జీ సినిమాలు (4th సెప్టెంబర్)

Sunday,September 03,2017 - 11:16 by Z_CLU

గోదావరి

నటీనటులు : సుమంత్, కమలినీ ముఖర్జీ

ఇతర నటీనటులు : నీతూ చంద్ర, C.V.L. నరసింహా రావు, కమల్ కామరాజు, తనికెళ్ళ భరణి, శివ, గంగాధర్ పాండే తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K. M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : శేఖర్ కమ్ముల

ప్రొడ్యూసర్ : G.V.G. రాజు

రిలీజ్ డేట్ : 19 మే 2006

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్  టైనర్. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సుమంత్, కమలినీ ముఖర్జీ జంటగా నటించారు. న్యాచురల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రిలీజైన ప్రతి సెంటర్ లోను సూపర్ హిట్ అయింది.

==============================================================================

బావ

నటీనటులు : సిద్ధార్థ, ప్రణీత

ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నాజర్, సింధు తులాని

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రామ్ బాబు

ప్రొడ్యూసర్ : పద్మ కుమార్ చౌదరి

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2010

అందమైన పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిందే బావ. ఈ సినిమాలో సిద్ధార్థ, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ సిద్ధార్థ తండ్రి సీతారామ్ గా నటించాడు. నిజానికి అసలు కథ సీతారామ్ దగ్గరి నుండే మొదలవుతుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న తను తన భార్య కుటుంబం నుండి తనను దూరం చేశాననే గిల్ట్ ఫీలిగ్ తో తను చేసిన తప్పు తన కొడుకు చేయకూడదు అనుకుంటూ ఉంటాడు. అంతలో వీరబాబు(సిద్ధార్థ) ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి తన భార్య అన్న అకూతురు అని తెలుసుకున్న సీతారామ్, వీరబాబుతో తన ప్రేమను మర్చిపొమ్మంటాడు. అప్పుడు వీరబాబు ఏం చేస్తాడు..? కథ ఏ మలుపు తిరుగుతుందన్న అంశాలు ZEE Cinemalu లో చూడాల్సిందే.

=============================================================================

ఒంగోలు గిత్త

నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

=============================================================================

బ్రదర్ అఫ్ బొమ్మాళి

నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : చిన్ని కృష్ణ

ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి

రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.  కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ  పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

==============================================================================

జై చిరంజీవ

నటీనటులు : చిరంజీవి, భూమిక చావ్లా, సమీరా రెడ్డి

ఇతర నటీనటులు : అర్బాజ్ ఖాన్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, సునీల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : K. విజయ భాస్కర్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2005

మెగాస్టార్ కరియర్ లో బెస్ట్ గా నిలిచిన సినిమా జై చిరంజీవ. తన మేనకోడలిని చంపిన క్రిమినల్స్ ని రీచ్ అవ్వడానికి హీరో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన ‘జై చిరంజీవ’ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనిపించుకుంది.

==============================================================================

లక్కున్నోడు

నటీనటులు : మంచు విష్ణు, హన్సిక మోత్వాని

ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, ప్రభాస్ శ్రీను, సత్య రాజేష్

మ్యూజిక్ డైరెక్టర్ : అచ్చు, ప్రవీణ్ లక్కరాజు

డైరెక్టర్ : రాజ కిరణ్

ప్రొడ్యూసర్ : M.V.V. సత్య నారాయణ

చిన్నతనం నుంచి లక్ వెంట తెచ్చి అంతలోనే అన్ లక్ ను దూరం చేసే లక్కీ(విష్ణు) ని అన్ లక్కీ గా భావించి దూరం పెడతాడు లక్కీ తండ్రి భక్త వత్సల. ఇక ఉద్యోగ అవకాశం కోసం హైదరాబాద్ వచ్చిన లక్కీ కి పాజిటీవ్ గా ఆలోచించే పద్మ(హన్సిక ) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే పద్మ ను చూసి ప్రేమలో పడిన లక్కీ పద్మ ను ఎలా దక్కించుకున్నాడు? క్రమంలో తన అన్ లక్ కి కారణమైన జె.కె(ఎం.వి.వి.సత్యనారాయణ)ను ఎలా ఎదుర్కున్నాడు? చివరిగా 25 ఏళ్ళు దూరమైన తన తండ్రికి  మళ్ళీ ఎలా దగ్గరయ్యాడు? అనేది సినిమా కథాంశం.