జీ సినిమాలు (4th మార్చ్)

Tuesday,March 03,2020 - 10:00 by Z_CLU

గీతాంజలి

నటీనటులు : అంజలి, శ్రీనివాస్ రెడ్డి
ఇతర నటీనటులు : మధునందన్, హర్షవర్ధన్ రాణే, బ్రహ్మానందం, ఆలీ, రావు రమేష్, సత్యం రాజేష్, శంకర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు
డైరెక్టర్ రాజ్ కిరణ్
ప్రొడ్యూసర్ కోన వెంకట్
రిలీజ్ డేట్ : 8 ఆగష్టు 2014

అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గీతాంజలి. ఈ సినిమాలో అంజలి డ్యూయల్ రోల్ లో ఎంటర్ టైనర్ చేసింది. ఫ్లాష్ బ్యాక్ లో ఇన్నోసెంట్ అమ్మాయిగా అంజలి నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

________________________________________

కళ్యాణ వైభోగమే

నటీనటులు : నాగశౌర్యమాళవిక నాయర్
ఇతర నటీనటులు : రాశిఆనంద్ప్రగతినవీన్ నేనిఐశ్వర్యతాగుబోతు రమేష్ మరియుతదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణ్ కోడూరి
డైరెక్టర్ : B.V. నందిని రెడ్డి
ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్
రిలీజ్ డేట్ : 4 మార్చి 2016


నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కళ్యాణ వైభోగమే. కేవలం పెద్దల బలవంతం పై పెళ్లి చేసుకున్న ఒక యువజంట పెళ్లి తరవాత ఏం చేశారు..అనేదే ఈ సినిమా ప్రధానాంశం. యూత్ ఫుల్ కామెడీ ఈ సినిమాలో పెద్ద హైలెట్.

_______________________________________

శైలజా రెడ్డి అల్లుడు

నటీనటులు : నాగ చైతన్యఅనూ ఇమ్మాన్యువెల్
ఇతర నటీనటులు : రమ్య కృష్ణన్నరేష్మురళీ శర్మకళ్యాణి నటరాజన్వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : గోపీ సుందర్
డైరెక్టర్ మారుతి దాసరి
ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ
రిలీజ్ డేట్ : 13 సెప్టెంబర్ 2018


ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ అయిన పెద్ద వ్యాపారవేత్త (మురళి శర్మ) ఏకైక కొడుకు చైతు(నాగచైతన్య). తన తండ్రిలా కాకుండా కాస్త సహనంఓపికతో జీవితాన్ని కూల్ గా గడుపుతుంటాడు. ఓ సందర్భంలో చైతూకి ఈగో కు మారుపేరైన అను(అను ఇమ్మానియేల్) పరిచయమవుతుంది. ఆ పరిచయం వారిద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అలా తండ్రి , ప్రియురాలి ఈగోల మధ్య నలిగిపోయే చైతూ జీవితంలోకి అనుకోకుండా పౌరుషంతో గల ఈగో ఉన్న మరో వ్యక్తి వస్తుంది.. ఆవిడే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ).

తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడం కోసం స్నేహితుడు చారి(వెన్నెల కిషోర్)తో కలిసి అత్తయ్య శైలజారెడ్డి ఇంట్లో అడుగుపెడతాడు చైతూ. మామయ్య సహకారంతో తల్లికూతురుని చైతూ ఎలా కలిపాడువాళ్ల ఇగోల్ని ఎలా జయించాడు అనేది బ్యాలెన్స్ కథ.

____________________________________________

ఒంగోలు గిత్త

నటీనటులు రామ్ పోతినేనికృతి కర్బందా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్కిషోర్ దాస్ప్రభుఅజయ్అభిమన్యు సింగ్ఆహుతి ప్రసాద్రమాప్రభరఘుబాబుసంజయ్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

________________________________________________

ఒక్కడొచ్చాడు

నటీనటులు : విశాల్, తమన్నా

ఇతర నటీనటులు : వడివేలు, జగపతి బాబు, సూరి, తరుణ్ అరోరా, జయప్రకాష్, నిరోషా మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా

డైరెక్టర్ : సూరజ్

ప్రొడ్యూసర్ : S. నంద గోపాల్

రిలీజ్ డేట్ : 23 డిసెంబర్ 2016

డీజీపీ చంద్రబోస్ (జగపతిబాబు) ఒక ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. అతను దేవా (సంపత్) నుండి 50 కోట్ల డబ్బు రికవర్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే సిటీకి వచ్చిన అర్జున్ (విశాల్) దివ్య (తమన్నా) ని ప్రేమిస్తాడు. డీజీపీ చంద్రబోస్ చెల్లి అయిన దివ్య కూడా అతని బ్యాక్ గ్రౌండ్ ఏం తెలుసుకోకుండానే అతనితో లవ్ లో పడిపోతుంది. దివ్య ప్రేమని అంగీకరించిన చంద్రబోస్ పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసే సమయంలో అర్జున్ తాను ఒక సిబిఐ ఆఫీసర్ అని చెప్తాడు. అంతేకాదు డీజీపీ దగ్గరనుండి 250 కోట్లు స్వాధీనం చేసుకుంటాడు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటి…? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

__________________________________________________

అహ నా పెళ్ళంట

నటీనటులు అల్లరి నరేష్శ్రీహరిరీతు బర్మేచ
ఇతర నటీనటులు : అనిత హాసనందినిబ్రహ్మానందంఆహుతి ప్రసాద్సుబ్బరాజువిజయ్ సామ్రాట్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె
డైరెక్టర్ : వీరభద్రం
ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 2 మార్చి 2011

రియల్ స్టార్ శ్రీహరినరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.