జీ సినిమాలు ( 3rd నవంబర్ )

Thursday,November 02,2017 - 10:03 by Z_CLU

 

అష్టాచెమ్మా

నటీనటులు : నాని, శ్రీనివాస్ అవసరాల, స్వాతి, భార్గవి

ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, హేమ, ఝాన్సీ, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రాగిణి

మ్యూజిక్ డైరెక్టర్ : కల్యాణి మాలిక్

డైరెక్టర్ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

ప్రొడ్యూసర్ : రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 2008

నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి, భార్గవి నలుగురికి ఒకేసారిగా ఓ రేంజ్ స్టార్ డం ని తీసుకొచ్చి పెట్టిన సినిమా ‘అష్టా చెమ్మా’. సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్ళి చేసుకోవాలనుకునే లావణ్య చివరికి మహేష్ అనే పేరున్నా చాలు అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఆ తరవాత ఏం జరిగింది అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

కూలీ నం 1

నటీనటులు : వెంకటేష్, టాబూ

ఇతర నటీనటులు : రావు గోపాల్ రావు

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. సురేష్

రిలీజ్ డేట్ : 12 జూన్ 1991

వెంకటేష్ హీరోగా K. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన కలర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ కూలీ నం 1. ఒక సాధారణ కూలీ, పొగరుబోతులైన తండ్రీ కూతుళ్ళ అహాన్ని ఎలా నేలకూల్చాడనే ప్రధానాంశంతో తెరకెక్కిందే ఈ సినిమా. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

==============================================================================

త్రిపుర

నటీనటులు : స్వాతి రెడ్డి, నవీన్ చంద్ర

ఇతర నటీనటులు : రావు రమేష్, సప్తగిరి, శివన్నారాయణ నడిపెద్ది, జయ ప్రకాష్ రెడ్డి, ప్రీతీ నిగమ్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కామ్రాన్

డైరెక్టర్ : రాజ్ కిరణ్

ప్రొడ్యూసర్స్ : A. చినబాబు & రాజశేఖర్

రిలీజ్ డేట్ : 6 నవంబర్ 2015

స్వాతి లీడ్ రోల్ ప్లే చేసిన త్రిపుర పర్ఫెక్ట్ ఇమోషనల్ హారర్ థ్రిల్లర్. పల్లెటూరిలో పెరిగిన త్రిపురకు చిన్నప్పటి నుండి తన చుట్టూ పక్కల జరగబోయే ఇన్సిడెంట్స్ గురించి కలలు వస్తుంటాయి. అవి కాస్తా నిజమవుతుంటాయి. దాంతో త్రిపురకు ట్రీట్ మెంట్ కోసమని సిటీకి తీసుకువస్తారు. అక్కడ నవీన్ చంద్ర, త్రిపురలు ప్రేమలో పడతారు, పెళ్ళి కూడా చేసేసుకుంటారు. ఆ తరవాత ఏం జరుగుతుందనేదే సినిమా ప్రధాన కథాంశం. సస్పెన్స్ ఎలిమెంట్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

గణేష్ జస్ట్ గణేష్

హీరో హీరోయిన్లు – రామ్,కాజల్

ఇతర నటీనటులు – పూనమ్ కౌర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం

సంగీతం      – మిక్కీ జె మేయర్

దర్శకత్వం  –  శరవణన్

విడుదల తేదీ – 2009

రామ్ కాజల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘గణేష్ జస్ట్ గణేష్’. 2009 లో విడుదలైన ఈ సినిమా యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్. చిన్న పిల్లలతో గణేష్ చేసే హంగామా , కాజల్-రామ్ మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగా అలరిస్తాయి. అబ్బూరి రవి అందించిన మాటలు సినిమాకు ప్లస్, ముఖ్యంగా క్లైమాక్స్ లో మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. కాజల్ కుటుంబ సభ్యుల మధ్య మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అందరినీ హత్తుకుంటాయి.

=============================================================================

ఏక్ నిరంజన్ 

నటీనటులు : ప్రభాస్, కంగనా రనౌత్

ఇతర నటీనటులు : సోను సూద్, ముకుల్ దేవ్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, వేణు మాధవ్, మర్కాండ్ దేశ్ పాండే తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : ఆదిత్య రామ్ మూవీస్

రిలీజ్ డేట్ : 30 అక్టోబర్ 2009

ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ ఎంటర్ టైనర్ ఏక్ నిరంజన్. చోటు గా ప్రభాస్ ఆక్టింగ్ సినిమాకే హైలెట్. ఓ వైపు పోలీసులకు హెల్ప్ చేస్తూ మరోవైపు తన తలిదండ్రులను వెదుక్కుంటూ ఉంటాడు. ప్రభాస్, కంగనా రనౌత్ ల మధ్య సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాడు పూరి జగన్నాథ్.

==============================================================================

ఒంగోలు గిత్త

నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.