జీ సినిమాలు (5th జూన్)

Sunday,June 04,2017 - 10:02 by Z_CLU

వెంగమాంబ

నటీ నటులు : మీనా, శరత్ బాబు, సాయి కిరణ్

ఇతర నటీ నటులు : సాయి కిరణ్, సన, సుబ్బరాయ శర్మ, అశోక్ రావు, అనంత, సుధా, శివ పార్వతి, శ్రీరామ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఎం.ఎం.కీరవాణి

డైరెక్టర్ : ఉదయ్ భాస్కర్

ప్రొడ్యూసర్ : దొరై స్వామి రాజు

రిలీజ్ డేట్ : జులై 17, 2009

మీనా, శరత్ బాబు , సాయికిరణ్ వంటి మొదలగు వారితో దర్శకుడు ఉదయ్ భాస్కర్ తెరకెక్కించిన వెంగమాంబ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భక్తి రస చిత్రం ‘వెంగమాంబ’. ఈ చిత్రం లో కథానాయకుడు సాయి కిరణ్ వెంకటేశ్వర స్వామిగా నటించారు. కొన్ని భక్తి రస సన్నివేశాలు, నటీ నటుల గెటప్స్ ఈ సినిమాకు హైలైట్స్.

==============================================================================

జై చిరంజీవ

నటీనటులు : చిరంజీవి, భూమిక చావ్లా, సమీరా రెడ్డి

ఇతర నటీనటులు : అర్బాజ్ ఖాన్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, సునీల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : K. విజయ భాస్కర్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2005

మెగాస్టార్ కరియర్ లో బెస్ట్ గా నిలిచిన సినిమా జై చిరంజీవ. తన మేనకోడలిని చంపిన క్రిమినల్స్ ని రీచ్ అవ్వడానికి హీరో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన ‘జై చిరంజీవ’ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనిపించుకుంది.

==============================================================================

విలేజ్ లో వినాయకుడు

నటీ నటులు : కృష్ణుడు, శరణ్య మోహన్, వీరేంద్ర నాథ్ యండమూరి, రావు రమేష్

మ్యూజిక్ డైరెక్టర్ : మణికాంత్ కద్రి

డైరెక్టర్ : సాయి కిరణ్ అడివి

ప్రొడ్యూసర్ : మహి V రాఘవ్

రిలీజ్ డేట్ : 5 నవంబర్ 2009

కృష్ణుడు హీరోగా నటించిన హిల్లేరియస్ ఎంటర్ టైనర్ ‘విలేజ్ లో వినాయకుడు’. శరణ్య మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అటు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం లో కూడా సక్సెస్ అయింది. ఈ సినిమాకి సాయి కిరణ్ అడివి దర్శకుడు.

==============================================================================

 

తులసి

నటీనటులు : వెంకటేష్, నయనతార

ఇతర నటీనటులు : రమ్యకృష్ణ,  శ్రియ, మాస్టర్ అతులిత్, ఆశిష్ విద్యార్థి, రాహుల్ దేవ్, శివాజీ, జయ ప్రకాష్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : బోయపాటి శ్రీను

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2007

వెంకటేష్, నయనతార జంటగా నటించిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ తులసి. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లోను సూపర్ హిట్టయింది. సెంటిమెంట్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. రమ్యకృష్ణ క్యారెక్టర్ సినిమాకి ప్లస్.

==============================================================================

అనగనగ ఒక ధీరుడు

హీరోహీరోయిన్లు – సిద్దార్థ్, శృతిహాసన్

ఇతర నటీనటులు – లక్ష్మీ మంచు, హర్షిత, సుబ్బరాయశర్మ, రవిబాబు, బ్రహ్మానందం

సంగీతం – సలీమ్ సులేమాన్, ఎం.ఎం.కీరవాణి, కోటి, మిక్కీ జే మేయర్, అనంత్

దర్శకత్వం – ప్రకాష్ కోవెలమూడి

విడుదల తేదీ – 2011, జనవరి 14

తెలుగులో ఫాంటసీ-ఎడ్వెంచరస్ మూవీస్ కాస్త తక్కువే. బడ్జెట్ ఎక్కువ, రిస్క్ కూడా ఎక్కువే అనే ఉద్దేశంతో ఎక్కువమంది ఈ జానర్ ను టచ్ చేయరు. కానీ తొలి సినిమాతోనే అలాంటి రిస్క్ తీసుకున్నాడు దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి. అప్పట్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అనగనగా ఒక ధీరుడు మూవీని డిస్నీ వరల్డ్ సినిమా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సంయుక్తంగా సమర్పించారు. మంచు లక్ష్మి తొలిసారిగా లేడీ విలన్ గా నటించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ మూవీకి ఏకంగా ఐదుగురు సంగీత దర్శకులు పనిచేశారు. యోధ అనే మలయాళ సినిమా ఆధారంగా తెరకెక్కిన అనగనగా ఒక ధీరుడు సినిమాలో భారీ సెట్స్, గ్రాఫిక్స్ కనువిందు చేస్తాయి. 2011 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంది. సిద్దార్థ్ నటన, శృతిహాసన్ అందాలు కూడా తోడయ్యాయి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిపోతున్న శృతిహాసన్ కు తొలి తెలుగు చిత్రం ఇదే.