జీ సినిమాలు ( 3rd మే )

Tuesday,May 02,2017 - 10:02 by Z_CLU

హీరోహీరోయిన్లు  – సుమన్, రచన, హీరా

నటీనటులు – ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, మల్లికార్జునరావు, కోటశ్రీనివాసరావు,  కైకాల సత్యనారాయణ

సంగీతం – ఈశ్వర్

దర్శకత్వం – బోయిన సుబ్బారావు

నిర్మాత – డి. రామానాయుడు

విడుదల – 1999, జనవరి 13

భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చాటిచెప్పడంతో పాటు… ఆలుమగల మధ్య మాట పట్టింపులు, అనుమానాలు వస్తే కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమైపోతాయో చాటిచెప్పిన చిత్రమే పెద్ద మనుషులు. సినిమా మొత్తం సుమన్ చుట్టూనే తిరిగినప్పటికీ… పెద్దమనుషులుగా కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు తన నటనతో సినిమాకు హైలెట్ గా నిలిచాడు. ఈ సినిమాతోనే ఈశ్వర్… సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

==============================================================================

హీరోహీరోయిన్లు – వినోద్ కుమార్, ప్రేమ

సంగీతం – సుధీర్

దర్శకత్వం – తమ్మారెడ్డి భరధ్వాజ

విడుదల తేదీ – 1997

సమర్పణ – రామానాయుడు

నిర్మాత – ఎ. సూర్యనారాయణ

=============================================================================

హీరోహీరోయిన్లు – శివాజీ, లయ

నటీనటులు – సంగీత, మధుశర్మ, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ఏవీఎస్

సంగీతం – ఎం.ఎం.శ్రీలేఖ

స్క్రీన్ ప్లే, దర్శకత్వం – శ్రీనివాసరెడ్డి

విడుదల తేదీ – 2005, ఆగస్ట్ 20

బ్యానర్ – ఎస్పీ క్రియేషన్స్

శివాజీ, లయ కలిసి నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అదిరిందయ్యా చంద్రం.  శివాజీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. శివాజీలో అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉందని మరోసారి నిరూపించింది ఈ సినిమా.

=============================================================================

నటీనటులు : ప్రభాస్, అసిన్, ఛార్మి కౌర్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, రాజ్యలక్ష్మి, రాధా కుమారి, నారాయణ రావు, కల్పన, పద్మనాభం తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : వెంకట రాజు, శివ రాజు

రిలీజ్ డేట్ : 25 మార్చి 2005

ప్రభాస్ హీరోగా నటించిన ‘చక్రం’ అటు ప్రభాస్ కరియర్ లోను ఇటు డైరెక్టర్ కృష్ణవంశీ కరియర్ లోను చాల స్పెషల్ మూవీస్. ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆసిన్, ఛార్మి లు హీరోయిన్ లుగా నటించారు. లైఫ్ ఉన్నంత కాలం నవ్వుతూ బ్రతకాలనే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చక్రం. చక్రి అందించిన సంగీతం సినిమాకే హైలెట్.

==============================================================================

నటీనటులు : చిరంజీవి, విజయ శాంతి, నళిని

ఇతర నటీనటులు : శివకృష్ణ, గుమ్మడి, నూతన్ ప్రసాద్, ప్రభాకర్ రెడ్డి, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, కాకరాల, రావి కొండల రావు, సరళ, సూర్యకాంతం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : K. మురళీ మోహన రావు

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : డిసెంబర్ 29, 2013

స్మగ్లింగ్ చేస్తూ పెడదారిన పట్టిన తండ్రిని సరైన దారిలో పెట్టడం కోసం ఒక కొడుకు పడ్డ ఘర్షనే ఈ సంఘర్షణ. 1983 లో రామా నాయుడు గారి పుట్టిన రోజున జూన్ 6 న సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా అదే సంవత్సరం డిసెంబర్ 29 న రిలీజైంది. ఇమోషనల్ సీక్వెన్సెస్ సినిమాకి పెద్ద ఎసెట్.

==============================================================================

నటీనటులు : కార్తీ, కాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : జయప్రకాష్, సూరి, రవి ప్రకాష్, రాజీవన్, విజయ్ సేతుపతి, లక్ష్మీ రామకృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ :  సుసీంతిరన్

ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేళ్ రాజా

రిలీజ్ డేట్ : 20ఆగష్టు 2010

సుసీంతిరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన క్రైం థ్రిల్లర్ నా పేరు శివ.  యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. థ్రిల్లింగ్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

=============================================================================

 

నటీనటులు – శ్రీదేవి, ప్రియా ఆనంద్, మెహ్దీ నెబూ, ఆదిల్ హుస్సేన్

సంగీతం – అమిత్ త్రివేది

దర్శకత్వం – గౌరీ షిండే

విడుదల తేదీ – 2012, సెప్టెంబర్ 14

అతిలోకసుందరి శ్రీదేవి  గ్రాండ్ గా  రీఎంట్రీ ఇచ్చిన మూవీ ఇంగ్లిష్ వింగ్లిష్.  అప్పట్లో శ్రీదేవికి ఎంత పేరు ఉండేదో, తిరిగి అంత క్రేజ్ ను ఓవర్ నైట్ లో ఆమెకు తీసుకొచ్చింది ఈ సినిమా. తనలో నటనా పటిమ ఏమాత్రం తగ్గలేదని శ్రీదేవి నిరూపించుకున్న సినిమా ఇది. ఒక సాధారణ గృహిణి విదేశాలకు వెళ్లినప్పుడు, ఇంగ్లిష్ తెలియక ఎలా ఇబ్బందిపడింది.. దాన్నుంచి సక్సెస్ ఫుల్ గా ఎలా బయటపడి.. ఓ స్వతంత్ర మహిళగా ఎదిగిందనేదే ఈ స్టోరీ. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో శ్రీదేవి యాక్టింగ్ టాలెంట్ మనకు కనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్, అజిత్ గెస్ట్ రోల్స్ పోషించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా హిట్ అయింది.