జీ సినిమాలు (డిసెంబర్ 25 th)

Saturday,December 24,2016 - 10:00 by Z_CLU

kothimokka-zee-cinemalu

హీరోహీరోయిన్లు – కృష్ణుడు, శ్రద్ధ ఆర్య

నటీనటులు – ఏవీఎస్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఎల్బీ శ్రీరాం, ఉత్తేజ్, ఎమ్మెస్ నారాయణ, హేమ, హర్షవర్థన్

సంగీతం – మణిశర్మ

దర్శకత్వం – ఏవీఎస్

విడుదల తేదీ – 2010, జులై 30

రూమ్ మేట్స్, సూపర్ హీరోస్, ఓరి నీ ప్రేమ బంగారంకాను లాంటి సినిమాలతో అప్పటికే దర్శకుడిగా మారిన ఎవీఎస్.. కృష్ణుడితో మరో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. సున్నితమైన హాస్యాన్ని పండిస్తూ తెరకెక్కిన ఆ సినిమానే కోతిమూక. కృష్ణుడు, శ్రద్ధ ఆర్య హీరోహీరోయిన్లు అయినప్పటికీ.. కథ ప్రకారం ఇందులో చాలామంది హీరోలు కనిపిస్తారు. అందరూ కడుపుబ్బా నవ్విస్తారు. ఉత్తేజ్, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం.. ఇలా ఈ హాస్యనటులంతా పండించిన కామెడీనే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. వీటితో పాటు మణిశర్మ అందించిన పాటలు కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి.

==============================================================================

shiva-zee-cinemalu

నటీ నటులు : నాగార్జున, అమల

ఇతర నటీనటులు : రఘువరన్, J.D.చక్రవర్తి, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, పరేష్ రావల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయ రాజా

డైరెక్టర్ : రామ్ గోపాల్ వర్మ

ప్రొడ్యూసర్ : అక్కినేని వెంకట్

రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 1990

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘శివ’ దాదాపు అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రూపు రేఖల్ని మార్చేసింది. సినిమా అంటే ఇలాగే ఉండాలి అని ఒక రితీన్ ఫార్మూలాలో వెళుతున్న ట్రెండ్ ఒక పెద్ద కుదుపు లాంటిదీ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయి 26 గడిచినా ఆ సినిమా పట్ల ఉన్న క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ సినిమాకి ఇళయ రాజా ఇచ్చిన సంగీతం ఇప్పటికీ ఫ్రెష్ గానే అనిపిస్తుంది.

==============================================================================

yuganiki-okkadu-zee-cinemalu

నటీ నటులు : కార్తీ, రీమా సేన్ , ఆండ్రియా

మ్యూజిక్ డైరెక్టర్ : జి.వి.ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : సెల్వ రాఘవన్

ప్రొడ్యూసర్ : ఆర్.రవీంద్రన్

విడుదల : జనవరి 14 , 2010

కార్తీ, రీమా సేన్, ఆండ్రియా లతో దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన ఎడ్వెంచర్ ఎంటర్టైనర్ చిత్రం ‘యుగానికొక్కడు’. చోళుల సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలనుకొనే ఓ అమ్మాయి ఓ ఇద్దరి సహాయం తో ఆ స్థలాన్ని చివరికీ ఎలా కనిపెట్టింది అనే కధాంశం తో తెరకెక్కిన ఈ చిత్రం లో చోళుల సామ్రాజ్యానికి ప్రయాణించే సీన్స్, చోళుల సామ్రాజ్యం లోకి ప్రవేశించే సీన్స్, ప్రవేశించిన తరువాత థ్రిల్లింగ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ఈ చిత్రం లో కార్తీ నటన, రీమా సేన్, ఆండ్రియా గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్స్.

==============================================================================

banam-zee-cinemalu

హీరోహీరోయిన్లు – నారా రోహిత్ ,వేదిక

నటీనటులు – రాజీవ్ కనకాల, సాయాజీ షిండే తదితరులు

సంగీతం  –  మణిశర్మ

దర్శకత్వం  –  చైతన్య దంతులూరి

విడుదల తేదీ – 2009

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘బాణం’. తొలి సినిమా అయినప్పటికీ కథానాయకుడిగా నారా రోహిత్ తన దైన నటనతో మంచి మార్కులు అందుకున్నాడు. 2009 లో విడుదలైన ఈ చిత్రం లో నారా రోహిత్ సరసన వేదిక కథానాయికగా నటించింది. సందేశం తో కూడిన ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో నారా రోహిత్- వేదిక జంట అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో నారా రోహిత్ సీరియస్ యాక్టింగ్ తో పాటు మణి శర్మ అందించిన సంగీతం సినిమాకు హైలైట్. దర్శకుడి చైతన్య స్క్రీన్ ప్లే, మాటలు అందరినీ ఆకట్టుకొని పాత్ బ్రేకింగ్ హానెస్ట్ మూవీ గా నిలిచిపోయింది.

==============================================================================

super-heroes-zee-cinemalu

నటీనటులు – హరీష్, ఏవీఎస్, బ్రహ్మానందం

సంగీత దర్శకుడు – కోటి

దర్శకుడు – ఏవీఎస్

విడుదల తేదీ – 1997

హాస్యనటులంతా హీరోలుగా  మారితే ఎలా ఉంటుందనే చిలిపి ఆలోచన నుంచి పుట్టిన కథే సూపర్ హీరోస్.  సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాలో ఏవీఎస్,  బ్రహ్మానందం లీడ్ క్యారెక్టర్స్ పోషించారు. అనుకోని వరం పొందిన ఏవీఎస్, బ్రహ్మానందం…  హరీష్ ప్రేమను ఎలా గెలిపించారు…  తమ తల్లిని ఎలా చేరుకున్నారు అనేదే ఈ సినిమా స్టోరీ. అత్యధిక సంఖ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొన్న సినిమాగా అప్పట్లో…  సూపర్ హీరోస్ పేరుతెచ్చుకుంది. కథ మొత్తం ఎవీఎస్, బ్రహ్మానందం చుట్టూనే తిరిగినప్పటికీ.. సెంటిమెంట్, కామెడీకి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు.

==============================================================================

 holiday-zee-cinemalu

నటీనటులు : అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా

ఇతర నటీనటులు : ఫ్రెడీ దారువాలా, సుమీత్ రాఘవన్, గోవింద, జాకీర్ హుసేన్, గిరీష్ సహదేవ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రీతమ్

డైరెక్టర్ : A.R. మురుగదాస్

ప్రొడ్యూసర్ : అరుణ్ భాటియా, ట్వింకిల్ ఖన్నా, విపుల్ అమృత్ షా

రిలీజ్ డేట్ : 6 జూన్ 2014

విరాట్ ఒక ఆర్మీ ఆఫీసర్. టెర్రరిస్టులు ముంబై నగరాన్ని వరస పేలుళ్లతో చిన్నాభిన్నం చేయాలని చేస్తున్న  ప్రయత్నాలను తెలివిగా, తన టీం సహాయంతో ఎలా అడ్డుకున్నాడు అనేదే హాలీడే సినిమా కథాంశం. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్టయిన తుపాకి సినిమాకి రీమేక్ గా A.R. మురుగదాస్  డైరెక్షన్ లో తెరకెక్కింది. యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

sachin-zee-cinemalu

 నటీనటులు : విజయ్, జెనీలియా డిసౌజా

ఇతర నటీనటులు : బేబీ ప్రీతి, బిపాషా బసు, వడివేలు, సంతానం, రఘువరన్, బాలాజీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : జాన్ మహేంద్రన్

ప్రొడ్యూసర్ : కలైపులి యస్. థాను

రిలీజ్ డేట్ : 14 ఏప్రిల్ 2005

విజయ్, జెనీలియా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం సచిన్. జాన్ మహేంద్రన్ డైరెక్షన్ లో తమిళం లో తెరకెక్కిన ‘సచిన్’ సూపర్ హిట్ అయింది దానికి డబ్బింగ్ వర్షనే ఈ తెలుగు సచిన్. బిపాషా బసు ఈ సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ లో అలరిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.