
నటీనటులు – ముమైత్ ఖాన్, కృష్ణభగవాన్, ఎమ్మెస్ నారాయణ, అలీ, సుమన్ షెట్టి
సంగీతం – ఎం.ఎం.శ్రీలేఖ
దర్శకత్వం – వెంకీ
విడుదల తేదీ – 2008
ముమైత్ ఖాన్ అందాలతో పాటు ఫుల్ లెంగ్త్ కామెడీని ఎంజాయ్ చేయాలనుకుంటే మంగతాయారు టిఫిన్ సెంటర్ చూడాల్సిందే. అప్పటికే ఐటెంసాంగ్స్ తో ఫుల్ పాపులర్ అయిన ముమైత్ ఖాన్… లీడ్ రోల్ లో నటించిన సినిమా ఇది. ఎమ్మెస్ నారాయణ, అలీ, కృష్ణభగవాన్ కామెడీ ఈ సినిమాకు హైలెట్.
==============================================================================

నటీనటులు – నాగభూషణం, శోభన్ బాబు, చంద్రమోహన్
సంగీతం – ఎస్పీ కోదండపాణి
నిర్మాత – పి.మల్లికార్జునరావు
మాటలు – ముళ్లపూడి వెంకటరమణ
దర్శకత్వం – బాపు
=============================================================================

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, శ్రీదేవి, జయసుధ
ఇతర నటీనటులు : మురళి మోహన్, మోహన్ బాబు, గుమ్మడి, ప్రభాకర రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి
డైరెక్టర్ : దాసరి నారాయణ రావు
ప్రొడ్యూసర్ : వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 1981 టాలీవుడ్ లెజెండ్రీ యాక్టర్ ANR నటించిన అద్భుతమైన సినిమాలలో ప్రేమాభిషేకం ఒకటి. దాసరి నారాయణ రావు గారి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని ఆ తరవాత కూడా ఎన్నో ప్రేమ కథలు తెరకెక్కాయి. ANR నట జీవితంలో మైలు రాయిలాంటిదీ ప్రేమాభిషేకం. ఈ సినిమాలో సన్నివేశానుసారంగా పొదిగిన పాటలు సినిమాకే హైలెట్.
============================================================================

నటీనటులు : సుమంత్, స్నేహ, పార్వతి మెల్టన్
ఇతర నటీ నటులు :గిరి బాబు, నరేష్, చలపతి రావు, ఏ.వి.ఎస్, ఆహుతి ప్రసాద్, రవి బాబు, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, వేణు మాధవ్ తదితరులు
సంగీతం : మణిశర్మ
నిర్మాత : రామానాయుడు
దర్శకత్వం : చంద్ర సిద్దార్థ్
అప్పటి వరకూ ప్రేమ కథ, యాక్షన్ సినిమాలతో ఎంటర్టైన్ చేసిన సుమంత్ ను కథానాయకుడిగా ఫామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన చిత్రం ‘మధు మాసం’. ప్రేమ, పెళ్లి అంటే ఇష్టం లేని ఓ అబ్బాయి, ప్రేమ లో మాధుర్యాన్ని పొందాలని ఆరాట పడే ఓ అమ్మాయి మధ్య జరిగే కథ తో, యూత్ ఫుల్, ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకొని విజయవంతమైన సినిమాగా నిలిచింది. రచయిత బలభద్ర పాత్రుని రమణి రచించిన నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు చంద్ర సిద్దార్థ్ తన దైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కించి అలరించాడు . ప్రముఖ నిర్మాత రామానాయుడు ఈ చిత్రాన్ని ఎక్కడ రాజీ పడకుండా నిర్మించి సూపర్ హిట్ సినిమాగా మలిచారు.
=============================================================================

నటీ నటులు : గోపీచంద్, భావన
ఇతర నటీనటులు : ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, పరుచూరి వెంకటేశ్వర రావు, అజయ్, సునీల్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : B.V.రమణ
ప్రొడ్యూసర్ : పోకూరి బాబు రావు
రిలీజ్ డేట్ : 14 ఫిబ్రవరి 2008
గోపీచంద్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంటరి. హ్యాండ్ లూం హౌజ్ ఓనర్ గా కొడుకు వంశీ గా నటించిన గోపీచంద్ ఈ సినిమాలో బుజ్జి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఎలాగోలా తన అమ్మా, నాన్నను ఒప్పించుకుని అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకునే లోపు బుజ్జిని ఎవరో కిడ్నాప్ చేస్తాడు. అప్పుడు వంశీ ఏం చేస్తాడు..? తన ప్రేమను ఎలా కాపాడుకుంటాడు అనే కథాంశంతో తెరకెక్కిందే ఒంటరి. ఈ సినిమాకి B.V.రమణ డైరెక్టర్ .
==============================================================================

నటీనటులు : నితిన్, సదా
ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, రఘు బాబు, వేణు మాధవ్, ఆలీ.
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : అమ్మ రాజశేఖర్
ప్రొడ్యూసర్ : పరుచూరి శివరామ ప్రసాద్
రిలీజ్ డేట్ : 23 నవంబర్ 2007
టక్కరి ఒక అమ్మాయి ప్రేమలో పడిన కుర్రాడు, ఆ ప్రేమను గెలుచుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు..? వాటిని ఎలా అధిగమించాడు అనే కథాంశంతో తెరకెక్కిందే ‘టక్కరి’. సదా, నితిన్ జంటగా నటించిన రెండో సినిమా. యాక్షన్ తో పాటు కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా, అన్ని సెంటర్ లలో ను సూపర్ హిట్ గా నిలిచింది.
===========================================================================

నటీనటులు : నిశ్చల్, వందన, R.P. పట్నాయక్
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, దువ్వాసి మోహన్, అనిత చౌదరి
మ్యూజిక్ డైరెక్టర్ : R.P. పట్నాయక్
డైరెక్టర్ : R.P. పట్నాయక్
ప్రొడ్యూసర్ : R.P. పట్నాయక్
రిలీజ్ డేట్ : 11 మార్చి 2016
ఫార్ములా సినిమాలకు భిన్నంగా ఉంటాయి R.P. పట్నాయక్ సినిమాలు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన తులసీదళం 2016 లో రిలీజైన బెస్ట్ సినిమాలలో ఒకటి. సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్స్ లో నటిస్తూనే, ఈ సినిమాకి దర్శకుడు, నిర్మాత, సంగీతం అన్ని తానాయి చూసుకున్నాడు R.P. పట్నాయక్.