జీ సినిమాలు ( 6th నవంబర్ )

Tuesday,November 05,2019 - 10:03 by Z_CLU

గోల్కొండ హై స్కూల్

నటీనటులు : సుమంత్స్వాతి

ఇతర నటీనటులు : సుబ్బరాజుతనికెళ్ళ భరణి ,షఫీ ,విద్య సాగర్

మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్

డైరెక్టర్ : ఇంద్రగంటి మోహన కృష్ణ

ప్రొడ్యూసర్ : రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 14  జనవరి 2011

ఓ గ్రౌండ్ దక్కించుకోవాలని ఓ స్కూల్ విద్యార్థులు చేసే ప్రయత్నం ఆధారంగా క్రికెట్ ఆట తో ఆటలు మా హక్కు అనే నినాదం తో  రూపొందిన సినిమా ‘గోల్కొండ హై స్కూల్’. సుమంత్ ను డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపిస్తూ స్కూల్ పిలల్లతో  ఫుల్లెన్త్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఇంద్ర గంటి మోహన కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటూ అలరిస్తుంది. కళ్యాణ్ మాలిక్ పాటలు ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.

=============================================================================

పంచాక్షరి
నటీనటులు అనుష్క శెట్టిచంద్ర మోహన్
ఇతర నటీనటులు : నాజర్ప్రదీప్ రావత్రవి ప్రకాష్బ్రహ్మానందందివ్యవాణితెలంగాణ శకుంతల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ చిన్నా
డైరెక్టర్ : V. సముద్ర
ప్రొడ్యూసర్ : బొమ్మదేవర రామ చంద్రరావు
రిలీజ్ డేట్ : 11 జూన్ 2010
హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ పంచాక్షరి. దుర్గామాత గుడిలో పుట్టిన పంచాక్షరిని ఊళ్లూ వాళ్ళు దుర్గాదేవిలా ట్రీట్ చేస్తుంటారు. కానీ ఒక మహా పర్వదినాన పంచాక్షరి గుడిలో నిప్పుకు ఆహుతై పోతుంది. దాంతో దుర్గమ్మ వారే పంచాక్షరి ప్రాణాలు ఆహుతి చేశారు అనే భ్రమలో ఉంటారు ఊరి జనం. కానీ నిజం తరవాత బయటికి వస్తుందినిజానికి పంచాక్షరిని చంపింది ఎవరు..ఆ తరవాత ఏం జరిగింది అనేదే ప్రధాన కథాంశం.

============================================================================

నన్ను దోచుకుందువటే
నటీనటులు : సుధీర్ బాబునభా నతేష్
ఇతర నటీనటులు : నాజర్రాజశేఖర్వైవా హర్షచలపతి రావుజీవబాబ్లో పృథ్విరాజ్వర్షిణి సుందరాజన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : B. అజనీష్ లోక్ నాథ్
డైరెక్టర్ : R.S. నాయుడు
ప్రొడ్యూసర్ : సుధీర్ బాబు
రిలీజ్ డేట్ : 20 సెప్టెంబర్ 2018
కార్తీక్ (సుధీర్ బాబు) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పెద్ద పొజిషన్ లో ఉంటాడు. ఉద్యోగులందరికీ అతడంటే హడల్. టార్గెట్లు పెట్టి హింసిస్తుంటాడు. అతడికి పనే ప్రపంచం. ఫ్యామిలీని కూడా పట్టించుకోని పనిరాక్షసుడు. ఎలాగైనా అమెరికా వెళ్లి డబ్బు సంపాదించిఆస్తులు పోగొట్టుకున్న తండ్రిని సుఖపెట్టాలనేది కార్తీక్ టార్గెట్.
ఇలాంటి వ్యక్తిని తన అల్లుడ్ని చేసుకోవాలని చూస్తాడు అతడి మేనమామ (రవివర్మ). కానీ తను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని కార్తీక్ తో చెబుతుంది అతడి మరదలు. మరదల్ని సేవ్ చేయడం కోసం తను సిరి అనే వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని తండ్రిమేనమామ దగ్గర అబద్ధం చెబుతాడు కార్తీక్.
ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం చదువుకుంటూషార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తున్న మేఘన (నబా నటేష్) హెల్ప్ తీసుకుంటాడు. సిరి పేరుతో కార్తీక్ తండ్రికి (నాజర్) దగ్గరైన అల్లరి పిల్ల మేఘన నిజంగానే వాళ్లతో కలిసిపోతుంది. ఒక దశలో కార్తీక్ ను కూడా ప్రేమిస్తుంది. కానీ కార్తీక్ మాత్రం ఆమె ప్రేమను అర్థం చేసుకోడు. చివరికి మేఘన ప్రేమను కార్తీక్ ఎలా గుర్తిస్తాడుతండ్రిని ఎలా మెప్పించాడుతను కోరుకున్న అమెరికా కలను నెరవేర్చుకున్నాడా లేదా అనేది క్లుప్తంగా ఈ సినిమా స్టోరీ.

==============================================================================

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
నటీనటులు వెంకటేష్త్రిష
ఇతర నటీనటులు : శ్రీరామ్, K. విశ్వనాథ్కోట శ్రీనివాస రావుస్వాతి రెడ్డిసునీల్ప్రసాద్ బాబుసుమన్ శెట్టి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : శ్రీ రాఘవ
ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్, S. నాగ అశోక్ కుమార్
రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2007
వెంకటేష్త్రిష నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా ఒక సరికొత్త లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇప్పటికే హై ఎండ్ ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ ని ఫ్యాన్స్ కి మరింత దగ్గర చేసిందీ సినిమా.  యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఈ సినిమాకే హైలెట్.

==============================================================================

యోగి
నటీనటులు : ప్రభాస్నయన తార
ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావుప్రదీప్ రావత్సుబ్బరాజుఆలీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల
డైరెక్టర్ : V.V. వినాయక్
ప్రొడ్యూసర్ రవీంద్ర నాథ్ రెడ్డి
రిలీజ్ డేట్ : 12 జనవరి 2017

ప్రభాస్ హీరోగా V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ ఇద్దరి మధ్యన నడిచే ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

ఇద్దరమ్మాయిలతో

నటీనటులు అల్లు అర్జున్అమలా పాల్కేథరిన్
ఇతర నటీనటులుబ్రహ్మానందంతనికెళ్ళ భరణితులసినాజర్ప్రగతిఆలీషవార్ ఆలీతదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : పూరి జగన్నాథ్
ప్రొడ్యూసర్ : బండ్ల గణేష్
రిలీజ్ డేట్ : 31 మే, 2013
అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ హీరోగా తెరకెక్కిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ఇద్దరమ్మాయిలతో. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా బన్ని కరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిర్మించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎసెట్.