జీ సినిమాలు ( జనవరి 11th)

Tuesday,January 10,2017 - 10:00 by Z_CLU

bommalu-cheppina-katha

నటీనటులు : కాంతా రావు, కృష్ణ, విజయనిర్మల

ఇతర నటీనటులు : సత్యనారాయణ, రాజబాబు, ధూళిపాళ్ళ, ప్రభాకర రెడ్డి, మిక్కిలినేని, గీతాంజలి, రమాప్రభ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : వేణు

డైరెక్టర్ : G. విశ్వనాథం

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 4 ఏప్రిల్ 1969

కృష్ణ, కాంతా రావు, విజయ నిర్మల నటించిన భారీ బడ్జెట్ చిత్రం బొమ్మలు చెప్పిన కథ. ఈ సినిమాని మొత్తం 18 సెట్స్ వేసి చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని రామానాయుడు గారు నిర్మించారు, వేణు డైరెక్టర్.

 ===============================================

 kondapalli-rathayya-zee-cinemaluనటీనటులు : దాసరి నారాయణ రావు, హరీష్, ఆమని, సురభి
ఇతర నటీనటులు : చలపతి రావు, కోట శంకర్ రావు , సుధాకర్, బాబు మోహన్, ఏ.వి.ఎస్, ప్రభ, సిల్క్ స్మిత, మధురిమ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎం ఎం శ్రీలేఖ
డైరెక్టర్ : దాసరి నారాయణ రావు
ప్రొడ్యూసర్ : డి. రామానాయుడు
రిలీజ్ డేట్ : 1995

హరీష్ ,సురభి హీరో హీరోయిన్స్ గా దాసరి నారాయణ దర్శకత్వం లో డి రామ నాయుడు నిర్మించిన సినిమా కొండపల్లి రత్తయ్య‘. దాసరి దర్శకత్వం తో పాటు టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమా పల్లె టూరి నేపధ్యం లో తెరకెక్కింది. దాసరి పవర్ ఫుల్ నటన, హరీష్ సురభి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ఆమనీ నటన, శ్రీలేఖ సంగీతం తో పాటు సుధాకర్, బుబుమోహాన్, ఏ.వి.ఎస్ కామెడీ ఈ సినిమాకు హైలైట్స్..

===========================================================================

anasuya-zee-cinemaluనటీనటులు : భూమిక, అబ్బాస్

ఇతర తారాగణం : రవిబాబు, నిఖిత, సుహాని, శంకర్ మెల్కోటే

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : రవి బాబు

రిలీజ్ డేట్ : 21 డిసెంబర్ 2007

భూమిక ప్రధాన పాత్రలో నటించిన అనసూయ సెన్సేషనల్ క్రైం థ్రిల్లర్. ఒక మర్డర్ సిరీస్ ని ఛేదించే కథనంతో సాగే అనసూయ ఊహించని మలుపులతో ఆద్యంతం అలరిస్తుంది. హత్య జరిగిన చోట హంతకుడు రోజా పువ్వును ఎందుకు వదిలి వెళ్తున్నాడో, శవం నుండి ఒక్కో అవయవాన్ని ఎందుకు తొలగిస్తున్నాడో లాంటి అంశాలు సినిమా క్లైమాక్స్ వరకు కట్టి పడేస్తాయి. ఈ సిన్మాకి రవిబాబు డైరెక్టర్.

============================================================================

maisamma-ips-zee-cinemaluనటీ నటులు  : ముమైత్ ఖాన్, సాయాజీ షిండే

ఇతర నటీనటులు : రఘుబాబు, జీవా, బ్రహ్మానందం, M.S.నారాయణ, ప్రదీప్ రావత్

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. శ్రీలేఖ

డైరెక్టర్ : భరత్ పారెపల్లి

ప్రొడ్యూసర్ : దాసరి నారాయణ రావు

రిలీజ్ డేట్ : 2008

పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మైసమ్మను తన అక్క దుర్గ పెంచుతుంది. ఆ ఊళ్ళో రౌడీయిజం చలాయించే ఒక రౌడీ దుర్గను  పెళ్లి చేసుకుని వ్యభిచారం చేయిస్తున్నాడు. అన్నీ సహించిన దుర్గ, తన భర్త, మైసమ్మను బలాత్కారం చేస్తుంటే తట్టుకోలేక ఆ అమ్మాయిని తీసుకుని పారిపోతుంటుంది. అది చూసిన ఆ రౌడీ ఆ ఇద్దరి పైకి కుక్కలను ఉసి గొల్పుతాడు.ఎలాగోలా మైసమ్మను కాపాడుకున్న ఆమె ఆ కుక్కలా బారిన పడి చనిపోతుంది.  మైసమ్మ IPS గా ఎదిగి ఎలా పగ సాధిస్తుంది అన్నదే ప్రధాన కథాంశం.

============================================== 

 sainikudu-zee-cinemaluనటీ నటులు : మహేష్ బాబు, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఇర్ఫాన్ ఖాన్, కామ్న జెఠ్మలాని, కోట శ్రీనివాస రావు, రవి వర్మ అజయ్

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : గుణశేఖర్

ప్రొడ్యూసర్ : అశ్విని దత్

రిలీజ్ డేట్ : 1 డిసెంబర్ 2006

మహేష్ బాబు కరియర్ లో సైనికుడు సినిమా ప్రత్యేకమైనది. రాజకీయ అవినీతి పరులపై ఒక యువకుడు చేసిన పోరాటమే సైనికుడు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు. త్రిష అమాయకత్వపు నటన సినిమాకే హైలెట్. హారిస్ జయరాజ్ ప్రతి పాట బావుంటుంది.

=============================================================================

kooli-no-1-zee-cinemalu

నటీనటులు : వెంకటేష్, టాబూ

ఇతర నటీనటులు : రావు గోపాల్ రావు

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. సురేష్

రిలీజ్ డేట్ : 12 జూన్ 1991

వెంకటేష్ హీరోగా K. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన కలర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ కూలీ నం 1. ఒక సాధారణ కూలీ, పొగరుబోతులైన తండ్రీ కూతుళ్ళ అహాన్ని ఎలా నేలకూల్చాడనే ప్రధానాంశంతో తెరకెక్కిందే ఈ సినిమా. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రాణం.