జీ సినిమాలు ( ఏప్రిల్ 10th)

Sunday,April 09,2017 - 10:11 by Z_CLU

నటీనటులు : వెంకటేష్, రేవతి

ఇతర నటీనటులు : S.P. బాల సుబ్రహ్మణ్యం, గొల్లపూడి మారుతి రావు, మంజుల, కల్పన, బ్రహ్మానందం, రాళ్ళపల్లి

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : సురేష్ కృష్ణ

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 12 జనవరి 1989

వెంకటేష్, రేవతి నటించిన మ్యూజికల్ హిట్ ప్రేమ. ఈ సినిమాని నిర్మించిన రామా నాయుడు దీనిని హిందీలో కూడా రీమేక్ చేశారు. వెంకటేష్ కరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకి సురేష్ కృష్ణ డైరెక్టర్. ఇళయ రాజా సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

===========================================================================

హీరోహీరోయిన్లు  – సుమన్, రచన, హీరా

నటీనటులు – ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, మల్లికార్జునరావు, కోటశ్రీనివాసరావు,  కైకాల సత్యనారాయణ

సంగీతం – ఈశ్వర్

దర్శకత్వం – బోయిన సుబ్బారావు

నిర్మాత – డి. రామానాయుడు

విడుదల – 1999, జనవరి 13

భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చాటిచెప్పడంతో పాటు… ఆలుమగల మధ్య మాట పట్టింపులు, అనుమానాలు వస్తే కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమైపోతాయో చాటిచెప్పిన చిత్రమే పెద్ద మనుషులు. సినిమా మొత్తం సుమన్ చుట్టూనే తిరిగినప్పటికీ… పెద్దమనుషులుగా కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు తన నటనతో సినిమాకు హైలెట్ గా నిలిచాడు. ఈ సినిమాతోనే ఈశ్వర్… సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

==============================================================================

హీరోహీరోయిన్లు – శివాజీ, లయ

నటీనటులు – సంగీత, మధుశర్మ, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ఏవీఎస్

సంగీతం – ఎం.ఎం.శ్రీలేఖ

స్క్రీన్ ప్లే, దర్శకత్వం – శ్రీనివాసరెడ్డి

విడుదల తేదీ – 2005, ఆగస్ట్ 20

బ్యానర్ – ఎస్పీ క్రియేషన్స్

శివాజీ, లయ కలిసి నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అదిరిందయ్యా చంద్రం.  శివాజీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. శివాజీలో అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉందని మరోసారి నిరూపించింది ఈ సినిమా.

===========================================================================

హీరోహీరోయిన్లు – ఉదయనిథి స్టాలిన్, నయనతార

సంగీతం – హరీష్ జైరాజ్

దర్శకత్వం – ఎస్.ఆర్ ప్రభాకరన్

విడుదల తేదీ – 2015

అప్పటికే ఓకే ఓకే సినిమాతో తెలుగులో కూడా పెద్ద హిట్ అందుకున్నాడు ఉదయ్ నిధి స్టాలిన్. ఆ ఉత్సాహంతో 2014లో విడుదలైన తన తమిళ సినిమాను… శీనుగాడి లవ్ స్టోరీ పేరుతో తెలుగులోకి కూడా డబ్ చేసి రిలీజ్ చేశాడు. నయనతార హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాకు తెలుగులో కూడా రీచ్ పెరిగింది. పైగా తెలుగులో ఓకేఓకే హిట్ అవ్వడంతో.. శీనుగాడి లవ్ స్టోరీకి కూడా క్రేజ్ ఏర్పడింది. ప్రభాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు కూడా ఎప్పట్లానే తానే నిర్మాతగా వ్యవహరించాడు ఉదయ్ నిథి స్టాలిన్.

==============================================================================

నటీనటులు – సుమంత్, అనుష్క

ఇతర నటీనటులు – శ్రీహరి, సుమన్, కోటశ్రీనివాసరావు, సాయికిరణ్

సంగీత దర్శకుడు –  కృష్ణమోహన్

దర్శకుడు – సముద్ర

విడుదల తేదీ – 2005, డిసెంబర్ 3

సూపర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన అనుష్క.. తన రెండో ప్రయత్నంగా చేసిన మూవీ మహానంది. సూపర్ తో సక్సెస్ కొట్టిన స్వీటీ… మహానందితో కూడా మరో సక్సెస్ అందుకుంది. ఆర్ ఎస్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీహరి ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. ఈ సినిమా హిందీలో ఏక్ ఔర్ మహాయుధ్… మలయాళంలో ఉల్లాసం పేర్లతో డబ్ అయింది.

==============================================================================

నటీ నటులు : శ్రీహరి, మధు శర్మ, KR విజయ

ఇతర నటీనటులు : విజయ్ చందర్, రంగనాథ్, ప్రదీప్ రావత్, పింకీ సర్కార్, మానస, దేవి శ్రీ, LB శ్రీ రామ్, కొండవలస, వేణు మాధవ్, కోవై సరళ

మ్యూజిక్ డైరెక్టర్ : వందేమాతరం శ్రీనివాస్

డైరెక్టర్ : చంద్ర మహేష్

ప్రొడ్యూసర్ : శాంత కుమారి

శ్రీహరి హీరోగా తెరకెక్కిన హనుమంతు డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన పక్కా హిట్ ఫార్ములా తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్. పల్లెటూరిలో ఉండే ఒక సాధారణ వ్యక్తి, తన గతం తెలుసుకుని, తన తండ్రి చావుకు కారణమైన వారికి బుద్ధి చెప్పి, సగంలోనే సమసిపోయిన తన తండ్రి లక్ష్యం కోసం కోసం పోరాడే కొడుకుగా, ఫ్లాష్ బ్యాక్ లో స్వాతంత్రం కోసం పోరాడే యోధుడిగా అద్భుతంగా నటించాడు శ్రీహరి. ఈ సినిమాకి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం ప్రాణం.

============================================================================

నటీనటులు : వెంకటేష్, రజని

ఇతర నటీనటులు : మోహన్ బాబు, జయసుధ, నూతన ప్రసాద్, శ్రీ దివ్య, బేబీ శాలిని, అల్లు రామలింగయ్య తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : దాసరి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : డి. రామానాయుడు

రిలీజ్ డేట్ : 27 ఆగష్టు 1988

1988 లో రిలీజైన బ్రహ్మపుత్రుడు తో వెంకటేష్ ని మాస్ హీరోల లిస్టులోకి చేర్చేసింది. తమిళం లో రీమేక్ అయిన మైకేల్ రాజ్ కి రీమేక్ ఈ సినిమా. వెంకటేష్ ఈ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ సినిమాని దాసరి నారాయణ రావు గారు తెరకెక్కించారు.