జీ సినిమాలు ( 4th జూలై )

Tuesday,July 03,2018 - 11:42 by Z_CLU

సూరిగాడు

నటీనటులు : సురేష్, యమున

ఇతర నటీనటులు : దాసరి నారాయణ రావు, సుజాత, సురేష్, గొల్లపూడి, వేలు, రాళ్ళపల్లి, కాంతారావు, బ్రహ్మానందం, బాబూ మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : వాసూ రావు

డైరెక్టర్ : దాసరి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : డి. రామా నాయుడు

రిలీజ్ డేట్:  1992

కష్టపడి పెంచిన తలిదండ్రులను కన్నా బిడ్డలే పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించారు డైరెక్టర్ దాసరి నారాయణరావు. సినిమాలో తండ్రి పాత్ర కూడా స్వయంగా ఆయనే పోషించారు. సినిమాలోఒకే ఒక ఆశ’ అంటూ సాగే పాట సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది.

============================================================================

చందమామ

నటీనటులు : నవదీప్, కాజల్ అగర్వాల్, శివ బాలాజీ, సింధు మీనన్

ఇతర నటీనటులు : నాగబాబు, ఉత్తేజ్, ఆహుతి ప్రసాద్, జీవా, అభినయ శ్రీ

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : C. కళ్యాణ్, S. విజయానంద్

రిలీజ్ డేట్ : 6 సెప్టెంబర్ 2007

కలర్ ఫుల్ డైరెక్టర్ కృష్ణవంశీ నటించిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చందమామ. నవదీప్, శివ బాలాజీలు హీరోలుగా నటించిన సినిమాలో కాజల్, సింధు మీనన్ హీరోయిన్లుగా నటించారు. సినిమాలో భాగంగా అలరించే కామెడీ హైలెట్ గా నిలుస్తుంది.

============================================================================

కథానాయకుడు

నటీనటులు : రజినీ కాంత్, జగపతి బాబు, మీనా, నయన తార

ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, ప్రభు, విజయ్ కుమార్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, M.S.నారాయణ

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : P.వాసు

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008

ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు సినిమాలో. ఒక పెద్ద స్టార్ కి, ఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే కథా నాయకుడు. సినిమాకి P. వాసు డైరెక్టర్.

============================================================================

చంటి

హీరోహీరోయిన్లురవితేజ,  చార్మి

ఇతర నటీనటులు –  డైజీ బోపన్న, అతుల్ కులకర్ణి, రేవతి, రఘుబాబు, సుబ్బరాజు, వేణుమాధవ్

సంగీతంశ్రీ

దర్శకత్వంశోభన్

విడుదల తేదీ – 2004, నవంబర్ 12

హీరో రవితేజ అప్పటికే పూర్తిస్థాయి హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అమ్మా నాన్న తమిళ అమ్మాయి, ఇడియట్, ఖడ్గం, ఇట్లు శ్రావణి  సుబ్రమణ్యం లాంటి హిట్స్ ఉన్నాయి. మరోవైపు శోభన్ వర్షం సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ చంటి. చార్మి హీరోయిన్  గా నటించిన సినిమాకు శ్రీ సంగీతం అందించాడు. దర్శకుడు  శోభన్ కు ఇదే ఆఖరి చిత్రం. సినిమా తర్వాత కన్నడంలో మరో సినిమా ఎనౌన్స్ చేసినప్పటికీ… అది సెట్స్ పైకి వెళ్లకముందే తీవ్రమైన గుండెపోటుతో శోభన్ చనిపోయారు. అదే ఏడాది శోభన్ సోదరుడు, ప్రముఖ కమెడియన్ లక్ష్మీపతి కూడా కన్నుమూయడం బాధాకరం.

============================================================================

బుజ్జిగాడు

నటీనటులు : ప్రభాస్, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : మోహన్ బాబు, సంజనా, కోట శ్రీనివాస రావు, M.S. నారాయణ, సునీల్, బ్రహ్మాజీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సందీప్ చౌతా

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : K. S. రామారావు

రిలీజ్ డేట్ : 23 మార్చి 2008

ప్రభాస్, త్రిష జంటగా నటించిన అల్టిమేట్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ బుజ్జిగాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలో మోహన్ బాబు కీ రోల్ ప్లే చేశారు. ప్రభాస్ డిఫెరెంట్ మ్యానరిజం సినిమాకి హైలెట్ గా నిలిచింది.

============================================================================

బంపర్ ఆఫర్

నటీనటులు  : సాయి రామ్ శంకర్, బిందు మాధవి

ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, కోవై సరళ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్, అలీ, జయప్రకాశ్, వేణు మాధవ్  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె

డైరెక్టర్ : జయ రవీంద్ర

ప్రొడ్యూసర్ : పూరి జగన్నాథ్

రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 2009

సాయి రామ్ శంకర్, మిందు మాధవి జంటగా జయ రవీంద్ర దర్శకత్వం లో స్టార్ డైరెక్టర్  పూరి జగన్నాథ్ నిర్మించిన సినిమా ‘బంపర్ ఆఫర్’. లో క్లాస్ కూర్రాడికి హై క్లాస్ అమ్మాయి కి మధ్య జరిగే లవ్ స్టోరీ తో మాస్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన సినిమాలో సాయి రామ్ శంకర్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్,బిందు మాధవి గ్లామర్, కోవై సరళ, ధర్మ వరపు, బ్రహ్మానందం, ఎమ్.ఎస్ కామెడీ, రఘు కుంచె మ్యూజిక్, షాయాజీ షిండేసాయి రామ్ శంకర్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్స్. అన్ని అంశాలు కలగలిపిన మాస్ ఎంటర్టైనర్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.