జీ సినిమాలు (డిసెంబర్ 26th)

Sunday,December 25,2016 - 10:00 by Z_CLU

premanakshatram-zee-cinemalu

హీరోహీరోయిన్లు – కృష్ణ, శ్రీదేవి

నటీనటులు – రావుగోపాలరావు, మంజుల, సులక్షణ, సుధాకర్, రంగనాథ్, మిక్కిలినేని

సంగీతం – ఎమ్మెస్ విశ్వనాథన్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం – పి.సాంబశివరావు

విడుదల తేదీ – 1982

అప్పటికే హిట్ జోడీగా పేరుతెచ్చుకున్న కృష్ణ, శ్రీదేవి కలిసి నటించిన చిత్రం ప్రేమ నక్షత్రం. టైటిల్ కు తగ్గట్టు రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా అప్పట్లో ఈ సినిమాను చూసినప్పటికీ… విడుదలైన తర్వాత కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేమనక్షత్రం పేరుతెచ్చుకుంది. ఈ సినిమాతో కృష్ణ-శ్రీదేవి జంటకు మరిన్ని మార్కులు పడ్డాయి. రావుగోపాల్రావు పర్ ఫార్మెన్స్, ఎం.ఎస్ స్వామినాథన్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణలుగా నిలిచాయి.

==========================================================================

chadastapu-mogudu-zee-cinemalu

నటీ నటులు : సుమన్, భానుప్రియ

ఇతర నటీనటులు : రాజేష్, శుభలేఖ సుధాకర్, Y. విజయ, శ్రీ లక్ష్మి, వర లక్ష్మి, K.V.లక్ష్మి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : శరత్

ప్రొడ్యూసర్ : మిద్దె రామారావు

రిలీజ్ డేట్ : 1986

సిల్వర్ స్క్రీన్ పై ఒకప్పుడు భానుప్రియ, సుమన్ జంటకి చాలా క్రేజ్ ఉండేది. వీరిద్దరూ భార్యా భర్తలుగా చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందులో చాదస్తపు మొగుడు చాలా స్పెషల్. ఈ సినిమాలో సుమన్, భానుప్రియల నటన హైలెట్ గా నిలుస్తుంది.

=============================================================================

premakhadi-zee-cinemalu

నటీనటులు : హరీష్, మాలాశ్రీ, ఊర్వశి శారద

ఇతర నటీనటులు : గోకిన రామారావు, గిరిబాబు, పి.ఎల్. నారాయణ, బ్రహ్మానందం, ఆలీ, బాబు మోహన్, త్యాగరాజు, రావి కొండల రావు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రాజన్ నాగేంద్ర

డైరెక్టర్ : ఇ.వి.వి. సత్యనారాయణ

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 1990

చెవిలో పువ్వు సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్న ఇ.వ్.వ్. సత్యనారాయణ కరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.  ‘ప్రేమ ఖైదీ’ హరీష్, మాలాశ్రీ జంటగా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద పర్ఫామెన్స్ హైలెట్ గా నిలిచింది.

=============================================================================

mr-nukayya-zee-cinemaluనటీ నటులు : మంచు మనోజ్, కృతి కర్బందా, సనా ఖాన్

ఇతర నటీనటులు :రాజా,  బ్రహ్మానందం, మురళిశర్మ ,రఘుబాబు,పరుచూటి వెంకటేశ్వరావు,వెన్నెల కిషోర్, ఆహుతి ప్రసాద్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువ శంకర్ రాజా

డైరెక్టర్ : అనిల్ కన్నెగంటి

నిర్మాత : డి.ఎస్.రావు

రిలీజ్ డేట్ : 8  మార్చ్ 2012

మంచు మనోజ్ సరి కొత్త ఎనర్జీ తో ఆవిష్కరించిన సినిమా ‘మిస్టర్ నూకయ్య’. అనిల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ముఖ్యంగా  యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఈ సినిమాకు హైలైట్. ఈ సినిమాలో లవ్ సీన్స్, కామెడీ, పాటలు, క్లైమాక్స్ లో ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటాయి.

=============================================================================

greekuveerudu-zee-cinemalu

నటీ నటులు : నాగార్జున అక్కినేని, నయన తార

ఇతర నటీనటులు : మీరా చోప్రా, K. విశ్వనాథ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, ఆలీ, M.S. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : దశరథ్

ప్రొడ్యూసర్ : D. శివ ప్రసాద్ రెడ్డి

రిలీజ్ డేట్ : 3 మే 2013

దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ గ్రీకు వీరుడు. ఒంటరిగా విదేశాల్లో పెరిగి, కుటుంబమంటే ఏంటో తెలియని యువకుడిగా నాగార్జున నటన సినిమాకే హైలెట్. నయన తార అసలు నాగార్జున జీవితంలోకి ఎలా అడుగు పెడుతుంది. ఆ తరవాత వారిద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే ప్రధాన కథాంశం. ఈ సినిమాకి S.S. తమన్ సంగీతం అందించాడు.

============================================================================

sakuni-zee-cinemalu

నటీ నటులు : కార్తీ, ప్రణీత

ఇతర నటీనటులు : సంతానం, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, నాజర్, రాధిక శరత్ కుమార్, రోజా, కిరణ్ రాథోడ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : శంకర్ దయాళ్

ప్రొడ్యూసర్ : S. R. ప్రభు

రిలీజ్ డేట్ : 22 జూన్ 2012

కార్తీ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘శకుని’. రొటీన్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా కార్తీ కరియర్ లోనే వెరీ స్పెషల్ సినిమా. సంతానం పండించే కామెడీ తో, బోర్ కొట్టకుండా సినిమాలో ఎప్పటికప్పుడు వచ్చే ట్విస్ట్ లే ఈ సినిమాకి హైలెట్. ఈ సినిమాలో ప్రణీత హీరోయిన్ గా నటించింది.

==============================================================================

public-rowdy-zee-cinemalu

నటీనటులు : భాను చందర్, హీరా

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, లక్ష్మి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రాజ్ – కోటి

డైరెక్టర్ : సాగర్

ప్రొడ్యూసర్: V.S. రామిరెడ్డి

రిలీజ్ డేట్ :  జనవరి 1, 1992

భానుచందర్ నటించిన అల్టిమేట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ పబ్లిక్ రౌడీ. పసితనంలోనే తన తల్లి అనారోగ్యం పాలవ్వడంతో తనను కాపాడుకునే ప్రయత్నంలో రౌడీలా మారతాడు. తన తండ్రి గురించి తెలుసుకున్న హీరో ఆ తరవాత ఏం చేస్తాడు..? తన తండ్రిని చేరుకుంటాడా లేదా అన్నదే ప్రధాన కథాంశం.