జీ సినిమాలు (ఏప్రిల్ 2)

Wednesday,April 01,2020 - 09:25 by Z_CLU

కిల్లర్
నటీనటులు : అర్జున్, విజయ్ ఆంటోనీ, ఆశిమా నార్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రాజ్
సంగీతం : సైమన్ కే కింగ్
సాహిత్యం , సంభాషణలు: భాష్యశ్రీ
సినిమాటోగ్రఫీ : మాక్స్
ఎడిటర్ : రిచర్డ్ కెవిన్
ఆర్ట్ : వినోద్ రాజ్ కుమార్
బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్‌
నిర్మాతలు: టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్
రచన & దర్శకత్వం : ఆండ్రూ లూయిస్

ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటించిన చిత్రం ‘కొలైగారన్‌’.. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. అషిమా హీరోయిన్ గా నటించింది. సైమన్.కె.కింగ్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకి మాక్స్ సినిమాటోగ్రాఫర్. ఇద్దరు హీరోలు కలిసి చేసిన ఈ సినిమా రీసెంట్ టైమ్ లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ అనిపించుకుంది.

===============================

చూడాలని ఉంది
నటీనటులు : చిరంజీవి, సౌందర్య, అంజలా జవేరి
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ధూళిపాళ్ళ, బ్రహ్మాజీ, వేణు మాధవ్, ఆహుతి ప్రసాద్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : గుణశేఖర్
ప్రొడ్యూసర్ : అశ్విని దత్
రిలీజ్ డేట్ : 27 ఆగష్టు 1998

తన కూతురు ప్రియ, తనకిష్టం లేకుండా రామకృష్ణని పెళ్ళి చేసుకుందన్న కోపంతో తనపై ఎటాక్ చేయిస్తాడు మహేంద్ర. అయితే ఓ సందర్భంలో రామకృష్ణకి బులెట్ తగిలే సమయానికి ప్రియ అడ్డు పడుతుంది. దాంతో ప్రియ చనిపోతుంది. ఇదే సమయంలో రామకష్ణ, ప్రియ ల కొడుకును మహేంద్ర తీసుకెళ్ళిపోతాడు. దానికి తోడు ప్రియని చంపింది రామకృష్ణే అని హత్యానేరం మోపుతాడు. దాంతో జైలుకు వెళ్ళిన రామకృష్ణ మహేంద్ర దగ్గర ఉన్న తన కొడుకు కోసం తిరిగి వస్తాడు. అప్పుడే తనకు పద్మావతితో పరిచయమవుతుంది. చివరికి రామకృష్ణ, మహేంద్రకి ఎదురు నిలిచి కొడుకును ఎలా దక్కించు కున్నాడనేదే అసలు కథ.

===================================

అ..ఆ
నటీనటులు : నితిన్, సమంతా అక్కినేని , అనుపమ పరమేశ్వరన్
ఇతర నటీనటులు : నరేష్, నదియా, హరితేజ, అనన్య, రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జె.మేయర్
డైరెక్టర్ : త్రివిక్రమ్
ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ
రిలీజ్ డేట్ : 2 జూన్ 2016

నితిన్, సమంతా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అ..ఆ. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అనసూయ (సమంతా), తల్లి క్రమశిక్షణతో విసుగెత్తి పోతుంది. దానికి తోడు తన ఇష్టా ఇష్టాలతో సంబంధం కుదర్చడం మరో తలపోతులా ఫీలవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తండ్రి సలహా మేరకు తన మేనత్త ఇంటికి వెళ్తుంది. ఆనంద్ విహారి ( నితిన్) తో పాటు, తక్కిన ఫ్యామిలీని కలుసుకుంటుంది. ఆస్తి, ఆర్భాటాలు లేకపోయినా అనురాగ ఆప్యాయతలతో ఉండే ఆ ఫ్యామిలీని ఇష్టపడటమే కాదు ఆనంద్ విహారితో ప్రేమలో కూడా పడుతుంది అనసూయ. ఆ తరవాత ఏం జరుగుతుంది..? అనేదే ఈ సినిమాలో ప్రధాన కథాంశం.

================================

భగీరధ
నటీనటులు : రవితేజ, శ్రియ
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, నాజర్, విజయ్ కుమార్, బ్రహ్మానందం, జీవ, నాజర్, సునీల్, రఘునాథ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్
ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి
రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005

రవితేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా ‘భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవితేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

==========================

హైపర్
నటీనటులు : రామ్ పోతినేని, రాశిఖన్నా
ఇతర నటీనటులు : సత్యరాజ్, నరేష్, రావు రమేష్, తులసి శివమణి, ప్రభాస్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్
డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 30 సెప్టెంబర్ 2016

వైజాగ్ లో ప్రభుత్వ ఆఫీస్ లో ఉద్యోగిగా పనిచేసే నారాయణ మూర్తి(సత్య రాజ్) కొడుకు సూర్య( రామ్) తన నాన్నని అమితంగా ప్రేమిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అయితే అంతలో ఎంతో నిజాయితీగా ఉద్యోగం చేస్తూ త్వరలో రిటైర్ కాబోయే నారాయణ మూర్తిని టార్గెట్ చేస్తాడు మినిస్టర్ రాజప్ప(రావు రమేష్). అలా నారాయణమూర్తిని టార్గెట్ చేసిన రాజప్ప… గజ(మురళి శర్మ)తో కలిసి నారాయణ మూర్తిని చంపాలని చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు. మినిస్టర్ రాజప్పను ఎలా సవాలు చేసి ఎదుర్కొన్నాడు? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

======================

విశ్వామిత్ర
నటీనటులు : ప్రసన్న, నందితా రాజ్
ఇతర నటీనటులు : ఆషుతోష్ రానా, సత్యం రాజేష్, విద్యుల్లేఖ రామన్, జీవ, సత్య మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
డైరెక్టర్ : రాజ కిరణ్
ప్రొడ్యూసర్స్ : మాధవి అద్దంకి, S. రజినీకాంత్, ఫణి తిరుమలశెట్టి
రిలీజ్ డేట్ : 14 జూన్ 2019

అందరూ తన వాళ్లే అనుకునే ఓ మధ్యతరగతి అమ్మాయి నందితారాజ్. ఆమె అంటే అందరికీ ఇష్టమే. ఆఫీస్ లో ఆమె బాస్ మాత్రం నందితను మరో రకంగా చూస్తుంటాడు. ఎలాగైనా ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో నందిత కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంది. అయితే ఆమెకు సమస్య ఎదురైన ప్రతిసారి ఓ అజ్ఞాతవ్యక్తి వచ్చి రక్షిస్తుంటాడు. అలా వాళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది.

నందితకు పోలీసాఫీసర్ ప్రసన్న మంచి ఫ్రెండ్. మాటల సందర్భంలో ఓసారి తన అజ్ఞాత స్నేహితుడి గురించి ప్రసన్నకు చెబుతుంది. నందిత ఎలాంటి అమ్మాయో, ఎంత అమాయకురాలో తెలుసు కాబట్టి ఆమె మోసపోకూడదనే ఉద్దేశంతో, ఆ అజ్ఞాత స్నేహితుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ప్రసన్న.

ఎంక్వయిరీలో భాగంగా ప్రసన్న, నందితకు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఇంతకీ ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? నందితను అతడు పదేపదే ఎందుకు రక్షిస్తుంటాడు? తన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రసన్న తెలుసుకున్న రహస్యాలేంటి? చివరికి నందిత తన అజ్ఞాత స్నేహితుడ్ని కలుసుకుందా లేదా అనేది క్లయిమాక్స్.