ఇండిపెండెన్స్ డే స్పెషల్.. అప్ కమింగ్ దేశభక్తి చిత్రాలు

Thursday,August 15,2019 - 10:30 by Z_CLU

ఎన్నో ఆత్మబలిదానాలు, మరెన్నో త్యాగాలతో వచ్చింది స్వాతంత్ర్యం. అలా వచ్చిన ఇండిపెండెన్స్ ను కాపాడేందుకు ఇప్పటికీ ఎన్నో త్యాగాలు చేస్తోంది ఆర్మీ. అలాంటి ఆర్మీ గొప్పదనాన్ని చాటేలా, స్వతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని రగిల్చేలా దశాబ్దాలుగా ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. మరెన్నో వస్తున్నాయి కూడా. ఈ కోవలో తెలుగులో కూడా కొన్ని చిత్రాలు రెడీ అవుతున్నాయి. స్వాతంత్ర్యం గొప్పదనాన్ని, ఆర్మీ ఔన్నత్యాన్ని చాటేలా రాబోతున్న కొన్ని అప్ కమింగ్ మూవీస్ ఇప్పుడు చూద్దాం.


ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో వస్తోంది సైరా. ఉయ్యాలవాడ మన నేల మీద తొలి స్వాతంత్ర్య సమరయోధుడు. తెలుగు నేల మీద ఆయనే తొలి వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని తెలుగు ప్రేక్షకులతో పాటు దేశం మొత్తానికి అందించబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. దాదాపు రెండేళ్లుగా నలుగుతున్న ఈ ప్రాజెక్టు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లలోకి వస్తోంది.


సైరాలో చిరంజీవి తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపిస్తే.. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా కనిపించబోతున్నాడు మహేష్ బాబు. బోర్డర్ లో పోరాడే యోధుడిగా, ఆర్మీ గొప్పదనాన్ని చాటిచెప్పే పాత్రలో మహేష్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. మూవీలో ఈ ఎపిసోడ్, మోస్ట్ ఎమోషనల్ గా ఉండబోతోంది.


అడవి శేష్ అప్ కమింగ్ సినిమా ఇది. 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను సైతం ఫణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ ఇన్‌స్పిరేష‌న్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. సినిమాలో మేజర్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడవి శేష్ కనిపించబోతున్నాడు. మేజ‌ర్ సినిమా అనేది కేవలం  ఓ పవర్ ఫుల్ స్టోరీ మాత్రమే కాదు. మ‌న దేశంలోని వారిని, స‌రిహ‌ద్దుల్ని దాటి ఉన్న ఇండియ‌న్స్‌ను ఇన్‌స్పైర్ చేసే చిత్ర‌ం.

గోపీచంద్ అప్ కమింగ్ సినిమా ‘చాణక్య’ లో కూడా దేశభక్తికి సంబందించిన కంటెంట్ ఉంది. తిరు డైరెక్షన లో స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. సినిమాలో కొన్ని సందర్భాల్లో వచ్చే సీన్స్ ఆడియన్స్ లో దేశభక్తిని పెంపొందించేలా ఉంటాయి.


వెంకీమామ మూవీలో కూడా మిలట్రీ బ్యాక్ డ్రాప్ ఉంది. కెరీర్ లో తొలిసారిగా మిలట్రీ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు నాగచైతన్య. మరో హీరోగా వెంకటేష్ నటిస్తున్నప్పటికీ నాగచైతన్య చేస్తున్న మిలట్రీ ఆఫీసర్ రోల్, దానికి సంబంధించి దేశభక్తిని ఎలివేట్ చేసేలా తీసిన సీన్స్ టోటల్ సినిమాకే హైలెట్ కానున్నాయి. సినిమాలో మోస్ట్ ఎమోషనల్ పార్ట్ కూడా ఇదే.

రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల్లో దేశభక్తిని రగిల్చాయి. నాపేరు సూర్య సినిమాలో బన్నీ మేజర్ గా కనిపిస్తే.. ఘాజీ సినిమాలో నేవీ ఆఫీసర్ గా రానా మెప్పించాడు. ఇక జవాన్ లో సాయితేజ్ పోషించిన పాత్ర కూడా దేశభక్తిని రగిల్చేదే.