జీ సినిమాలు అవార్డ్స్ – మెయిన్ ఎట్రాక్షన్స్

Saturday,March 25,2017 - 12:25 by Z_CLU

జీ సినిమాలు ఛానెల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అవార్డ్స్ కార్యక్రమంలో ఎన్టీఆర్, సమంత, రానా, రకుల్, దేవిశ్రీప్రసాద్ ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. 11 కేటగిరీల్లో జరిగిన ఓటింగ్ ప్రాసెస్ లో కీలకమైన అవార్డులు వీళ్లకి దక్కాయి.

కింగ్ ఆఫ్ బాక్సాఫీస్

బాక్సాఫీస్ బద్దలు కొట్టి, రికార్డ్స్ ని తిరగరాసిన బిగ్గెస్ట్ స్టార్స్ పోటీ పడిన ఈ క్యాటగిరీలో అత్యధిక వోట్స్ తో అందరికంటే ముందు నిలిచారు యంగ్ టైగర్ NTR. హైఎండ్ కాంపిటీషన్ మధ్య ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన యంగ్ టైగర్, అత్యంత ప్రతిష్టాత్మకమైన జీ సినిమాలు ‘కింగ్ ఆఫ్ బాక్సాఫీస్’ అవార్డును అందుకున్నారు.

క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్

2016 లోహిట్ సినిమాల్లో తమ గ్లామర్ తో,క్యూట్ పర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేసిన ముద్దుగుమ్మల్లో అత్యధిక ఓట్లు దక్కించుకున్నారు సమంత. లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ కమర్షియల్ హీరోయిన్ అనిపించుకున్న సమంతకు.. www.zeecinemalu.com లో పెట్టిన ఓటింగ్ లో అత్యధిక ఓట్లు వచ్చాయి. అలా మోస్ట్ ప్రెస్టీజియస్ క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్ అవార్డు అందుకున్నారు సమంత.

జీ సినిమాలు ఫిట్టెస్ట్ స్టార్ – మేల్ అవార్డ్

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రానాను ఫాస్ట్ ట్రాక్ రిఫ్లక్స్ ఫిట్టెస్ట్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది. బాహుబలి సినిమాలో భళ్లాలదేవ పాత్రతో మెప్పించిన రానా.. తన అల్టిమేట్ ఫిజిక్ తో క్యారెక్టర్స్ కు ఓ స్పెషల్ లుక్ తీసుకొచ్చాడు. తాజాగా వచ్చిన ఘాజీ సినిమాలో రానా పర్ ఫార్మెన్స్ సింప్లీ సూపర్బ్. అందుకే ఫాస్ట్ ట్రాక్ రిఫ్లక్స్ ఫిట్టెస్ట్ స్టార్ అవార్డు రానాను వరించింది.

జీ సినిమాలు ఫిట్టెస్ట్ స్టార్ – ఫిమేల్ అవార్డ్

ఇక ఫాస్ట్ ట్రాక్ రిఫ్లెక్స్ ఫిట్టెస్ట్ స్టార్ అవార్డు – ఫిమేల్ ను రకుల్ ప్రీత్ సింగ్ దక్కించుకుంది. తనకు ఫుడ్ ఎంత ఇంపార్టెంటో.. ఎక్సర్ సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనే రకుల్… ఫిట్ నెస్ బిజినెస్ లోకి కూడా ఎంటరైంది. ప్రస్తుతం టాలీవుడ్ హాట్ బ్యూటీగా కొనసాగుతున్న రకుల్… ఫిట్టెస్ట్ స్టార్ అవార్డు-ఫిమేక్ కు బెస్ట్ ఛాయిస్ అనిపించుకుంది.

జీ సినిమాలు బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ అవార్డ్

తన పాటలతో రిలీజ్ కు ముందే సినిమాను హిట్ చేసే టాలెంట్ దేవిశ్రీప్రసాద్ సొంతం. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడంటే సినిమా సగం హిట్ అయిపోయినట్టే. తన అల్టిమేట్ ట్యూన్స్ తో అటు కుర్రాళ్లను ఇటు పెద్దోళ్లను ఎట్రాక్ట్ చేస్తున్నాడు dsp. లాస్ట్ ఇయర్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నీ హిట్టే. అందుకే జీ సినిమాలు బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ అవార్డుకు ఎంపికయ్యారు మ్యూజిక్ మెషీన్ దేవిశ్రీప్రసాద్.