జీ సినిమాలు ( 8th డిసెంబర్ )

Saturday,December 07,2019 - 10:02 by Z_CLU

నాగభరణం

నటీనటులు : విష్ణువర్ధన్దిగంత్రమ్య

ఇతర నటీనటులు : సాయి కుమార్రాజేష్ వివేక్దర్శన్సాదు కోకిలఅమిత్ తివారీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : గురుకిరణ్

డైరెక్టర్ : కోడి రామకృష్ణ

ప్రొడ్యూసర్స్ : సాజిద్ ఖురేషిసోహెల్ అన్సారిధవళ్ గాద

రిలీజ్ డేట్ : 14 అక్టోబర్ 2016

సూర్య గ్రహణం రోజు తమ శక్తి అంత కోల్పోతామని గ్రహించి  దేవుళ్లందరూ కలిసి తమ శక్తితో ఓ  శక్తివంతమైన ‘శక్తి కవచం‘ సృష్టిస్తారు. లోకాన్ని అంతా కాపాడే  ఈ అతి శక్తివంతమైన శక్తికవచాన్ని తమ సొంతం చేసుకోవడానికి కోసం ఎన్నో దుష్ట శక్తులు ప్రయత్నిస్తాయి. అయితే ఆ దుష్ట శక్తుల నుంచి కవచాన్ని శివయ్య(సాయి కుమార్) కుటుంబం  తరతరాలుగా కాపాడుకుంటూ వస్తుంది. శివయ్య తరువాత ఆ శక్తి కవచాన్ని తమ కుటుంబం తరుపున కాపాడుకుంటూ వస్తున్న నాగమ్మ(రమ్య) ఒకానొక సందర్భంలో మరణించి మరో జన్మలో మానస గా పుట్టి ఆ శక్తి కవచం సుస్థిర స్థానంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ శక్తి కవచం ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారి దగ్గర ఉందని దానిని ఢిల్లీ మ్యూజిక్ కాంపిటీషన్ లో బహుమతి గా ఇస్తారని తెలుసుకున్న మానస…  నాగ్ చరణ్  (దిగంత్) అనే మ్యూజిషియన్ ద్వారా ఆ కవచాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తుంది.


ఈ క్రమంలో ఆ కవచాన్ని దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన విలన్స్ ను దుష్ట శక్తులను మానస ఎలా అంతం చేసిందిచివరికి శక్తి కవచాన్ని ఎలా కాపాడుకుందిఅనేది ఈ సినిమా స్టోరీ.

==============================================================================

తులసి

నటీనటులు వెంకటేష్, నయనతార

ఇతర నటీనటులు : రమ్యకృష్ణ,  శ్రియ, మాస్టర్ అతులిత్, ఆశిష్ విద్యార్థి, రాహుల్ దేవ్, శివాజీ, జయ ప్రకాష్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : బోయపాటి శ్రీను

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2007

వెంకటేష్, నయనతార జంటగా నటించిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ తులసి. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లో సూపర్ హిట్టయింది. సెంటిమెంట్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. రమ్యకృష్ణ క్యారెక్టర్ సినిమాకి ప్లస్.

==============================================================================

ఒక్కడొచ్చాడు

నటీనటులు : విశాల్, తమన్నా

ఇతర నటీనటులు : వడివేలు, జగపతి బాబు, సూరి, తరుణ్ అరోరా, జయప్రకాష్, నిరోషా మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా

డైరెక్టర్ : సూరజ్

ప్రొడ్యూసర్ : S. నంద గోపాల్

రిలీజ్ డేట్ : 23 డిసెంబర్ 2016

డీజీపీ చంద్రబోస్ (జగపతిబాబు) ఒక ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. అతను దేవా (సంపత్) నుండి 50 కోట్ల డబ్బు రికవర్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే సిటీకి వచ్చిన అర్జున్ (విశాల్) దివ్య (తమన్నా) ని ప్రేమిస్తాడు. డీజీపీ చంద్రబోస్ చెల్లి అయిన దివ్య కూడా అతని బ్యాక్ గ్రౌండ్ ఏం తెలుసుకోకుండానే అతనితో లవ్ లో పడిపోతుంది. దివ్య ప్రేమని అంగీకరించిన చంద్రబోస్ పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసే సమయంలో అర్జున్ తాను ఒక సిబిఐ ఆఫీసర్ అని చెప్తాడు. అంతేకాదు డీజీపీ దగ్గరనుండి 250 కోట్లు స్వాధీనం చేసుకుంటాడు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటి…? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

==============================================================================

లీడర్
నటీనటులు : రానా దగ్గుబాటి, ప్రియా ఆనంద్, రిచా గంగోపాధ్యాయ
ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, సుహాసినీ మణిరత్నం, సుబ్బరాజు మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జే.మేయర్
డైరెక్టర్ శేఖర్ కమ్ముల
ప్రొడ్యూసర్ : M. శరవణన్, M.S. గుహన్
రిలీజ్ డేట్ : 19 ఫిబ్రవరి 2010
రానా దగ్గుబాటి ఈ సినిమాతోనే టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ అయ్యాడు. న్యూ ఏజ్ పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాలో రానా ముఖ్యమంత్రిగా నటించాడు. తన తండ్రి మరణం తరవాత పదవీ పగ్గాలు చేతిలోకి తీసుకున్న ఈ యంగ్ పాలిటీషియన్ వ్యవస్థలో ఉన్న లొపాలను సరిదిద్దగలిగాడా…? ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగాడా..? అన్నదే ఈ సినిమాలోని ప్రధాన కథాంశం.

==============================================================================

లై

నటీనటులు నితిన్, మేఘా ఆకాష్

ఇతర నటీనటులు : అర్జున్ సర్జ, శ్రీకాంత్, అజయ్, రవి కిషన్, నాజర్, ధృతిమాన్ ఛటర్జీ, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ

డైరెక్టర్ హను రాఘవపూడి

ప్రొడ్యూసర్ : రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర

రిలీజ్ డేట్ : 11 ఆగష్టు 2017  

లై’ స్టోరీలైన్ చెప్పాలంటే సినిమా మొత్తం టైటిల్ కు తగ్గట్టు అబద్ధాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మీదే నడుస్తుంది. ఓ సూటు చుట్టూ అల్లుకున్న ఇంటలిజెంట్ స్టోరీలైన్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఒక సూట్ చుట్టూ కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో పాతబస్తీ కుర్రాడికి, లాస్ వెగాస్ లో ఉన్న విలన్ కనెక్ట్ అవ్వడం, ఇలా చెప్పుకుంటూ పోతే ‘లై’ కంప్లీట్ గా ఒక ఇంటెలిజెంట్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్. నితిన్, మేఘా ఆకాష్ కెమిస్ట్రీ సినిమాకి మరో ఎట్రాక్షన్.

==============================================================================

సుడిగాడు
నటీనటులు : అల్లరి నరేష్మోనాల్ గజ్జర్
ఇతర నటీనటులు : బ్రహ్మానందంఆలీ, M.S. నారాయణరఘుబాబువేణు మాధవ్చంద్ర మోహన్చలపతి రావుధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్
డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు
ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ D రెడ్డి
రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012
అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్,  బ్రహ్మానందం కాంబినేషన్ లోని కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.