జీ సినిమాలు ( 4th ఏప్రిల్)

Wednesday,April 03,2019 - 10:02 by Z_CLU

అవును 2

నటీనటులు : పూర్ణ, హర్షవర్ధన్ రాణే

ఇతర నటీనటులు : రవి బాబు, సంజన గల్రాని, నిఖిత తుక్రాల్, రవి వర్మ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 3 ఏప్రిల్ 2015

రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అవును సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది అవును 2. ఈ సినిమా కూడా రవిబాబు మార్క్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. హీరోయిన్ పూర్ణ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

_____________________________________

వసంతం 

నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి

ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్, ఆకాష్, సునీల్, చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్

డైరెక్టర్ : విక్రమన్

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్

రిలీజ్ డేట్ : 11 జూలై 2003

స్నేహానికి, ప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.

_________________________________________

కొంచెం ఇష్టం కొంచెం కష్టం

నటీనటులు : సిద్ధార్థతమన్నా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్రమ్యకృష్ణబ్రహ్మానందంనాజర్వేణు మాధవ్సుధ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శంకర్-ఎహసాన్-లాయ్

డైరెక్టర్ : కిషోర్ కుమార్ పార్ధసాని

ప్రొడ్యూసర్ : నల్లమలుపు శ్రీనివాస్

రిలీజ్ డేట్ : 5 ఫిబ్రవరి 2009

పై చదువుల కోసమని సిటీకి వచ్చిన గీతఅక్కడే ఉండే సిద్ధు ప్రేమించుకుంటారు. ఎప్పుడైతే సిద్ధూ తమ ప్రేమ గురించి గీత ఫాదర్ కి చెప్తాడోఅప్పుడు సిద్ధూ తల్లిదండ్రులు కలిసి ఉండటం లేదు అనే ఒకే కారణంతోఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేస్తాడు. అసలు సిద్ధూ తల్లిదండ్రులు విడిపోవడానికి కారణం ఏంటి..తన ప్రేమను దక్కించుకోవడానికి సిద్ధూ ఏం చేస్తాడు అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

_____________________________________

కొత్త బంగారు లోకం 

నటీనటులు : వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, ఆహుతి ప్రసాద్, రజిత, బ్రహ్మానందం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జె. మేయర్

డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 9 అక్టోబర్ 2008

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన కొత్త బంగారు లోకంలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్ గా నటించారు. రిలీజయిన ప్రతి సెంటర్ లోను అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

___________________________________________________

అన్నవరం

నటీనటులు : పవన్ కళ్యాణ్, ఆసిన్

ఇతర నటీనటులు : సంధ్య, ఆశిష్ విద్యార్థి, లాల్, నాగేంద్ర బాబు, వేణు మాధవ్, బ్రహ్మాజీ, L.B. శ్రీరామ్, హేమ

మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల

డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు

ప్రొడ్యూసర్స్ : పరాస్ జైన్, N.V. ప్రసాద్

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2006

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అసిన్ జంటగా నటించిన అన్నవరం పర్ ఫెక్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన చెల్లిని ప్రాణంగా ప్రేమించే అన్నయ్యలా నటించాడు. చెల్లెల్ని రక్షించుకోవడం కోసం ఒక అన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

_________________________________________

ఎక్కడికి పోతావు చిన్నవాడా

నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, హేబా పటేల్, అవిక గోర్

ఇతర నటీనటులు : నందితా శ్వేత, వెన్నెల కిషోర్, అన్నపూర్ణ, సత్య, సుదర్శన్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : వి. ఐ. ఆనంద్

ప్రొడ్యూసర్ : P.V. రావు

రిలీజ్ డేట్ : 18 నవంబర్ 2016

ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయిన అర్జున్(నిఖిల్) తన స్నేహితుడి అన్నయ్య కు దెయ్యం వదిలించడానికి అనుకోకుండా ఆత్మలను వదిలించే కేరళ లోని మహిశాసుర మర్దిని గుడికి వెళ్లాల్సి వస్తుంది. అలా కిషోర్(వెన్నెల కిషోర్) తో కేరళ వెళ్లిన అర్జున్ కి అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయమైన అమల తన యాటిట్యూడ్ తో అర్జున్ కు దగ్గరవుతుంది. ఇంతకీ అమల అక్కడికి ఎందుకొచ్చింది? అర్జున్ కి కావాలనే ఎందుకు దగ్గరైంది? అసలు అమల ఎవరు? కేరళ వెళ్లిన అర్జున్ హైదరాబాద్ తిరిగొచ్చాక అమల గురించి ఏం తెలుసుకున్నాడు? అనేది చిత్ర కధాంశం.