జీ సినిమాలు ( 6th నవంబర్ )

Monday,November 05,2018 - 10:03 by Z_CLU

అభినేత్రి

నటీనటులు : ప్రభు దేవాతమన్నాసోను సూద్అమీ జాక్సన్

ఇతర నటీనటులు : సప్తగిరిమురళి శర్మపృథ్వి

మ్యూజిక్ డైరెక్టర్ : సాజిద్ వాజిద్

డైరెక్టర్ :  ఎ.ఎల్.విజయ్

ప్రొడ్యూసర్ :  గణేష్ప్రభుదేవా

రిలీజ్ డేట్ : అక్టోబర్ 7, 2016 

A.L. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన  సినిమాని మరికొందరు నిర్మాతలతో కలిసి ప్రభుదేవా స్వయంగా నిర్మించాడుకథలో కాస్తయినా ఎక్సయింట్ మెంట్ లేకపోతే.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు తమన్న. హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ… ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా ఇది. మిల్కీ బ్యూటీని డ్యూయల్ రోల్ లో విభిన్నంగా ప్రెజెంట్ చేసిన  సినిమా ‘అభినేత్రి’.

==============================================================================

గోదావరి

నటీనటులు : సుమంత్కమలినీ ముఖర్జీ

ఇతర నటీనటులు : నీతూ చంద్ర, C.V.L. నరసింహా రావుకమల్ కామరాజుతనికెళ్ళ భరణిశివగంగాధర్ పాండే తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K. M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : శేఖర్ కమ్ముల

ప్రొడ్యూసర్ : G.V.G. రాజు

రిలీజ్ డేట్ : 19 మే 2006

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సుమంత్కమలినీ ముఖర్జీ జంటగా నటించారు. న్యాచురల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రిలీజైన ప్రతి సెంటర్ లోను సూపర్ హిట్ అయింది.

==============================================================================

గీతాంజలి

నటీనటులు : అంజలి, శ్రీనివాస్ రెడ్డి

ఇతర నటీనటులు : మధునందన్, హర్షవర్ధన్ రాణే, బ్రహ్మానందం, ఆలీ, రావు రమేష్, సత్యం రాజేష్, శంకర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ లక్కరాజు

డైరెక్టర్ : రాజ్ కిరణ్

ప్రొడ్యూసర్ : కోన వెంకట్

రిలీజ్ డేట్ : 8 ఆగష్టు 2014

అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గీతాంజలి. ఈ సినిమాలో అంజలి డ్యూయల్ రోల్ లో ఎంటర్ టైనర్ చేసింది. ఫ్లాష్ బ్యాక్ లో ఇన్నోసెంట్ అమ్మాయిగా అంజలి నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

=============================================================================

క్షేత్రం

నటీనటులు : జగపతి బాబుప్రియమణి

ఇతర నటీనటులు : శ్యామ్కోట శ్రీనివాస రావుఆదిత్య మీనన్తనికెళ్ళ భరణిబ్రహ్మానందంచలపతి రావుబ్రహ్మాజీ తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : T. వేణు గోపాల్

ప్రొడ్యూసర్ : G. గోవింద రాజు

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2011

జగపతి బాబుప్రియమణి నటించిన ఫాంటసీ సినిమా క్షేత్రం. లక్ష్మీ నరసింహ స్వామీ విగ్రహాన్ని తన ఊరి గుడిలో ప్రతిష్టింపజేయాలన్న కల కూడా తీరకుండానేతన కుటుంబ సభ్యుల చేతిలోనే హత్యకు గురవుతాడు. వీర నరసింహ రాయలు. ఆ విషయం తెలియని అతని భార్య లక్ష్మి తన భర్త ఆఖరి కోరికను తాను నెరవేర్చడానికి సిద్ధ పడుతుంది. అప్పుడు తన అసలు తత్వాన్ని బయటపెట్టే రాయలు కుటుంబ సభ్యులు తన భర్తను కూడా చంపింది తామేనని చెప్పి మరీ లక్ష్మిని చంపేస్తారు. ఆ మోసాని తట్టుకోలేని లక్ష్మిఇంకో జన్మెత్తైనా సరేతన భర్త కోరికను తీరుస్తానని శపథం చేసి మరీ ప్రాణాలు విడుస్తుంది. ఆ తరవాత ఏం జరుగుతుంది అనేదే తరువాతి కథాంశం. వీర నరసింహ రాయలు గా జగపతి బాబు నటన ఈ సినిమాకి హైలెట్.

=============================================================================

రామయ్యా వస్తావయ్యా

నటీనటులు : NTR, శృతి హాసన్సమంత రుత్ ప్రభు

ఇతర నటీనటులు : విద్యుల్లేఖ రమణ్, P.రవి శంకర్ముకేష్ రిషికోట శ్రీనివాస్ రావురావు రమేష్తనికెళ్ళ భరణి

సంగీతం : S.S. తమన్

డైరెక్టర్ హరీష్ శంకర్

నిర్మాత దిల్ రాజు

జూనియర్ ఎన్టీఆర్ కరియర్ లోనే కలర్ ఫుల్ గా ఎంటర్ టైనర్ గా నిలిచింది రామయ్యా వస్తావయ్య. శృతి హాసన్సమంతా లు హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ లో లవర్ బాయ్ లాజాలీగా ఉండే కుర్రాడిలా ఉండే NTR, ఇంటర్వెల్ బ్యాంగ్ తరవాత తన విశ్వరూపం చూపిస్తాడు. ఎక్స్ పెక్ట్ చేయని ట్విస్టు లతో సినిమాని చాలా ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించాడు హరీష్ శంకర్. S.S. తమన్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

==============================================================================

కథకళి

నటీనటులు విశాల్కేథరిన్ థెరిసా

ఇతర నటీనటులు : కరుణాస్ఇమ్మన్ అన్నాచిగ్రేస్ కరుణాస్గోపీపవన్మధుసూదన్ రావు మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిళ

డైరెక్టర్ : పాండిరాజ్

ప్రొడ్యూసర్ : పాండిరాజ్

రిలీజ్ డేట్ : 18 మార్చి 2016 

విశాల్కేథరిన్ థెరిసా జంటగా నటించిన లవ్ & యాక్షన్ ఎంటర్ టైనర్ కథకళి. U.S. లో స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి వచ్చిన కమల్ ( విశాల్ ) అనుకోకుండాసాంబ అనే వ్యక్తి మర్డర్ కేస్ లో ఇరుక్కుంటాడు. కమల కుటుంబానికిసాంబ కుటుంబానికి చాలా కాలం నుండి వ్యక్తిగత కక్షలుండటంతో పోలీసులు కమల్ ని అనుమానిస్తుంటారు. అయితే నిజానికి ఆ హత్య చేసింది ఎవరు…? అసలు హీరో ఫ్యామిలీకిసాంబ ఫ్యామిలీకి మధ్య ఎందుకు చెడింది..అనేది ఈ సినిమాలో ప్రధాన కథాంశం. హీరో విశాల్కేథరిన్ థెరిసా కి మధ్య ఉండే రొమాంటిక్ ట్రాక్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.