జీ సినిమాలు ( ఫిబ్రవరి 28th )

Monday,February 27,2017 - 10:08 by Z_CLU

నటీనటులు : శోభన్ బాబు, జయసుధ, రాధిక

ఇతర నటీనటులు : గుమ్మడి, ప్రభాకర రెడ్డి, గొల్లపూడి, నూతన్ ప్రసాద్, గిరిబాబు, అంజలి దేవి, రమాప్రభ, అత్తిలి లక్ష్మి, జ్యోతి, రాగిణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : బోయిన సుబ్బారావు

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : ఏప్రిల్ 5, 1985

అద్భుతమైన  ట్రయాంగిల్ లవ్ స్టోరీతో శోభన్ బాబు, రాధిక, జయసుధ కాంబినేషన్ తెరకెక్కిన సినిమా మాంగళ్య బలం. తన ప్రియురాలిని కోల్పోయి మద్యానికి బానిసిన హీరో జీవితంలో మరో అమ్మాయి ప్రవేశించి, అతన్ని మామూలు వ్యక్తిగా మలుచుకుంటుంది అంతలో హీరో కి దూరమైన ప్రియురాలు తిరిగి అతని కంట పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అనేదే ప్రధాన కథాంశం. ఇమోషనల్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి.

============================================================================

నటీ నటులు : సుమంత్ అశ్విన్, ఈషా

ఇతర నటీనటులు : మధుబాల, శ్రీనివాస్ అవసరాల, రవి బాబు, రోహిణి, రావు రమేష్

మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణి మాలిక్

డైరెక్టర్ : మోహన కృష్ణ ఇంద్రగంటి

ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్

రిలీజ్ డేట్ :  23 ఆగష్టు 2013

మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘అంతకు ముందు ఆ తరవాత’ ఒక మెచ్యూర్డ్ లవ్ ఎంటర్ టైనర్. సుమంత్ అశ్విన్, ఈషా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మధుబాల, రవిబాబులు కీలక పాత్రలు పోషించారు. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ సినిమాకి ఎసెట్.

=============================================================================

నటీ నటులు : గోపీచంద్, భావన

ఇతర నటీనటులు : ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, పరుచూరి వెంకటేశ్వర రావు, అజయ్, సునీల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : B.V.రమణ

ప్రొడ్యూసర్ : పోకూరి బాబు రావు

రిలీజ్ డేట్ : 14 ఫిబ్రవరి 2008

గోపీచంద్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంటరి. హ్యాండ్ లూం హౌజ్ ఓనర్ గా కొడుకు వంశీ గా నటించిన గోపీచంద్ ఈ సినిమాలో బుజ్జి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఎలాగోలా తన అమ్మా, నాన్నను ఒప్పించుకుని అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకునే లోపు బుజ్జిని ఎవరో కిడ్నాప్ చేస్తాడు. అప్పుడు వంశీ ఏం చేస్తాడు..? తన ప్రేమను ఎలా కాపాడుకుంటాడు అనే కథాంశంతో తెరకెక్కిందే ఒంటరి. ఈ సినిమాకి B.V.రమణ డైరెక్టర్ .

============================================================================

 నటీనటులు – కృష్ణుడు, సోనియా

ఇతర నటీనటులు – సూర్య తేజ్, పూనమ్ కౌర్, సామ్రాట్, అంకిత, ఆదర్శ్ బాలకృష్ణ, సత్య కృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ – సామ్ ప్రసన్

నిర్మాత – ప్రేమ్ కుమార్ పట్రా

దర్శకత్వం –  సాయి కిరణ్ అడివి

విడుదల తేదీ – 21  నవంబర్ 2008

 కృష్ణుడు-సోనియా జంటగా సాయి కిరణ్ అడివి తెరకెకెక్కించిన యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ ‘వినాయకుడు’. అప్పటి వరకూ నటుడిగా కొనసాగుతున్న కృష్ణుడు ని హీరోగా చూపించి దర్శకుడు సాయి కిరణ్ రూపొందించిన ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ  సాఫ్ట్ స్క్రీన్ ప్లే, సాఫ్ట్ సీన్స్ తో అందరినీ అలరిస్తుంది.

============================================================================

నటీ నటులు : నాగార్జున, రీచా గంగోపాధ్యాయ్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి, సోను సూద్, ముకుల్  దేవ్, సాయాజీ షిండే, నాగి నీదు, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, చలపతి రావు,కె.విశ్వనాధ్, ఎం.ఎస్.నారాయణ, రఘు బాబు,వెన్నెల కిషోర్,అజయ్, ఆదిత్య మీనన్,  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : వీర భద్రం చౌదరి

ప్రొడ్యూసర్ : అక్కినేని నాగార్జున

రిలీజ్ డేట్ : 25 అక్టోబర్ 2013

నాగార్జున కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘భాయ్’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాణం లో దర్శకుడు వీరభద్రం తెరకెక్కిన ఈ చిత్రం లో భాయ్ గా నాగార్జున నటన, యాక్షన్ ఎపిసోడ్, రీచా గంగోపాధ్యాయ్ గ్లామర్,  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్స్. ఈ చిత్రం లో బ్రహ్మానందం, రఘు బాబు, వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుంది.

============================================================================

నటీనటులు  – సాయికుమార్, సన

ఇతర నటీనటులు – రాక్ లైన్ వెంకటేశ్, పీజే శర్మ, శోభరాజ్, పొన్నాంబలం

మ్యూజిక్ డైరెక్టర్  – ఆర్పీ పట్నాయక్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం – థ్రిల్లర్ ముంజు

విడుదల తేదీ – 1996

అప్పటికే సౌత్ లో పెద్ద హిట్ అయిన పోలీస్ స్టోరీకి సీక్వెల్ గా పోలీస్ స్టోరీ-2ను తెరకెక్కించారు. పోలీస్ స్టోరీ సినిమాకు పనిచేసిన టీం అంతా దాదాపుగా ఈ సీక్వెల్ కు కూడా పనిచేశారు. ఇప్పటికీ సాయికుమార్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే అగ్ని పాత్ర ఈ సినిమాలోనిదే. యాక్షన్ సినిమాలు, అదిరిపోయే మాస్ డైలాగులు కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది.

=============================================================================

నటీనటులు  – శ్రీకాంత్, విమలా రామన్

ఇతర నటీనటులు – రమ్యకృష్ణ, తెలంగాణ శకుంతల, జీవీ, నాగబాబు

మ్యూజిక్ డైరెక్టర్  – చక్రి

దర్శకత్వం – జీవీ సుధాకర్ నాయుడు

విడుదల తేదీ – 2010, డిసెంబర్ 30

ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన జీవీ… దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా రంగ ది దొంగ. అప్పటికే దర్శకుడిగా మారి నితిన్ తో ఓ సినిమా తీసిన జీవీ… ఈసారి ఓ విభిన్న కథాంశంతో శ్రీకాంత్ ను హీరోగా పెట్టి రంగ ది దొంగ సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో  విమలారామన్ పోలీస్ గా కనిపిస్తే… మరో కీలకపాత్రలో రమ్యకృష్ణ నటించింది.  తెరపై భయంకరమైన విలనిజం చూపించిన జీవీ… దర్శకుడిగా మాత్రం ఈ సినిమాలో మంచి కామెడీ పండించాడు. 2010లో విడుదలైన ఈ సినిమాకు చక్రి సంగీతం అందించాడు.

=============================================================================