జీ సినిమాలు ( 3rd జూలై )

Tuesday,July 02,2019 - 10:02 by Z_CLU

కళ్యాణ వైభోగమే

నటీనటులు : నాగశౌర్య, మాళవిక నాయర్

ఇతర నటీనటులు రాశి, ఆనంద్, ప్రగతి, నవీన్ నేని, ఐశ్వర్య, తాగుబోతు రమేష్ మరియుతదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కోడూరి

డైరెక్టర్ : B.V. నందిని రెడ్డి

ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్

రిలీజ్ డేట్ : 4 మార్చి 2016

నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కళ్యాణ వైభోగమే. కేవలం పెద్దల బలవంతం పై పెళ్లి చేసుకున్న ఒక యువజంట పెళ్లి తరవాత ఏం చేశారు..? అనేదే ఈ సినిమా ప్రధానాంశం. యూత్ ఫుల్ కామెడీ ఈ సినిమాలో పెద్ద హైలెట్.

==============================================================================

బాబు బంగారం

నటీనటులు వెంకటేష్, నయనతార

ఇతర నటీనటులు : సంపత్ రాజ్, మురళీ శర్మ, జయప్రకాష్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్

డైరెక్టర్ : మారుతి

ప్రొడ్యూసర్ : S . నాగవంశీ, P . D . V .  ప్రసాద్

రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2016

తాత జాలిగుణం వారసత్వం గా అందుకున్న కృష్ణ (వెంకటేష్) అనే పోలీస్ ఆఫీసర్ ఆ జాలి గుణం తోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకానొక సందర్భం లో తన లాగే జాలి గుణం తో ఉండే శైలు (నయనతార) ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఇక తాను ప్రేమిస్తున్న శైలు కుటుంబానికి ఎం.ఎల్.ఏ పుచ్చప్ప (పోసాని),  మల్లేష్(సంపత్) లతో ఆపద ఉందని తెలుసుకున్న కృష్ణ ఆ ఫామిలీ ను అలాగే శైలు నాన్న ను ఎలా కాపాడాడు? చివరికి కృష్ణ ఆ ఇద్దరి ఆట ఎలా కట్టించాడు? అనేది చిత్ర కధాంశం.

=============================================================================

శతమానం భవతి

నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, ఇంద్రజ, రాజా రవీంద్ర, హిమజ, ప్రవీణ్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జే. మేయర్

డైరెక్టర్ సతీష్ వేగేశ్న

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 14 జనవరి 2017

ఆత్రేయ పురం అనే గ్రామంలో రాఘవ రాజు(ప్రకాష్ రాజ్) జానకమ్మ(జయసుధ) అనే దంపతులు తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడి తమను చూడడానికి రాకపోవడంతో కలత చెంది తన మనవడు రాజు (శర్వానంద్) తో కలిసి సొంత ఊరిలోనే జీవిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లల్ని ఎలాగైనా సంక్రాంతికి తమ ఊరికి రప్పించాలని రాజు గారిని కోరుతుంది జానకమ్మ. తన భార్య కోరిక మేరకూ ఎప్పుడు కబురుపెట్టినా రాని పిల్లల కోసం ఒక పథకం వేసి సంక్రాంతికి ఊరు రప్పిస్తాడు రాఘవ రాజు. ఇంతకీ రాజు గారు వేసిన ఆ పథకం ఏమిటి? రాజు గారి కబురు మేరకు స్వదేశం తిరిగొచ్చిన పిల్లలు తాము దూరంగా ఉండడం వల్ల తల్లిదండ్రుల పడుతున్న భాధ ఎలా తెలుసుకున్నారు? అనేది ఈ సినిమా కథాంశం.

==============================================================================

బంపర్ ఆఫర్

నటీనటులు : సాయి రామ్ శంకర్, బిందు మాధవి

ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, కోవై సరళ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్, అలీ, జయప్రకాశ్, వేణు మాధవ్  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె

డైరెక్టర్ : జయ రవీంద్ర

ప్రొడ్యూసర్ : పూరి జగన్నాథ్

రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 2009

సాయి రామ్ శంకర్, మిందు మాధవి జంటగా జయ రవీంద్ర దర్శకత్వం లో స్టార్ డైరెక్టర్  పూరి జగన్నాథ్ నిర్మించిన సినిమా ‘బంపర్ ఆఫర్’. ఓ లో క్లాస్ కూర్రాడికి హై క్లాస్ అమ్మాయి కి మధ్య జరిగే లవ్ స్టోరీ తో మాస్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్,బిందు మాధవి గ్లామర్, కోవై సరళ, ధర్మ వరపు, బ్రహ్మానందం, ఎమ్.ఎస్ కామెడీ, రఘు కుంచె మ్యూజిక్, షాయాజీ షిండే-సాయి రామ్ శంకర్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్స్. అన్ని అంశాలు కలగలిపిన ఈ మాస్ ఎంటర్టైనర్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.

=============================================================================

అన్నవరం

నటీనటులు పవన్ కళ్యాణ్, ఆసిన్

ఇతర నటీనటులు : సంధ్య, ఆశిష్ విద్యార్థి, లాల్, నాగేంద్ర బాబు, వేణు మాధవ్, బ్రహ్మాజీ, L.B. శ్రీరామ్, హేమ

మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల

డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు

ప్రొడ్యూసర్స్ : పరాస్ జైన్, N.V. ప్రసాద్

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2006


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అసిన్ జంటగా నటించిన అన్నవరం పర్ ఫెక్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన చెల్లిని ప్రాణంగా ప్రేమించే అన్నయ్యలా నటించాడు. చెల్లెల్ని రక్షించుకోవడం కోసం ఒక అన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

=============================================================================

రామయ్యా వస్తావయ్యా
నటీనటులు : NTR, శృతి హాసన్, సమంత రుత్ ప్రభు
ఇతర నటీనటులు : విద్యుల్లేఖ రమణ్, P.రవి శంకర్, ముకేష్ రిషి, కోట శ్రీనివాస్ రావు, రావు రమేష్, తనికెళ్ళ భరణి
సంగీతం : S.S. తమన్
డైరెక్టర్ : హరీష్ శంకర్
నిర్మాత దిల్ రాజు
జూనియర్ ఎన్టీఆర్ కరియర్ లోనే కలర్ ఫుల్ గా ఎంటర్ టైనర్ గా నిలిచింది రామయ్యా వస్తావయ్య. శృతి హాసన్, సమంతా లు హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ లో లవర్ బాయ్ లా, జాలీగా ఉండే కుర్రాడిలా ఉండే NTR, ఇంటర్వెల్ బ్యాంగ్ తరవాత తన విశ్వరూపం చూపిస్తాడు. ఎక్స్ పెక్ట్ చేయని ట్విస్టు లతో సినిమాని చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడు హరీష్ శంకర్. S.S. తమన్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.