జీ సినిమాలు ( 7th అక్టోబర్ )

Sunday,October 06,2019 - 10:22 by Z_CLU

అవును 2

నటీనటులు పూర్ణ, హర్షవర్ధన్ రాణే

ఇతర నటీనటులు రవి బాబు, సంజన గల్రాని, నిఖిత తుక్రాల్, రవి వర్మ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర

డైరెక్టర్ రవి బాబు

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 3 ఏప్రిల్ 2015

రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అవును సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది అవును 2. ఈ సినిమా కూడా రవిబాబు మార్క్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. హీరోయిన్ పూర్ణ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

=============================================================================

చినబాబు
నటీనటులు : కార్తీ, సాయేషా
ఇతర నటీనటులు సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, అర్ధన బిను, సూరి, భానుప్రియ, విజి చంద్రశేఖర్, సరోజా, మౌనిక తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్
డైరెక్టర్ పాండిరాజ్
ప్రొడ్యూసర్ సూర్య
రిలీజ్ డేట్ : 13 జూలై 2018
రుద్రరాజు(సత్య రాజ్)ది పెద్ద కుటుంబం. ఇద్దరు భార్యలు, ఆరుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిల తర్వాత మగ పిల్లాడి కోసం ఎదురుచూస్తున్న వేళ ఆఖరివాడుగా కృష్ణంరాజు(కార్తి) పుడతాడు. అందుకే చినబాబు అవుతాడు. పొలం బాధ్యతలతో పాటు కుటుంబాన్ని కూడా చూసుకుంటాడు చినబాబు. వ్యవసాయం అనేది వృతి కాదు… జీవన విధానం అని నమ్మే చినబాబు పల్లెటూళ్ల నుండి సిటీకెళ్ళిన వాళ్లంతా ఎప్పటికైనా సొంత ఊరిలో రైతులుగా స్థిరపడాలనే లక్ష్యంతో రైతుగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో జాలీ సోడా యజమాని నీల నీరధ(సాయేషా)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు.
కానీ చినబాబు అక్కయ్యలకు వయసుకు వచ్చిన ఇద్దరు కూతుర్లుంటారు. మేనమామగా మరదళ్లను చిన్నతనం నుండి అల్లారుముద్దుగా చూసుకుంటాడు. అయితే తనకు నచ్చిన అమ్మాయిని కాకుండా తమ కూతురునే పెళ్లి చేసుకోవాలని చినబాబుతో గొడవకు దిగుతారు ఇద్దరు అక్కలు.
మరోవైపు కులరాజకీయాలు నడుపుతూ ఊరిలో పెద్దమనిషిగా ఉండే సురేందర్ రాజు(శత్రు)ని ఒక స్టూడెంట్ హత్య కేసులో జైలుకు పంపిస్తాడు చినబాబు. పగబట్టిన సురేందర్ రాజు చినబాబుని చంపే ప్రయత్నాల్లో ఉంటాడు. చినబాబు పెళ్ళి మేటర్ తో కుటుంబంలో కలతలొస్తాయి. మరి చినబాబు తన అక్కయ్యలను ఒప్పించి తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడా… చివరికి సురేందర్ రాజు నుంచి ఎలా తప్పించుకున్నాడు… కుటుంబం మొత్తాన్ని ఎలా కలిపాడనేది మిగతా కథ…

=============================================================================

శతమానం భవతి

నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్

ఇతర నటీనటులు ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, ఇంద్రజ, రాజా రవీంద్ర, హిమజ, ప్రవీణ్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జే. మేయర్

డైరెక్టర్ సతీష్ వేగేశ్న

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 14 జనవరి 2017

ఆత్రేయ పురం అనే గ్రామంలో రాఘవ రాజు(ప్రకాష్ రాజ్) జానకమ్మ(జయసుధ) అనే దంపతులు తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడి తమను చూడడానికి రాకపోవడంతో కలత చెంది తన మనవడు రాజు (శర్వానంద్) తో కలిసి సొంత ఊరిలోనే జీవిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లల్ని ఎలాగైనా సంక్రాంతికి తమ ఊరికి రప్పించాలని రాజు గారిని కోరుతుంది జానకమ్మ. తన భార్య కోరిక మేరకూ ఎప్పుడు కబురుపెట్టినా రాని పిల్లల కోసం ఒక పథకం వేసి సంక్రాంతికి ఊరు రప్పిస్తాడు రాఘవ రాజు. ఇంతకీ రాజు గారు వేసిన ఆ పథకం ఏమిటి? రాజు గారి కబురు మేరకు స్వదేశం తిరిగొచ్చిన పిల్లలు తాము దూరంగా ఉండడం వల్ల తల్లిదండ్రుల పడుతున్న భాధ ఎలా తెలుసుకున్నారు? అనేది ఈ సినిమా కథాంశం.

==============================================================================

బ్రదర్ అఫ్ బొమ్మాళి

నటీనటులు అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర

డైరెక్టర్ చిన్ని కృష్ణ

ప్రొడ్యూసర్ అమ్మి రాజు కనిమిల్లి

రిలీజ్ డేట్ నవంబర్ 7 , 2014

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.  కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ  పెర్ఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

=============================================================================

నేను లోకల్

నటీనటులు : నాని, కీర్తి సురేష్

ఇతర నటీనటులు : నవీన్ చంద్ర, సచిన్ ఖేడేకర్, తులసి, రామ్ ప్రసాద్, రావు రమేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన

ప్రొడ్యూసర్ దిల్ రాజు

రిలీజ్ డేట్ : 3 ఫిబ్రవరి 2017

బాబు (నాని) అనే కుర్రాడు తన పేరెంట్స్ కోసం ఎట్టకేలకు దొంగదారిలో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తాడు. అలా గ్రాడ్యుయేట్ అయిపోయి ఖాళీగా ఉన్న బాబు… ఒకానొక సందర్భంలో కీర్తి(కీర్తి సురేష్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. అలా ప్రేమలో పడిన బాబు తన నెక్స్ట్ పనులన్నింటినీ పక్కన పెడతాడు. కీర్తిపైనే పూర్తి ఫోకస్ పెట్టి ఆమె చదివే ఎంబీఏ కాలేజ్ లోనే జాయిన్ అయి.. ఎట్టకేలకి కీర్తిని తన ప్రేమలో పడేస్తాడు. బాబుకు కీర్తినిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని కీర్తి తండ్రి(సచిన్ ఖేడేకర్) సబ్ ఇనస్పెక్టర్ సిద్దార్థ్ వర్మ(నవీన్ చంద్ర)తో కీర్తి పెళ్లి నిశ్చయిస్తాడు. చివరికి బాబు తన లోకల్ తెలివితేటలతో సిద్దార్థ్ వర్మని సైడ్ చేసి.. కీర్తి తండ్రిని ఎలా ఒప్పించాడు….తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడనేది మిగతా కథ.

=============================================================================

దమ్ము
నటీనటులు : N.T.R, త్రిష కృష్ణన్, కార్తీక నాయర్
ఇతర నటీనటులు వేణు తొట్టెంపూడి, అభినయ, భానుప్రియ, నాజర్, సుమన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, సంపత్ రాజ్, కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి
డైరెక్టర్ బోయపాటి శ్రీను
ప్రొడ్యూసర్ : అలెగ్జాండర్ వల్లభ
రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2012
బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ దమ్ము. N.T.R స్టామినా పర్ ఫెక్ట్ గా ఎలివేట్ అయిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడు. యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.