జీ సినిమాలు ( 6th ఫిబ్రవరి )

Wednesday,February 05,2020 - 10:00 by Z_CLU

కణం

నటీనటులు : నాగశౌర్యసాయి పల్లవి
ఇతర నటీనటులు బేబీ వెరోనికాప్రియదర్శి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : C. స్యామ్
డైరెక్టర్ : A.L. విజయ్
ప్రొడ్యూసర్స్ లైకా ప్రొడక్షన్స్


కృష్ణ (నాగ శౌర్య)తులసి (సాయి పల్లవి) టీనేజ్ లో ప్రేమించుకొని పెద్దలు ఐదేళ్ళు గడిచాక పెళ్లి చేస్తాం అని చెప్పడంతో విడిపోయి సెటిల్ అయ్యాక పెళ్ళిచేసుకొని దంపతులుగా మారతారు. అయితే టీనేజ్ లో ఇద్దరూ కలిసి చేసిన ఓ తప్పు ను కప్పిపుచ్చడానికి వీరి కుటుంబాలు తీసుకున్న ఓ నిర్ణయం వల్ల అందరూ వరుసగా మృత్యువాత పడతారు. ఇంతకీ కృష్ణ – తులసి చేసిన తప్పేంటి… ఆ ఐదేళ్ళ తర్వాత వీరి జీవితం ఎలా సాగింది. పెళ్లి తర్వాత వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి.. అనేది మిగతా కథ.

________________________________________

చింతకాయల రవి

నటీనటులు : వెంకటేష్, అనుష్క శెట్టి
ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, వేణు తొట్టెంపూడి, శయాజీ షిండే, చంద్ర మోహన్, బ్రహ్మానందం, సునీల్, ఆలీ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : విశాల్ – శేఖర్
డైరెక్టర్ : యోగి
ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి
రిలీజ్ డేట్ : 2 అక్టోబర్ 2008

చింతకాయల రవి USA లో ఒక బార్ లో పని చేస్తుంటాడు. ఇండియాలో ఉండే తన తల్లికి మాత్రం అమెరికాలో పెద్ద సాఫ్ట్ ఇంజినీర్ అని చెప్పుకుంటాడు. ఈ లోపు రవి మదర్, రవికి పెళ్ళి చేద్దామనుకునే ప్రాసెస్ లో సంబంధం చూసి ఫిక్స్ చేస్తుంది. అటు వైపు పెళ్ళి కూతురు ఫ్యామిలీ రవి ఎలాంటి వాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో సునీతను ఎంక్వైరీ చేయమని చెప్తారు. ఆ తరవాత ఏం జరుగుతుంది…? రవి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాదని తెలుసుకున్న సునీత ఏం చేస్తుంది..? ఆ తరవాత కథ ఏ మలుపు తిరుగుతుంది అనేది జీ సినిమాలు లో చూడాల్సిందే.

___________________________________________________

 

సైనికుడు

నటీనటులు : మహేష్ బాబు, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఇర్ఫాన్ ఖాన్, కామ్న జెఠ్మలాని, కోట శ్రీనివాస రావు, రవి వర్మ అజయ్

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : గుణశేఖర్

ప్రొడ్యూసర్ :  అశ్విని దత్

రిలీజ్ డేట్ :  1 డిసెంబర్ 2006


మహేష్ బాబు కరియర్ లో సైనికుడు సినిమా ప్రత్యేకమైనది. రాజకీయ అవినీతి పరులపై ఒక యువకుడు చేసిన పోరాటమే సైనికుడు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు. త్రిష అమాయకత్వపు నటన సినిమాకే హైలెట్. హారిస్ జయరాజ్ ప్రతి పాట బావుంటుంది.

_______________________________________________________

గోరింటాకు

నటీనటులు రాజ శేఖర్ఆర్తి అగర్వాల్ , మీరా జాస్మీన్

ఇతర నటీనటులు : ఆకాష్హేమ చౌదరి,సుజితశివ రాజామాస్టర్ నిధీశ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఎ.రాజ్ కుమార్

డైరెక్టర్ : వి.ఆర్.ప్రతాప్

ప్రొడ్యూసర్ : ఎం.వి.ప్రసాద్పారస్ జైన్

రిలీజ్ డేట్ : జులై 4 , 2008

అన్న-చెల్లెళ్ళ బంధం కధాంశం తో రాజ శేఖర్ఆర్తి అగర్వాల్మీరా జాస్మీన్ నటించిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎవర్ గ్రీన్ ఫామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాజ శేఖర్-మీరా జాస్మీన్ ల మధ్య వచ్చే సన్నివేశాలుఅన్న-చెల్లెళ్ళ బంధం గురించి తెలియజేసే సీన్స్ సినిమాకు హైలైట్స్. ఎస్.ఎ.రాజ్ కుమార్ అందించిన పాటలుఆర్.ఆర్. సినిమాకు ప్లస్.

__________________________________________________

సుప్రీమ్

నటీనటులు : సాయి ధరమ్ తేజ్రాశిఖన్నా

ఇతర నటీనటులు : మాస్టర్ మైఖేల్ గాంధీరాజేంద్ర ప్రసాద్కబెర్ దుహాన్ సింగ్రవి కిషన్సాయి కుమార్మురళీ మోహన్తనికెళ్ళ భరణి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్

డైరెక్టర్ : అనిల్ రావిపూడి

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : మే 5, 2016

సాయిధరమ్ తేజ్రాశిఖన్నా జంటగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సుప్రీమ్. తేజ్ కరియర్ లోనే బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచిన  సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తేజ్మాస్టర్ మైఖేల్ గాంధీ కాంబినేషన్ లో ఉండే ట్రాక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.

______________________________________________

ఛల్ మోహన్ రంగ

నటీనటులు : నితిన్మేఘా ఆకాష్

ఇతర నటీనటులు మధునందన్రావు రమేష్నరేష్లిస్సిసంజయ్ స్వరూప్ప్రగతి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ కృష్ణ చైతన్య

ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి

రిలీజ్ డేట్ : 5 ఏప్రిల్ 2018

చిన్నతనం నుండి పెద్దగా చదువు అబ్బకపోవడంతో ఎప్పటి కైనా అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవ్వలనుకుంటాడు మోహన్ రంగ(నితిన్). ఎన్నిసార్లు ట్రై చేసినా వీసా రాకపోవడంతో ఓ ప్లాన్ వేసి యు.ఎస్ వెళ్తాడు. అలా వెళ్ళిన మోహన్ రంగ విలాస్(మధు నందన్) సహయంతో అక్కడ ఓ ఉద్యోగం సంపాదిస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా పరిచయమైన మేఘా సుబ్రహ్మణ్యం(మేఘ ఆకాశ్) తో ప్రేమలో పడతాడు. మోహన్ రంగ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వడంతో మేఘ కూడా ప్రేమలో పడిపోతుంది. ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమించుకుంటారు. అలా ఒకరినొకరు ఇష్టపడుతూ చెప్పుకునేలోపే ఎలాంటి కారణం లేకుండా దూరమవుతారు. అలా అనుకోకుండా దూరమయిన వీళ్ళిద్దరూ ఏడాది తర్వాత మళ్ళీ ఊటీలో కలుసుకుంటారు. ఇంతకీ మోహన్ రంగ-మేఘ వీరి మధ్య జరిగిన సంఘటనలు ఏమిటి ..చివరికి వీరిద్దరూ ఎలా ఒకటయ్యారు… అనేది మిగతా కథ.