జీ సినిమాలు ( ఫిబ్రవరి 1st)

Tuesday,January 31,2017 - 10:15 by Z_CLU

english-vnglish

నటీనటులు – శ్రీదేవి, ప్రియా ఆనంద్, మెహ్దీ నెబూ, ఆదిల్ హుస్సేన్

మ్యూజిక్  డైరెక్టర్  – అమిత్ త్రివేది

డైరెక్టర్  – గౌరీ షిండే

విడుదల తేదీ – 2012, సెప్టెంబర్ 14

అతిలోకసుందరి శ్రీదేవి  గ్రాండ్ గా  రీఎంట్రీ ఇచ్చిన మూవీ ఇంగ్లిష్ వింగ్లిష్.  అప్పట్లో శ్రీదేవికి ఎంత పేరు ఉండేదో, తిరిగి అంత క్రేజ్ ను ఓవర్ నైట్ లో ఆమెకు తీసుకొచ్చింది ఈ సినిమా. తనలో నటనా పటిమ ఏమాత్రం తగ్గలేదని శ్రీదేవి నిరూపించుకున్న సినిమా ఇది. ఒక సాధారణ గృహిణి విదేశాలకు వెళ్లినప్పుడు, ఇంగ్లిష్ తెలియక ఎలా ఇబ్బందిపడింది.. దాన్నుంచి సక్సెస్ ఫుల్ గా ఎలా బయటపడి.. ఓ స్వతంత్ర మహిళగా ఎదిగిందనేదే ఈ స్టోరీ. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో శ్రీదేవి యాక్టింగ్ టాలెంట్ మనకు కనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్, అజిత్ గెస్ట్ రోల్స్ పోషించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా హిట్ అయింది.

==============================================================================

paruvu-prathishta

నటీనటులు  – సుమన్ మాలాశ్రీ

ఇతర నటీనటులు – సురేష్, మాలాశ్రీ, లక్ష్మి, శ్రీవిద్య

మ్యూజిక్ డైరెక్టర్  – రాజ్ కోటి

డైరెక్టర్  – గుహనాధన్

రిలీజ్ డేట్  – 1993

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ పరువు-ప్రతిష్ట. లో-బడ్జెట్ లో తీసిన ఈ సినిమా భారీ విజయాన్నందుకుంది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో మాలాశ్రీ కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా… సుమన్ ఈ తరహా పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయారు. గుహనాధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. 1993 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా పేరుతెచ్చుకుంది.

==============================================================================

vinayakudu

 నటీనటులు – కృష్ణుడు, సోనియా

ఇతర నటీనటులు – సూర్య తేజ్, పూనమ్ కౌర్, సామ్రాట్, అంకిత, ఆదర్శ్ బాలకృష్ణ, సత్య కృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ – సామ్ ప్రసన్

ప్రొడ్యూసర్  – ప్రేమ్ కుమార్ పట్రా

డైరెక్టర్  –  సాయి కిరణ్ అడివి

రిలీజ్ డేట్ – 21  నవంబర్ 2008

 కృష్ణుడు-సోనియా జంటగా సాయి కిరణ్ అడివి తెరకెకెక్కించిన యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ ‘వినాయకుడు’. అప్పటి వరకూ హాస్య నటుడిగా కొనసాగుతున్న కృష్ణుడు ని హీరోగా చూపించి దర్శకుడు సాయి కిరణ్ రూపొందించిన ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ  సాఫ్ట్ స్క్రీన్ ప్లే, సాఫ్ట్ సీన్స్ తో అందరినీ అలరిస్తుంది.

=============================================================================

allari-gajendrudu

నటీనటులు  – కరణ్, రమ్యకృష్ణ

ఇతర నటీనటులు – ఫృధ్వి, వినోద్ కుమార్, జయంతి

మ్యూజిక్ డైరెక్టర్  – దేవ

డైరెక్టర్ – రామ్ నారాయణ్

=============================================================================

chanti

నటీనటులు  – రవితేజ,  చార్మి

ఇతర నటీనటులు –  డైజీ బోపన్న, అతుల్ కులకర్ణి, రేవతి, రఘుబాబు, సుబ్బరాజు, వేణుమాధవ్

మ్యూజిక్ డైరెక్టర్  – శ్రీ

డైరెక్టర్  – శోభన్

రిలీజ్ డేట్  – 2004, నవంబర్ 12

హీరో రవితేజ అప్పటికే పూర్తిస్థాయి హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇడియట్, ఖడ్గం, ఇట్లు శ్రావణి  సుబ్రమణ్యం లాంటి హిట్స్ ఉన్నాయి. మరోవైపు శోభన్ వర్షం సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ చంటి. చార్మి హీరోయిన్  గా నటించిన ఈ సినిమాకు శ్రీ సంగీతం అందించాడు. దర్శకుడు  శోభన్ కు ఇదే ఆఖరి చిత్రం. ఈ సినిమా తర్వాత కన్నడంలో మరో సినిమా ఎనౌన్స్ చేసినప్పటికీ… అది సెట్స్ పైకి వెళ్లకముందే తీవ్రమైన గుండెపోటుతో శోభన్ చనిపోయారు. అదే ఏడాది శోభన్ సోదరుడు, ప్రముఖ కమెడియన్ లక్ష్మీపతి కూడా కన్నుమూయడం బాధాకరం.

=============================================================================

 kantri

నటీ నటులు : NTR, హన్సిక మోత్వాని, తానీషా ముఖర్జీ

ఇతర నటీనటులు : ఆశిష్ విద్యార్థి, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రఘు బాబు, ముకేష్ రిషి, ఆలీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : మెహర్ రమేష్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 9 మే 2008

NTR, హన్సిక మోత్వాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ కంత్రి. స్టైలిష్ ఎంటర్ టైనర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని అశ్విని దత్ నిర్మించారు.  పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో క్లైమాక్స్ కి కాస్త ముందుగా వచ్చే ట్విస్ట్ హైలెట్.

==============================================================================

holiday-zee-cinemalu

నటీనటులు : అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా

ఇతర నటీనటులు : ఫ్రెడీ దారువాలా, సుమీత్ రాఘవన్, గోవింద, జాకీర్ హుసేన్, గిరీష్ సహదేవ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రీతమ్

డైరెక్టర్ : A.R. మురుగదాస్

ప్రొడ్యూసర్ : అరుణ్ భాటియా, ట్వింకిల్ ఖన్నా, విపుల్ అమృత్ షా

రిలీజ్ డేట్ : 6 జూన్ 2014

విరాట్ ఒక ఆర్మీ ఆఫీసర్. టెర్రరిస్టులు ముంబై నగరాన్ని వరస పేలుళ్లతో చిన్నాభిన్నం చేయాలని చేస్తున్న  ప్రయత్నాలను తెలివిగా, తన టీం సహాయంతో ఎలా అడ్డుకున్నాడు అనేదే హాలీడే సినిమా కథాంశం. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్టయిన తుపాకి సినిమాకి రీమేక్ గా A.R. మురుగదాస్  డైరెక్షన్ లో తెరకెక్కింది. యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్.