జీ సినిమాలు ( ఫిబ్రవరి 13th)

Sunday,February 12,2017 - 10:03 by Z_CLU

bala-bharatham-zee-cinemalu

నటీనటులు : అంజలీ దేవి, బేబీ శ్రీదేవి, మాస్టర్ ప్రభాకర్

ఇతర నటీనటులు : S. వరలక్ష్మి, హరనాథ్, S.V.రంగారావు, మిక్కిలినేని, ధూళిపాల, కాంతా రావు.

మ్యూజిక్ డైరెక్టర్ : సాలూరి రాజేశ్వర రావు

డైరెక్టర్ : కమలాకర కామేశ్వర రావు

ప్రొడ్యూసర్ : మహిజా ప్రకాశ రావు

రిలీజ్ డేట్ : 1972

మహాభారతం లోని కౌరవ పాండవుల మధ్య చిన్నతనంలో జరిగే అద్భుత సన్నివేశాలతో తెరకెక్కిందే బాల భారతం. కమలాకర కామేశ్వర్ రావు డైరెక్షన్ లో  తెరకెక్కిన ఈ సినిమా అతిలోక సుందరి శ్రీదేవి కూడా బాలనటిగా నటించింది.

==============================================================================

pedda-manushulu-zee-cinemalu

హీరోహీరోయిన్లు  – సుమన్, రచన, హీరా

ఇతర నటీనటులు – ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, మల్లికార్జునరావు, కోటశ్రీనివాసరావు,  కైకాల సత్యనారాయణ

సంగీతం – ఈశ్వర్

దర్శకత్వం – బోయిన సుబ్బారావు

నిర్మాత – డి. రామానాయుడు

విడుదల – 1999, జనవరి 13

భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చాటిచెప్పడంతో పాటు… ఆలుమగల మధ్య మాట పట్టింపులు, అనుమానాలు వస్తే కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమైపోతాయో చాటిచెప్పిన చిత్రమే పెద్ద మనుషులు. సినిమా మొత్తం సుమన్ చుట్టూనే తిరిగినప్పటికీ… పెద్దమనుషులుగా కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు తన నటనతో సినిమాకు హైలెట్ గా నిలిచాడు. ఈ సినిమాతోనే ఈశ్వర్… సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

===============================================

swagatham-zee-cinemalu

నటీనటులు : జగపతి బాబు, భూమిక చావ్లా, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు : అర్జున్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆలీ, సునీల్, వేణు మాధవ్, మల్లికార్జున రావు, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : R.P. పట్నాయక్

డైరెక్టర్ : దశరథ్

ప్రొడ్యూసర్ : ఆదిత్య రామ్

రిలీజ్ డేట్ : 25 జనవరి 2008

రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా జీవితం విలువలను సున్నితంగా తడుతూ తెరకెక్కిన సినిమా’ స్వాగతం’ దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఇమోషనల్ ఎంటర్ టైనర్ లో భూమిక నటన హైలెట్ గా నిలుస్తుంది. R.P. పట్నాయక్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం.

===============================================

surya-krishnan-zee-cinemalu

నటీనటులు : సూర్య, సిమ్రాన్, దివ్య స్పందన, సమీరా రెడ్డి

ఇతర నటీనటులు : దీపా నరేంద్రన్, శ్రియా గుప్తా, బబ్లూ పృథ్విరాజ్, గణేష్ జనార్ధన్, సతీష్ కృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : గౌతమ్ వాసుదేవ్ మీనన్

ప్రొడ్యూసర్ : V. రవిచంద్రన్

రిలీజ్ డేట్ : 14 నవంబర్ 2008

ఒక తండ్రి తన కొడుకు జీవితంలోని ప్రతి ఘట్టంలో ఎలా ధైర్యంగా నిలబడతాడో తి సున్నితంగా ప్రతి హృదయాన్ని కదిలిస్తూ తెరకెక్కిన సినిమా సూర్య S/o కృష్ణన్. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్, ప్రతి సన్నివేశం హైలెటే.

==============================================================================

ee-zee-cinemalu

నటీనటులు : జీవా, నయనతార

ఇతర నటీనటులు : పశుపతి, ఆశిష్ విద్యార్థి, కరుణాస్, రాజేష్, అజయ్ రత్నం, చరణ్ రాజ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీకాంత్ దేవ

డైరెక్టర్ : S.P. జగన్నాథన్

ప్రొడ్యూసర్ : R.B.చౌదరి

రిలీజ్ డేట్ : 20 అక్టోబర్ 2006

బాధ్యతా రాహిత్యంగా తిరిగే ఒక మాస్ కుర్రాడు, ఒక బార్ డ్యాన్సర్ జ్యోతిని కలుసుకుంటాడు. అతని గతాన్ని తెలుసుకున్న జ్యోతి, చిన్నగా అతనికి జీవితమంటే ఏంటో, దాని విలువేంటో తెలియజేసే ప్రయత్నం చేస్తుంటుంది. ఇంతలో వారికి తెలిసిన ఒక నిజం ఇద్దరి జీవిత లక్ష్యాన్నే  మార్చేస్తుంది. జీవా, నయనతార నటించిన సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్టయింది.

==============================================================================

bhagiratha-zee-cinemalu

నటీనటులు : రవి తేజ, శ్రియ

ఇతర నటీనటులు :  ప్రకాష్ రాజ్, నాజర్

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్

ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి

రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005

రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా          ‘భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవితేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

==============================================================================

pathala-bhairavudu-zee-cinemalu

నటీ నటులు : ప్రకాష్ రాజ్, జ్యోతిక

ఇతర నటీనటులు : బెంట్లీ మిచ్ మమ్, అనుపమ్ ఖేర్, నాజర్, కళ్ళు చిదంబరం, ఫాతిమా బేబీ

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ మణి

డైరెక్టర్ : సింగీతం శ్రీనివాసరావు

ప్రొడ్యూసర్స్ : గడ్డం శివ, టి. రామ్ ప్రసాద్