జీ సినిమాలు ( ఏప్రిల్ 25th)

Monday,April 24,2017 - 10:07 by Z_CLU

నటీనటులు : వెంకటేష్, రజని

ఇతర నటీనటులు : మోహన్ బాబు, జయసుధ, నూతన ప్రసాద్, శ్రీ దివ్య, బేబీ శాలిని, అల్లు రామలింగయ్య తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : దాసరి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : డి. రామానాయుడు

రిలీజ్ డేట్ : 27 ఆగష్టు 1988

1988 లో రిలీజైన బ్రహ్మపుత్రుడు తో వెంకటేష్ ని మాస్ హీరోల లిస్టులోకి చేర్చేసింది. తమిళం లో రీమేక్ అయిన మైకేల్ రాజ్ కి రీమేక్ ఈ సినిమా. వెంకటేష్ ఈ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ సినిమాని దాసరి నారాయణ రావు గారు తెరకెక్కించారు.

==============================================================================

నటీనటులు : జెనీలియా, రాజా, సోను సూద్, సుమన్

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : నీలకంఠ రెడ్డి

ప్రొడ్యూసర్ : రామారావు బొద్దులూరి, గోపీచంద్ లగడపాటి

రిలీజ్ డేట్ : 26 జనవరి 2008

రాజా, జెనీలియా నటించిన Mr. మేధావి పర్ ఫెక్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. సోను సూద్ ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నటించాడు. సెలవుల కోసం వచ్చిన శ్వేత, విశ్వాక్ పసితనంలోనే ప్రేమలో పడతారు. ఆ ప్రేమను విశ్వాక్ పెద్దయ్యాక కూడా కొనసాగిస్తాడు కానీ శ్వేత మరిచిపోతుంది. దానికి తోడు బిలియనీర్ అయిన సిద్ధార్థ్ తో పెళ్ళికి రెడీ అయిపోతుంది. అప్పుడు విశ్వాక్ తన ప్రేమను దకిన్చుకోవడానికి ఏం చేస్తాడు. ఎలా Mr. మేధావి అనిపించుకుంటాడు అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

నటీనటులు : జగపతి బాబు, భూమిక చావ్లా, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు : అర్జున్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆలీ, సునీల్, వేణు మాధవ్, మల్లికార్జున రావు, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : R.P. పట్నాయక్

డైరెక్టర్ : దశరథ్

ప్రొడ్యూసర్ : ఆదిత్య రామ్

రిలీజ్ డేట్ : 25 జనవరి 2008

రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా జీవితం విలువలను సున్నితంగా తడుతూ తెరకెక్కిన సినిమా’ స్వాగతం’ దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఇమోషనల్ ఎంటర్ టైనర్ లో భూమిక నటన హైలెట్ గా నిలుస్తుంది. R.P. పట్నాయక్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం.

=============================================================================

నటీనటులు : భూమిక, అబ్బాస్

ఇతర తారాగణం : రవిబాబు, నిఖిత, సుహాని, శంకర్ మెల్కోటే

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : రవి బాబు

రిలీజ్ డేట్ : 21 డిసెంబర్ 2007

భూమిక ప్రధాన పాత్రలో నటించిన అనసూయ సెన్సేషనల్ క్రైం థ్రిల్లర్. ఒక మర్డర్ సిరీస్ ని ఛేదించే కథనంతో సాగే అనసూయ ఊహించని మలుపులతో ఆద్యంతం అలరిస్తుంది. హత్య జరిగిన చోట హంతకుడు రోజా పువ్వును ఎందుకు వదిలి వెళ్తున్నాడో, శవం నుండి ఒక్కో అవయవాన్ని ఎందుకు తొలగిస్తున్నాడో లాంటి అంశాలు సినిమా క్లైమాక్స్ వరకు కట్టి పడేస్తాయి. ఈ సిన్మాకి రవిబాబు డైరెక్టర్.

=============================================================================

హీరోహీరోయిన్లు – బాలకృష్ణ, లైలా

నటీనటులు – రోషిని, కోట శ్రీనివాసరావు, సుధాకర్, అలీ, పొన్నాంబలం

సంగీతం – కోటి

దర్శకత్వం – ముత్యాల  సుబ్బయ్య

విడుదల – 1998, june 4

నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి 1997లో పెద్దన్నయ్య, ముద్దుల మొగుడు అనే రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. వాటి తర్వాత బాలయ్య సినిమాలపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలా 1998లో భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం పవిత్ర ప్రేమ. అప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న లైలాను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది.

============================================================================

నటీనటులు : జ్యోతిక, పృథ్విరాజ్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, స్వర్ణమాల, వత్సల రాజగోపాల్, బ్రహ్మానందం, M.S. భాస్కర్, శ్రీరంజిని తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విద్యా సాగర్

డైరెక్టర్ : రాధా మోహన్

ప్రొడ్యూసర్ : ప్రకాష్ రాజ్

రిలీజ్ డేట్ : 23 ఫిబ్రవరి 2007

జ్యోతిక, పృథ్వీరాజ్ జంటగా నటించిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మాటరాని మౌనమిది.  రాధా మోహన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మూగ అమ్మాయిగా జ్యోతిక పర్ఫామెన్స్ హైలెట్ గా నిలిచింది.

==============================================================================

నటీ నటులు : మంచు మనోజ్, కృతి కర్బందా, సనా ఖాన్

ఇతర నటీనటులు :రాజాబ్రహ్మానందం, మురళి శర్మ ,రఘు బాబు,పరుచూటి వెంకటేశ్వరావు ,వెన్నెల కిషోర్, ఆహుతి ప్రసాద్ తదితరులు 

మ్యూజిక్ డైరెక్టర్ : యువ శంకర్ రాజా

డైరెక్టర్ : అనిల్ కన్నెగంటి

నిర్మాత : డి.ఎస్.రావు

రిలీజ్ డేట్ : 8  మార్చ్ 2012 

మంచు మనోజ్ సరి కొత్త ఎనర్జీ తో ఆవిష్కరించిన సినిమా మిస్టర్ నూకయ్య‘. అనిల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ముఖ్యంగా  యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఈ సినిమాకు హైలైట్. ఈ సినిమాలో లవ్ సీన్స్, కామెడీ, పాటలు, క్లైమాక్స్ లో ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటాయి.