జీ సినిమాలు ( డిసెంబర్ 29th )

Wednesday,December 28,2016 - 10:00 by Z_CLU

attakukoduku-mamaku-alludu

నటీనటులు : వినోద్ కుమార్, రోజా, దివ్యవాణి

ఇతర నటీనటులు : వాణిశ్రీ, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : P.S. రామచంద్రా రావు

ప్రొడ్యూసర్ : కోసూరి శ్రీదేవి

రిలీజ్ డేట్ : 1993

ఫ్యామిలీ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న వినోద్, రోజా జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అత్తకు కొడుకు మామకు అల్లుడు. అప్పటికే సిల్వర్ స్క్రీన్ పై అత్తగా వెలిగిపోతున్న సీనియర్ నటి వాణిశ్రీ, సత్యనారాయణకు అల్లుడుగా నటించాడు వినోద్ కుమార్. వీరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

kathanayakudu-zee-cinemalu

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ, విజయ శాంతి

ఇతర నటీనటులు: గొల్లపూడి మారుతి రావు, శారద, అల్లు రామలింగయ్య, చంద్ర మోహన్, నూతన్ ప్రసాద్

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : K. మురళి మోహన్ రావు

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 14 డిసెంబర్ 1984

మాస్ హీరో కన్నా ముందు నటరత్న బాలకృష్ణకి ఫ్యామిలీ ఫాలోయింగే ఎక్కువ. కథని పట్టి ఉంచే భావోద్వేగాలతో తెరకెక్కిందే కథానాయకుడు. ఈ సినిమాని రామానాయుడు గారు నిర్మించారు. చక్రవర్తి సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

==============================================================================

ashta-chemma-zee-cinemalu

నటీనటులు : నాని, శ్రీనివాస్ అవసరాల, స్వాతి, భార్గవి

ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, హేమ, ఝాన్సీ, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రాగిణి

మ్యూజిక్ డైరెక్టర్ : కల్యాణి మాలిక్

డైరెక్టర్ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

ప్రొడ్యూసర్ : రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 2008

నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి, భార్గవి నలుగురికి ఒకేసారిగా ఓ రేంజ్ స్టార్ డం ని తీసుకొచ్చి పెట్టిన సినిమా ‘అష్టా చెమ్మా’. సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్ళి చేసుకోవాలనుకునే లావణ్య చివరికి మహేష్ అనే పేరున్నా చాలు అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఆ తరవాత ఏం జరిగింది అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

avakaya-biryani-zee-cinemalu నటీ నటులు : కమల్ కామరాజు, బిందు మాధవి

ఇతర నటీనటులు : రావు రమేష్, వరుణ్ జొన్నాడ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణికాంత్ కద్రి

డైరెక్టర్ : అనీష్ కురువిల్ల

ప్రొడ్యూసర్ : శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల

రిలీజ్ డేట్ : 14 నవంబర్ 2008

శేఖర్ కమ్ముల నిర్మించిన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ఆవకాయ బిర్యాని. అనిష్ కురువిల్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ కామరాజు, బిందు మాధవి హీరో హీరోయిన్లుగా నటించారు. మనికాంత్ కద్రి సంగీతం ఈ సినిమాకి ఎసెట్.

==============================================================================

oka-urilo-zee-cinemalu

నటీ నటులు : తరుణ్, రాజా, సలోని

ఇతర నటీనటులు : చంద్రమోహన్, నరేష్, కల్పన, రామరాజు, యమునా, నిరోషా

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : రమేష్ వర్మ

ప్రొడ్యూసర్ : చంటి అడ్డాల

రిలీజ్ డేట్ : 1 జూలై 2005

లవర్ బాయ్ తరుణ్, తెలుగమ్మాయి సలోని జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ఒక ఊరిలో. ఒక అందమైన ఊరిలో మొదలైన ప్రేమకథ ఏ మలుపు తిరిగింది. చివరికి ఏమైంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపించుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

mahanandi-zee-cinemalu

నటీనటులు – సుమంత్, అనుష్క

ఇతర నటీనటులు – శ్రీహరి, సుమన్, కోటశ్రీనివాసరావు, సాయికిరణ్

సంగీత దర్శకుడు –  కృష్ణమోహన్

దర్శకుడు – సముద్ర

విడుదల తేదీ – 2005, డిసెంబర్ 3

సూపర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన అనుష్క.. తన రెండో ప్రయత్నంగా చేసిన మూవీ మహానంది. సూపర్ తో సక్సెస్ కొట్టిన స్వీటీ… మహానందితో కూడా మరో సక్సెస్ అందుకుంది. ఆర్ ఎస్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీహరి ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. ఈ సినిమా హిందీలో ఏక్ ఔర్ మహాయుధ్… మలయాళంలో ఉల్లాసం పేర్లతో డబ్ అయింది.

==============================================================================

mr-nookayya-zee-cinemalu

నటీ నటులు : మంచు మనోజ్, కృతి కర్బందా, సనా ఖాన్

ఇతర నటీనటులు :రాజా,  బ్రహ్మానందం, మురళి శర్మ ,రఘు బాబు,పరుచూరి వెంకటేశ్వరావు ,వెన్నెల కిషోర్, ఆహుతి ప్రసాద్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువ శంకర్ రాజా

డైరెక్టర్ : అనిల్ కన్నెగంటి

నిర్మాత : డి.ఎస్.రావు

రిలీజ్ డేట్ : 8  మార్చ్ 2012

మంచు మనోజ్ సరికొత్త ఎనర్జీతో ఆవిష్కరించిన సినిమా ‘మిస్టర్ నూకయ్య’. అనిల్ డైరెక్షన్ లో తెరకెక్క్కిన ఈ సినిమా లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ముఖ్యంగా  యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఈ సినిమాకు హైలైట్. ఈ సినిమాలో లవ్ సీన్స్, కామెడీ, పాటలు, క్లైమాక్స్ లో ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటాయి.