జీ సినిమాలు ( ఫిబ్రవరి 3rd)

Thursday,February 02,2017 - 10:02 by Z_CLU

123fromamalapuram

నటీ నటులు : రవి ప్రకాష్, రాజా శ్రీధర్, అనిల్, నిత్యా దాస్

ఇతర నటీనటులు : ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణ భగవాన్, కొండవలస, మల్లాది రాఘవ, MVS హరనాథ రావు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : వెంకటేశ్వర

డైరెక్టర్ : వర్మ

ప్రొడ్యూసర్ : 9 మూవీ మేకర్స్

రిలీజ్ డేట్ : 19 ఆగస్టు 2005

అల్లరిచిల్లరగా తిరిగే ముగ్గురు యువకులు, టెన్నిస్ చాంపియన్ కావాలని కలలు కంటున్న ఒక అమ్మాయి కలను నిజం చేయడానికి ఏం చేశారు..? ఆ ప్రయత్నం వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది అన్నదే ఈ సినిమా కథాంశం.

==============================================================================

raraju-2

నటీనటులు : గోపీచంద్, మీరా జాస్మిన్

ఇతర నటీనటులు : అంకిత, శివాజీ, ఆశిష్ విద్యార్థి, జయ ప్రకాష్ రెడ్డి, చంద్ర మోహన్

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : ఉదయ శంకర్

ప్రొడ్యూసర్ : GVG రాజు

రిలీజ్ డేట్ : 20 అక్టోబర్ 2006

గోపీచంద్ హీరోగా ఉదయ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కింది రారాజు. అతి సున్నితమైన లవ్ స్టోరి కి  మాస్ ఎలిమెంట్స్ జోడించి ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించాడు. ఈ సినిమాలో కలెక్టర్ కావాలని కలలు కనే ఆంబీషియస్ అమ్మాయిగా మీరా జాస్మిన్ సరికొత్తగా కనిపిస్తుంది.  మణిశర్మ మ్యూజికే సినిమాకి హైలెట్.

==============================================================================

bhadradri

నటీనటులు : శ్రీహరి, రాజా, గజాల, నిఖిత

ఇతర నటీనటులు : బాలాదిత్య, ముకేష్ రిషి, జయప్రకాశ్ రెడ్డి, రంగనాథ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణి శర్మ

డైరెక్టర్ : మల్లికార్జున్

ప్రొడ్యూసర్ : శివకుమార్

రిలీజ్ డేట్ : 6 మార్చి 2008

భద్రాది అనేది అమలాపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఎప్పుడూ పచ్చటి పొలాలతో కళకళలాడుతూ ఉండే భద్రాద్రి ONGC వల్ల వచ్చే గ్యాస్ వల్ల, అక్కడి వాతావరణం కాలుష్యం అయి, దాదాపు స్మశానం లా  తయారవుతుంది. అప్పుడు రఘు రామ్ ( శ్రీ హరి ) ఏం చేశాడు..? తన ఊళ్ళో పరిస్థితులు బాగు చేయడానికి శ్రీహరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేదే ప్రధాన కథాంశం.

=============================================================================

indhu

నటీనటులు : ఛార్మి, బాల కుమార్

ఇతర నటీనటులు : కళాభవన్ మణి, మణి వణ్ణన్, మీరా కృష్ణన్, వివేక్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విద్యా సాగర్

డైరెక్టర్ : P. వాసు

ప్రొడ్యూసర్ : మురారిశెట్టి లక్ష్మణ్

రిలీజ్ డేట్ : 2010

ఛార్మి, బాల కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఇందు. తమిళ, తెలుగు భాషల్లో రిలీజైన ఈ సినిమా అటు కోలీవుడ్ లోను, ఇటు టాలీవుడ్ లోను సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడింది. చార్మి నటన సినిమాకి హైలెట్.

=============================================================================

anasuya

నటీనటులు : భూమిక, అబ్బాస్

ఇతర తారాగణం : రవిబాబు, నిఖిత, సుహాని, శంకర్ మెల్కోటే

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : రవి బాబు

రిలీజ్ డేట్ : 21 డిసెంబర్ 2007

భూమిక ప్రధాన పాత్రలో నటించిన అనసూయ సెన్సేషనల్ క్రైం థ్రిల్లర్. ఒక మర్డర్ సిరీస్ ని ఛేదించే కథనంతో సాగే అనసూయ ఊహించని మలుపులతో ఆద్యంతం అలరిస్తుంది. హత్య జరిగిన చోట హంతకుడు రోజా పువ్వును ఎందుకు వదిలి వెళ్తున్నాడో, శవం నుండి ఒక్కో అవయవాన్ని ఎందుకు తొలగిస్తున్నాడో లాంటి అంశాలు సినిమా క్లైమాక్స్ వరకు కట్టి పడేస్తాయి. ఈ సిన్మాకి రవిబాబు డైరెక్టర్.

=============================================================================

 vishal-jayasurya-zee-cinemalu

నటీనటులు : విశాల్, కాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : సముథిరఖని, సూరి, DMJ రాజసింహన్, ఐశ్వర్య దత్త తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్

డైరెక్టర్ : సుసీంథిరణ్

ప్రొడ్యూసర్ : S. మదన్

రిలీజ్ డేట్ : 4 సెప్టెంబర్ 2015

విశాల్, కాజల్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జయసూర్య. సిటీలో కిడ్నాప్ లు చేసి భయ భ్రాంతులకు గురి చేసే క్రిమినల్స్ కి మధ్య జరిగే క్రైం థ్రిల్లర్ ఈ సినిమా. ACP  జయసూర్యగా విశాల్ నటన సినిమాకే హైలెట్.

============================================================================= 

nalugu-sthambalaata

 

హీరోహీరోయిన్లు నరేష్, పూర్ణిమ

నటీనటులు ప్రదీప్, తులసి, సుత్తివేలు, శ్రీలక్ష్మి

సంగీతం రాజన్ నాగేంద్ర

దర్శకత్వం జంధ్యాల

విడుదల తేదీ – 1982,   మే 15

 

1982 అప్పుడే ప్రారంభమైంది. అప్పటికి జంధ్యాల దర్శకుడిగా మారి రెండేళ్లయింది. మొదటి సినిమా హిట్. రెండో సినిమా ఫ్లాప్. అదే టైంలో నరేష్ కూడా హీరోగా మారాడు. మొదటి సినిమా ఏమైందో ఎవరికీ తెలీదు. రెండో సినిమా ఎలా చేద్దామా అని ఆలోచనలో ఉన్న రోజులు.  సరిగ్గా అప్పుడే ఈ హాస్యబ్రహ్మ దృష్టిలో నరేష్ పడ్డాడు. నవత బ్యానర్ పై నాలుగు స్తంభాలాట సినిమాకు నరేష్ ను హీరోగా పెట్టి దర్శకత్వం వహించారు జంధ్యాల. నిజానికి ఇదే నరేష్ మొదటి సినిమాగా కూడా చలామణి అయిపోతోంది. తొలిసినిమా ముద్దమందారంతో జంధ్యాలను లైట్ తీసుకున్న వాళ్లంతా… నాలుగు స్తంభాలాట సినిమాతో ఆయనలోని దర్శకత్వ  చమక్ ను గుర్తించగలిగారు. అలా కామెడీ సినిమాల దర్శకుడిగా జంధ్యాల, కామెడీ హీరోగా నరేష్ ను నిలబెట్టింది నాలుగు స్తంభాలాట సినిమా. కామెడీనే ఈ సినిమాకు హైలెట్ అనుకుంటే… రాజన్ నాగేంద్ర సంగీతం అంతకంటే హైలెట్. చినుకులా రాలి అనే పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.