జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ : అక్టోబర్ నుండి 'మేజర్'

Sunday,August 04,2019 - 02:10 by Z_CLU

‘ఎవరు’ సినిమాను రిలీజ్ కి రెడీ చేసిన అడివి శేష్ త్వరలోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘మేజర్’ ను స్టార్ట్ చేయబోతున్నాడు. ‘గూఢచారి’ ఫేం శశి కిరణ్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ బయోపిక్ గా తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబర్ నుండి సెట్స్ పైకి రాబోతుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఎనిమిది నెలల పాటు కథ కోసం రీసెర్చ్ చేసిన శశి అండ్ టీం ప్రస్తుతం స్క్రిప్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు.

అక్టోబర్ లో హైదరాబాద్ లో ప్రారంభం కానున్న మొదటి షెడ్యుల్ డిసెంబర్ వరకూ జరగనుంది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ , పూణే, హర్యానా , బెంగుళూర్ వంటి ప్రదేశాల్లో మిగతా షెడ్యుల్స్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు , సోనీ పిక్చర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై తెరకెక్కనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.