జీ సినిమాలు (8th ఏప్రిల్)

Wednesday,April 07,2021 - 10:00 by Z_CLU

ఫోరెన్సిక్

నటీనటులు : తొవినో థామస్ , మమత మోహన్ దాస్ ,సిజ్జు, రేంజి , రెబా మోనికా ,రోనీ డేవిడ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జేక్స్ బిజోయ్

డైరెక్టర్ : అఖిల్ పౌల్

ప్రొడ్యూసర్ : నేవిక్స్ , సిజు

రిలీజ్ డేట్ : 28 ఫిబ్రవరి 2020

‘ఫోరెన్సిక్’ క్రైం మిస్టరీ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన సినిమా. సైకో థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారిని సినిమా బాగా ఆకట్టుకుంటుంది. కథ -కథనంతో పాటు నేపథ్య సంగీతం మమత మోహన్ దాస్ , థామస్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్.

__________________________________

hyper-zee-cinemalu-586x283

హైపర్

నటీనటులు : రామ్ పోతినేనిరాశిఖన్నా
ఇతర నటీనటులు : సత్యరాజ్నరేష్రావు రమేష్తులసి శివమణిప్రభాస్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్
డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : రామ్ ఆచంటగోపీ ఆచంటఅనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 30 సెప్టెంబర్ 2016

వైజాగ్ లో  ప్రభుత్వ ఆఫీస్ లో ఉద్యోగిగా పనిచేసే నారాయణ మూర్తి(సత్య రాజ్) కొడుకు సూర్య( రామ్) తన నాన్నని అమితంగా ప్రేమిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అయితే అంతలో ఎంతో నిజాయితీగా ఉద్యోగం చేస్తూ త్వరలో రిటైర్ కాబోయే నారాయణ మూర్తిని టార్గెట్ చేస్తాడు మినిస్టర్ రాజప్ప(రావు రమేష్). అలా నారాయణమూర్తిని టార్గెట్ చేసిన రాజప్ప… గజ(మురళి శర్మ)తో కలిసి నారాయణ మూర్తిని చంపాలని చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు. మినిస్టర్ రాజప్పను ఎలా సవాలు చేసి ఎదుర్కొన్నాడుఅనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

_____________________________________

ready-zee-cinemalu-551x320-551x320-1-551x320

రెడీ

నటీనటులు : రామ్, జెనీలియా
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, నాజర్, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు,జయప్రకాష్ రెడ్డి, సుప్రీత్, షఫీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : శ్రీను వైట్ల
ప్రొడ్యూసర్ : స్రవంతి రవి కిషోర్
రిలీజ్ డేట్ : 19 జూన్ 2008

రామ్ జెనీలియా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ రెడీ. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. కామెడీ తో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

______________________________________

ఇద్దరమ్మాయిలతో

నటీనటులు : అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్
ఇతరనటీనటులు:బ్రహ్మానందం,తనికెళ్ళ భరణి, తులసి,  నాజర్,  ప్రగతి, ఆలీ, షవార్ ఆలీతదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : పూరి జగన్నాథ్
ప్రొడ్యూసర్ : బండ్ల గణేష్
రిలీజ్ డేట్ : 31 మే, 2013

అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ హీరోగా తెరకెక్కిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ఇద్దరమ్మాయిలతో. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా బన్ని కరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిర్మించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎసెట్.

______________________________________

నిశ్శబ్దం

నటీ నటులు : అనుష్క , మాధవన్ , అంజలి , సుబ్బరాజు , శాలిని పాండే తదితరులు

సంగీతం : గోపీసుందర్

నేపథ్య సంగీతం : గిరీష్ గోపాలకృష్ణ

క్రియేటివ్ ప్రొడ్యూసర్ : కోనా వెంకట్

నిర్మాత : TG విశ్వప్రసాద్

రచన -దర్శకత్వం : హేమంత్ మధుకర్

విడుదల తేది : 1 అక్టోబర్ 2020

మర్డర్ మిస్టరీస్ టాలీవుడ్ కి కొత్త కాదు. కానీ అనుష్క ‘నిశ్శబ్దం’ మాత్రం కాస్త డిఫెరెంట్. మరీ ముఖ్యంగా సినిమాలోని క్యారెక్టర్స్ ఒక్కొక్కటి దేనికదే ప్రత్యేకం అనిపిస్తుంది. సాక్షి పాత్రలో అనుష్క నటన సినిమాకే హైలైట్.