జీ సినిమాలు ( జనవరి 10th)
Monday,January 09,2017 - 10:00 by Z_CLU

నటీ నటులు : ఊర్వశి శారద, అర్జున్, రజని
ఇతర నటీ నటులు : శరత్ బాబు, అల్లు రామలింగయ్య, గొల్లపూడి, పి. ఎల్. నారాయణ, రావు గోపాల రావు, నూతన్ ప్రసాద్, పరుచూరి గోపాల కృష్ణ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి
డైరెక్టర్ : B. గోపాల్
ప్రొడ్యూసర్ : D. రామానాయుడు
రిలీజ్ డేట్ : 13 మే 1986
తన భర్తను చంపిన హంతకులను ఒక లేడీ ఆఫీసర్ పట్టుకుని చట్టానికి అప్పగించడం కథాంశంగా తెరకెక్కిందే ప్రతిధ్వని. డైరెక్టర్ B. గోపాల్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టిన సినిమా ఇది. ఈ సినిమాలో ఊర్వశి శారద తన కరియర్ లోనే ఫస్ట్ టైం పోలీసాఫీసర్ గా నటించింది. ‘రాజకీయం’ అనే పదానికి కొత్త అర్థం చెప్తూ అలరించే పొట్టి సీతయ్య పాత్ర ఈ సినిమాకి హైలెట్. ఈ పాత్రను పరుచూరి గోపాలకృష్ణ పోషించారు.
===============================================

నటీనటులు : సూపర్ స్టార్ కృష్ణ, జయసుధ
ఇతర నటీనటులు : కైకాల సత్యనారాయణ, అంజలీ దేవి, గిరిబాబు, సుత్తి వేరభద్ర రావు, త్యాగరాజు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : సత్యం
డైరెక్టర్ : విజయ నిర్మల
ప్రొడ్యూసర్ : P. బాబ్జీ
==============================================================================

హీరోహీరోయిన్లు – తరుణ్ ,జెనీలియా
నటీనటులు – పరుచూరి గోపాలకృష్ణ, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, రఘు బాబు తదితరులు
సంగీతం – మణిశర్మ, విద్య సాగర్
దర్శకత్వం – కృష్ణ వంశీ
విడుదల తేదీ – 2009
వరుస ప్రేమ కథా చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ అందుకొని లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తరుణ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన చిత్రం ‘శశిరేఖ పరిణయం’. జెనీలియా శశి రేఖ గా నటించిన ఈ చిత్రం 2009 లో విడుదలైంది. ఈ చిత్రం తో తొలి సారిగా జత కట్టారు తరుణ్-జెనీలియా. కాబోయే భార్య భర్తల మధ్య ఎమోషనల్ సన్నివేశాలతో లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా అలరించింది. ఈ చిత్రం లో పెళ్లంటే భయపడే అమ్మాయి పాత్రలో జెనీలియా నటన, ఒక అమ్మాయి గురించి తన జీవితం గురించి ఆలోచించే యువకుడి పాత్రలో తరుణ్ అందరినీ ఆకట్టుకున్నారు. తన ప్రతి సినిమాలో కుటుంబ విలువలను చాటి చెప్పే క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని కూడా అదే కోవలో ఫ్యామిలీ అంశాలతో కూడిన లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించి అలరించారు.
===============================================

హీరో హీరోయిన్స్ : సుమంత్, స్నేహ, పార్వతి మెల్టన్
ఇతర నటీ నటులు :గిరి బాబు, నరేష్, చలపతి రావు, ఏ.వి.ఎస్, ఆహుతి ప్రసాద్, రవి బాబు, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, వేణు మాధవ్ తదితరులు
సంగీతం : మణిశర్మ
నిర్మాత : రామానాయుడు
దర్శకత్వం : చంద్ర సిద్దార్థ్
అప్పటి వరకూ ప్రేమ కథ, యాక్షన్ సినిమాలతో ఎంటర్టైన్ చేసిన సుమంత్ ను కథానాయకుడిగా ఫామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన చిత్రం ‘మధు మాసం’. ప్రేమ, పెళ్లి అంటే ఇష్టం లేని ఓ అబ్బాయి, ప్రేమ లో మాధుర్యాన్ని పొందాలని ఆరాట పడే ఓ అమ్మాయి మధ్య జరిగే కథ తో, యూత్ ఫుల్, ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకొని విజయవంతమైన సినిమాగా నిలిచింది. రచయిత బలభద్ర పాత్రుని రమణి రచించిన నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు చంద్ర సిద్దార్థ్ తన దైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కించి అలరించాడు . ప్రముఖ నిర్మాత రామానాయుడు ఈ చిత్రాన్ని ఎక్కడ రాజీ పడకుండా నిర్మించి సూపర్ హిట్ సినిమాగా మలిచారు..
===============================================

నటీనటులు : అల్లరి నరేష్, స్నేహ ఉల్లాల్
ఇతర నటీనటులు : మర్యమ్ మజారియా, ఆశిష్ విద్యార్థి, ఆలీ, సుబ్బరాజు, ధర్మవరpపు సుబ్రహ్మణ్యం, M.S. నారాయణ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్
డైరెక్టర్ : సీతారామరాజు దంతులూరి
ప్రొడ్యూసర్ : వేదరాజు టింబర్
రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011
అల్లరి నరేష్ నటించిన హిల్లేరియస్ ఎంటర్ టైనర్ మడత కాజా. పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేసే ఒక యువకుడు, మాఫియా డాన్ చేస్తున్న ఆకృత్యాలను ఎలా బయటికి లాగాడనే అనే అంశంతో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమాలో కామెడీ హైలెట్ గా నిలిచింది.
===============================================

హీరోహీరోయిన్లు – సిద్దార్థ్, శృతిహాసన్
నటీనటులు – నవదీప్, హన్సిక,
సంగీతం – రాహుల్ రాజ్
నిర్మాత – దిల్ రాజు
దర్శకత్వం – వేణుశ్రీరాం
విడుదల – 2011, నవంబర్ 11
స్నేహానికి సరికొత్త అర్థాన్నిస్తూ తెరకెక్కిన ఓ మై ఫ్రెండ్ సినిమాకు చాలా విశేషాలున్నాయి. తెలుగులో శృతిహాసన్ కు ఇది రెండో సినిమా. అయితే శృతిహాసన్ కంటే ముందే ఆ క్యారెక్టర్ కోసం సమంతను అనుకున్నారు. అప్పటికే ఏమాయచేశావెతో సక్సెస్ అందుకున్న సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని దిల్ రాజు కూడా అనుకున్నాడు. ఆ తర్వాత అమలాపాల్, నిత్యామీనన్ లాంటి హీరోయిన్లపై కూడా ఫొటోషూట్ చేశారు. ఫైనల్ గా హీరో సిద్ధార్థ్ పట్టుబట్టి మరీ శృతిహాసన్ ను తీసుకున్నాడు. ఈ సినిమాతోనే వేణుశ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కాగా.. ఇదే మూవీతో మలయాళం ఇండస్ట్రీకి చెందిన రాహుల్ రాజ్ సంగీత దర్శకుడిగా కూడా పరిచయం అయ్యాడు. ఆన్ లైన్ లో పైరసీ జరగకుండా నిరోధించే అత్యాధునిక టెక్నాలజీ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైంది.