జీ సినిమాలు ( 9th మే )

Wednesday,May 08,2019 - 10:03 by Z_CLU

నక్షత్రం
నటీనటులు : సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, రెజినా
ఇతర నటీనటులు : తనిష్, శ్రియ శరణ్, ప్రకాష్ రాజ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్
డైరెక్టర్ : కృష్ణవంశీ
ప్రొడ్యూసర్స్ : K. శ్రీనివాసులు, S. వేణు గోపాల్
రిలీజ్ డేట్ :  4 ఆగష్టు
రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటుందో.. సమాజంలో పోలీస్పాత్ర అలాంటిది. పోలీస్ అంటే హనుమంతుడు అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది నక్షత్రం. పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో వున్న ఓ యువకుడి కథే ఈ నక్షత్రం’. అతడ్ని పోలీస్ కాకుండా అడ్డుకున్నది ఎవరు.. చివరికి సందీప్ కిషన్ పోలీస్ అయ్యాడా లేదా అనేది స్టోరీ. ఈ బేసిక్ ప్లాట్ కు లవ్, రొమాన్స్, సెంటిమెంట్ ను యాడ్ చేశాడు దర్శకుడు కృష్ణవంశీ. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ స్పెషల్ రోల్ ప్లే చేశాడు.

==============================================================================

వసంతం 

నటీనటులు : వెంకటేష్ఆర్తి అగర్వాల్కళ్యాణి

ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్ఆకాష్సునీల్చంద్ర మోహన్తనికెళ్ళ భరణిధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్

డైరెక్టర్ విక్రమన్

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్

రిలీజ్ డేట్ : 11 జూలై 2003

స్నేహానికిప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

రామయ్యా వస్తావయ్యా
నటీనటులు : NTR, శృతి హాసన్సమంత రుత్ ప్రభు
ఇతర నటీనటులు : విద్యుల్లేఖ రమణ్, P.రవి శంకర్ముకేష్ రిషికోట శ్రీనివాస్ రావురావు రమేష్తనికెళ్ళ భరణి
సంగీతం : S.S. తమన్
డైరెక్టర్ : హరీష్ శంకర్
నిర్మాత : దిల్ రాజు
జూనియర్ ఎన్టీఆర్ కరియర్ లోనే కలర్ ఫుల్ గా ఎంటర్ టైనర్ గా నిలిచింది రామయ్యా వస్తావయ్య. శృతి హాసన్సమంతా లు హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ లో లవర్ బాయ్ లాజాలీగా ఉండే కుర్రాడిలా ఉండే NTR, ఇంటర్వెల్ బ్యాంగ్ తరవాత తన విశ్వరూపం చూపిస్తాడు. ఎక్స్ పెక్ట్ చేయని ట్విస్టు లతో సినిమాని చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడు హరీష్ శంకర్. S.S. తమన్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

==============================================================================

సైనికుడు
నటీనటులు : మహేష్ బాబు, త్రిష కృష్ణన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఇర్ఫాన్ ఖాన్, కామ్న జెఠ్మలాని, కోట శ్రీనివాస రావు, రవి వర్మ అజయ్
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ : గుణశేఖర్
ప్రొడ్యూసర్ :  అశ్విని దత్
రిలీజ్ డేట్ :  1 డిసెంబర్ 2006
మహేష్ బాబు కరియర్ లో సైనికుడు సినిమా ప్రత్యేకమైనది. రాజకీయ అవినీతి పరులపై ఒక యువకుడు చేసిన పోరాటమే సైనికుడు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు. త్రిష అమాయకత్వపు నటన సినిమాకే హైలెట్. హారిస్ జయరాజ్ ప్రతి పాట బావుంటుంది.

==============================================================================

అ..ఆ

నటీనటులు నితిన్సమంతా అక్కినేని , అనుపమ పరమేశ్వరన్

ఇతర నటీనటులు : నరేష్నదియాహరితేజఅనన్యరావు రమేష్శ్రీనివాస్ అవసరాల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ.జె.మేయర్

డైరెక్టర్ : త్రివిక్రమ్

ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ

రిలీజ్ డేట్ : 2 జూన్ 2016

నితిన్సమంతా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అ..ఆ. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అనసూయ (సమంతా)తల్లి క్రమశిక్షణతో విసుగెత్తి పోతుంది. దానికి తోడు తన ఇష్టా ఇష్టాలతో సంబంధం కుదర్చడం మరో తలపోతులా ఫీలవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తండ్రి సలహా మేరకు తన మేనత్త ఇంటికి  వెళ్తుంది. ఆనంద్  విహారి ( నితిన్) తో పాటుతక్కిన ఫ్యామిలీని కలుసుకుంటుంది. ఆస్తిఆర్భాటాలు లేకపోయినా అనురాగ ఆప్యాయతలతో  ఉండే ఆ ఫ్యామిలీని ఇష్టపడటమే కాదు ఆనంద్ విహారితో ప్రేమలో కూడా పడుతుంది అనసూయ.  ఆ తరవాత ఏం జరుగుతుంది..అనేదే ఈ సినిమాలో ప్రధాన కథాంశం.

==============================================================================

గీతాంజలి

నటీనటులు అంజలిశ్రీనివాస్ రెడ్డి

ఇతర నటీనటులు : మధునందన్హర్షవర్ధన్ రాణేబ్రహ్మానందంఆలీరావు రమేష్సత్యం రాజేష్శంకర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ లక్కరాజు

డైరెక్టర్ : రాజ్ కిరణ్

ప్రొడ్యూసర్ : కోన వెంకట్

రిలీజ్ డేట్ : 8 ఆగష్టు 2014

అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గీతాంజలి. ఈ సినిమాలో అంజలి డ్యూయల్ రోల్ లో ఎంటర్ టైనర్ చేసింది. ఫ్లాష్ బ్యాక్ లో ఇన్నోసెంట్ అమ్మాయిగా అంజలి నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.