జీ ఎక్స్ క్లూజీవ్ : 'దొరసాని' రిలీజ్ డేట్

Sunday,May 19,2019 - 11:10 by Z_CLU

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమవుతున్న ‘దొరసాని’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇటివలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా జులై 5న థియేటర్స్ లోకి రానుంది. త్వరలోనే ఈ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా ప్రకటించనున్నారు.

పీరియాడిక్ లవ్ స్టోరితో యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా పరిచయమవుతుంది. మధుర శ్రీధర్ & యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కె.వి.ఆర్ మహేంద్ర దర్శకుడు. సురేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.