జీ సినిమాలు ( డిసెంబర్ 31st)

Friday,December 30,2016 - 10:00 by Z_CLU

premaco-zee-cinemaluనటీనటులు – నరేష్, వాణీ విశ్వనాథ్

ఇతర నటీనటులు – రావుగోపాల్రావు, గిరిబాబు, మల్లికార్జునరావు, శివాజీరాజా, బ్రహ్మానందం

సంగీతం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – వంశీ

విడుదల తేదీ – 1994

లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల, చెట్టుకింద ప్లీడర్.. ఇలా వరుస విజయాలతో వంశీ ఊపుమీదున్న రోజులవి. అయితే సినిమాలు మాత్రం సెలక్టివ్ గానే చేసేవారు వంశీ. కథ, కథనం, సంగీతం అన్నీ సెట్ అయిన తర్వాత మాత్రమే సెట్స్ పైకి వెళ్లేవారు. జోకర్ సినిమా వచ్చిన తర్వాత దాదాపు 7నెలలు గ్యాప్ తీసుకొని వంశీ చేసిన సినిమా ప్రేమ అండ్ కో. నరేష్ వాణీవిశ్వనాద్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుంది. భానుప్రియ, సుహాసిని తర్వాత వంశీ దర్శకత్వంలో ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో నటించిన మూడో హీరోయిన్ గా వాణివిశ్వనాథ్ గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. తన మూవీస్ కు రెగ్యులర్ గా సంగీతం అందించే ఇళయరాజా బిజీగా ఉండడంతో… ప్రేమ అండ్ కో మూవీకి వంశీనే సంగీతం కూడా అందించారు.

==============================================================================

kaliyuga-pandavulu-zee-cinemalu

నటీ నటులు : వెంకటేష్, ఖుష్బూ

ఇతర నటీనటులు : అశ్విని, రావు గోపాల్ రావు, నూతన్ ప్రసాద్, రంగనాథ్, రాళ్ళపల్లి తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ :  K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 1986

విక్టరీ వెంకటేష్ నటించిన ఫస్ట్ మూవీ కలియుగ పాండవులు. వెంకటేష్, ఖుష్బూ జంటగా నటించిన ఈ సినిమా వెంకటేష్ కరియర్ లో ఫస్ట్ సినిమా అయినా ఇదే. టర్నింగ్ పాయింట్ సినిమా కూడా ఇదే. మొదటి సినిమాతోనే వెంకటేష్ కి మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టిందీ సినిమా. రాఘవేంద్ర రావు డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించారు.

==============================================================================

ahanapellanta-rajendra-prasad

నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, రజని

ఇతర నటీనటులు : నూతన ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాళ్ళపల్లి, బ్రహ్మానందం, సుత్తి వీరభద్ర రావు, శుభలేఖ సుధాకర్, విద్యా సాగర్

మ్యూజిక్ డైరెక్టర్ : రమేష్ నాయుడు

డైరెక్టర్ : జంధ్యాల

ప్రొడ్యూసర్ : డి. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 27 నవంబర్ 1987

అహ నా పెళ్ళంట. ఈ సినిమా గురించి తెలుగు వారికి పెద్దగా పరిచయం అవసరం లేదు. 1987 లో జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆల్ టైం సూపర్ హిట్ అనిపించుకుంది. పరమ పిసినారిగా కోట శ్రీనివాస రావు నటన సినిమాకే హైలెట్. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం క్యారెక్టర్స్ సినిమా చూస్తున్నంత సేపు నవ్విస్తూనే ఉంటారు. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో జంధ్యాల తరం స్టార్ట్ అయింది.

==============================================================================

padaharella-vayasu-zee-cinemalu

నటీ నటులు  – చంద్రమోహన్, శ్రీదేవి

ఇతర నటీనటులు – మోహన్ బాబు, నిర్మలమ్మ

మ్యూజిక్ డైరెక్టర్  – చక్రవర్తి

డైరెక్టర్  – కె.రాఘవేంద్రరావు

రిలీజ్ డేట్ – 1978, ఆగస్ట్ 31

అతిలోకసుందరిని టాలీవుడ్ కు పరిచయం చేసిన సినిమా పదహారేళ్ల వయసు. అప్పటికే తమిళనాట సూపర్ హిట్  అయిన 16-వయతనిళ్లే సినిమాకు  రీమేక్ గా ఇది తెరకెక్కింది. తమిళ్ లో ఈ సినిమాను కె.బాలచందర్ తీశారు. రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించారు. రెండు భాషల్లో శ్రీదేవే లీడ్ రోల్ చేశారు. తెలుగు వెర్షన్ లో కమల్ హాసన్ పాత్రను చంద్రమోహన్ పోషించారు. అంతకంటే ముందు కమల్ హాసన్ పోషించిన పాత్రను శోభన్ బాబుకు, శ్రీదేవి క్యారెక్టర్ కోసం జయప్రదను అనుకున్నారు. కానీ వాళ్లిద్దరు బిజీగా ఉండడంతో చంద్రమోహన్-శ్రీదేవి ని ఫిక్స్ చేశారు. ఇక తమిళ్ లో రజనీకాంత్ పోషించిన పాత్రను తెలుగులో మోహన్ బాబు పోషించారు.

చక్రవర్తి సంగీతం ఈ సినిమాకు పెద్ద హైలెట్. సిరిమల్లెపువ్వా అనే సాంగ్ ఇప్పటికీ హిట్టే. పేరుకు ఇది రీమేక్ అయినప్పటికీ… తెలుగు ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని క్లైమాక్స్ మార్చారు. తమిళ్ క్లయిమాక్స్ లో శ్రీదేవి రైల్వేస్టేషన్ లో ఒంటరిగా మిగిలిపోయినట్టు చూపించారు. కానీ తెలుగు క్లయిమాక్స్ లో మాత్రం చంద్రమోహన్ రాకతో సినిమాకు హ్యాపీ ఎండింగ్ ఉంటుంది.

==============================================================================

bhai-zee-cinemalu

నటీ నటులు : నాగార్జున, రీచా గంగోపాధ్యాయ్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి, సోను సూద్, ముకుల్  దేవ్, సాయాజీ షిండే, నాగి నీడు, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, చలపతి రావు,కె.విశ్వనాధ్, ఎం.ఎస్.నారాయణ, రఘు బాబు,వెన్నెల కిషోర్,అజయ్, ఆదిత్య మీనన్,  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : వీర భద్రం చౌదరి

ప్రొడ్యూసర్ : అక్కినేని నాగార్జున

రిలీజ్ డేట్ : 25 అక్టోబర్ 2013

నాగార్జున కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘భాయ్’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాణం లో దర్శకుడు వీరభద్రం తెరకెక్కిన ఈ చిత్రం లో భాయ్ గా నాగార్జున నటన, యాక్షన్ ఎపిసోడ్, రీచా గంగోపాధ్యాయ్ గ్లామర్,  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్స్. ఈ చిత్రం లో బ్రహ్మానందం, రఘు బాబు, వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుంది.

==============================================================================

kumari-21-f-zee-cinemalu

నటీనటులు : రాజ్ తరుణ్, హెబ్బా పటేల్

ఇతర నటీనటులు : నోయెల్ షీన్, నవీన్ నేని, సుదర్శన్, హేమ, భాను

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : పలనాటి సూర్య ప్రతాప్

ప్రొడ్యూసర్ : సుకుమార్

రిలీజ్ డేట్ : 20 నవంబర్ 2015

రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ కుమారి 21 F. పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని సుకుమార్ నిర్మించాడు. టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

==============================================================================

ee

నటీనటులు : జీవా, నయనతార

ఇతర నటీనటులు : పశుపతి, ఆశిష్ విద్యార్థి, కరుణాస్, రాజేష్, అజయ్ రత్నం, చరణ్ రాజ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీకాంత్ దేవ

డైరెక్టర్ : S.P. జగన్నాథన్

ప్రొడ్యూసర్ : R.B.చౌదరి

రిలీజ్ డేట్ : 20 అక్టోబర్ 2006

బాధ్యతా రాహిత్యంగా తిరిగే ఒక మాస్ కుర్రాడు, ఒక బార్ డ్యాన్సర్ జ్యోతిని కలుసుకుంటాడు. అతని గతాన్ని తెలుసుకున్న జ్యోతి, చిన్నగా అతనికి జీవితమంటే ఏంటో, దాని విలువేంటో తెలియజేసే ప్రయత్నం చేస్తుంటుంది. ఇంతలో వారికి తెలిసిన ఒక నిజం ఇద్దరి జీవిత లక్ష్యాన్నే  మార్చేస్తుంది. జీవా, నయనతార నటించిన సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్టయింది.