, కాకా రావు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కృష్ణ తేజ
డైరెక్టర్ : రామ్ సురేష్
ప్రొడ్యూసర్స్ : కన్నెగంటి రామ్ మోహన్ రావు

కుమార్ రాజా, సితార జంటగా రామ్ సురేష్ దర్శకత్వం లో తెరకెక్కిన భక్తి రస చిత్రం శుక్రవారం మహా లక్ష్మి‘. కె.ఆర్.విజయ మహాలక్ష్మి దేవతగా నటించిన ఈ సినిమాలో కొన్ని భక్తి సన్నివేశాలు, కె.ఆర్.విజయ నటన, కుమార్ రాజా సితార మధ్య వచ్చే సీన్స్, కృష్ణ తేజ సంగీతం హైలైట్స్.

============================================== 

ye-maya-chesave-zee-cinemaluనటీనటులు : నాగ చైతన్య, సమంతా రుత్ ప్రభు

ఇతర నటీనటులు : కృష్ణుడు, దేవన్, సుధీర్ బాబు, సంజయ్ స్వరూప్, సురేఖా వాణి, లక్ష్మీ రామకృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : గౌతమ్ వాసుదేవ్ మీనన్

ప్రొడ్యూసర్ : మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్

రిలీజ్ డేట్ : 26 ఫిబ్రవరి 2010

గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ఏ మాయ చేశావేసినిమా నాగ చైతన్య కరియర్ ట్రాక్ నే మార్చేసింది. ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయిన సమంతా, మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టేసుకుంది. అంత ఇంపాక్ట్ ని చూపించింది ఈ సినిమా. అతి సాధారణ ప్రేమకథని అద్భుతంగా తెరకెక్కించాడు గౌతమ్ మీనన్. A.R. రెహమాన్ సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

=========================================================================

chakram-zee-cinemaluనటీనటులు : ప్రభాస్, అసిన్, ఛార్మి కౌర్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, రాజ్యలక్ష్మి, రాధా కుమారి, నారాయణ రావు, కల్పన, పద్మనాభం తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : కృష్ణవంశీ
ప్రొడ్యూసర్ : వెంకట రాజు, శివ రాజు
రిలీజ్  డేట్ : 25 మార్చి 2005

ప్రభాస్ హీరోగా నటించిన చక్రంఅటు ప్రభాస్ కరియర్ లోను ఇటు డైరెక్టర్ కృష్ణవంశీ కరియర్ లోను చాల స్పెషల్ మూవీస్. ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆసిన్, ఛార్మి లు హీరోయిన్ లుగా నటించారు. లైఫ్ ఉన్నంత కాలం నవ్వుతూ బ్రతకాలనే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చక్రం. చక్రి అందించిన సంగీతం సినిమాకే హైలెట్.

=============================================================================

seenugadu-love-story

 హీరోహీరోయిన్లు – ఉదయనిథి స్టాలిన్, నయనతార

సంగీతం – హరీష్ జైరాజ్

దర్శకత్వం – ఎస్.ఆర్ ప్రభాకరన్

విడుదల తేదీ – 2015

అప్పటికే ఓకే ఓకే సినిమాతో తెలుగులో కూడా పెద్ద హిట్ అందుకున్నాడు ఉదయ్ నిధి స్టాలిన్. ఆ ఉత్సాహంతో 2014లో విడుదలైన తన తమిళ సినిమాను… శీనుగాడి లవ్ స్టోరీ పేరుతో తెలుగులోకి కూడా డబ్ చేసి రిలీజ్ చేశాడు. నయనతార హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాకు తెలుగులో కూడా రీచ్ పెరిగింది. పైగా తెలుగులో ఓకేఓకే హిట్ అవ్వడంతో.. శీనుగాడి లవ్ స్టోరీకి కూడా క్రేజ్ ఏర్పడింది. ప్రభాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు కూడా ఎప్పట్లానే తానే నిర్మాతగా వ్యవహరించాడు ఉదయ్ నిథి స్టాలిన్.

=============================================================================

ongole-githa-zee-cinemalu

నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

==========================================================================

Avunu 2 First Look HD Posters Poorna Ravi Babu

నటీ నటులు : పూర్ణ, హర్షవర్ధన్ రాణే

ఇతర నటీనటులు : రవి బాబు, సంజన గల్రాని, నిఖిత తుక్రాల్, రవి వర్మ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 3 ఏప్రిల్ 2015

రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అవును సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది అవును 2. ఈ సినిమా కూడా రవిబాబు మార్క్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. హీరోయిన్ పూర్ణ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

===============================================

tulasi-dalam-zee-cinemalu

నటీనటులు : నిశ్చల్, వందన, R.P. పట్నాయక్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, దువ్వాసి మోహన్, అనిత చౌదరి

మ్యూజిక్ డైరెక్టర్ : R.P. పట్నాయక్

డైరెక్టర్ : R.P. పట్నాయక్

ప్రొడ్యూసర్ : R.P. పట్నాయక్

రిలీజ్ డేట్ : 11 మార్చి 2016

 ఫార్ములా సినిమాలకు భిన్నంగా ఉంటాయి R.P. పట్నాయక్ సినిమాలు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన తులసీదళం 2016 లో రిలీజైన బెస్ట్ సినిమాలలో ఒకటి. సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్స్ లో నటిస్తూనే, ఈ  సినిమాకి దర్శకుడు, నిర్మాత, సంగీతం అన్ని తానాయి చూసుకున్నాడు R.P. పట్నాయక్.