జీ సినిమాలు ( 30th జూలై )

Sunday,July 29,2018 - 11:01 by Z_CLU

దోచెయ్

హీరో  హీరోయిన్లునాగచైతన్య, కృతి సనోన్

ఇతర నటీనటులుబ్రహ్మానందం, రవిబాబు, పోసాని, సప్తగిరి, ప్రవీణ్

సంగీతంసన్నీ

దర్శకత్వంసుధీర్ వర్మ

విడుదల తేదీ – 2015, ఏప్రిల్ 24

స్వామిరారా సినిమాతో అప్పటికే సూపర్ హిట్ అందుకున్న సుధీర్ వర్మకు పిలిచిమరీ ఛాన్స్ ఇచ్చాడు నాగచైతన్య. స్వామిరారా సినిమాతో తన మార్క్ ఏంటో చూపించిన సుధీర్ వర్మ… తన  రెండో ప్రయత్నంగా తీసిన దోచెయ్ సినిమాకు కూడా అదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. మహేష్ సరసన వన్నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి సనోన్ కు ఇది రెండో సినిమా. అలా వీళ్లందరి కాంబోలో తెరకెక్కిన దోచెయ్ సినిమా కుర్రాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేసింది. సన్నీ సంగీతం అదనపు ఆకర్షణ. క్లయిమాక్స్ కు ముందొచ్చే బ్రహ్మానందం కామెడీ టోటల్ సినిమాకే హైలెట్.

==============================================================================

 

అఖిల్

నటీనటులు : అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్

ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సప్తగిరి, హేమ, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్, S.S. తమన్

డైరెక్టర్ : V.V.వినాయక్

ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి, నితిన్

రిలీజ్ డేట్ : నవంబర్ 11, 2015

అక్కినేని అఖిల్ డెబ్యూ ఫిల్మ్ అఖిల్. సాయేషా హీరోయిన్ గా నటించింది. పక్కా రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా, రిలీజైన అన్ని థియేటర్ లలోను  సూపర్ హిట్టయింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాని వి.వి. వినాయక్ దర్శకత్వం వహించాడు. అఖిల్ ఆఫ్రికాలో జాగ్వార్ తో చేసే ఫైట్ హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

అందాల  రాముడు

నటీనటులు : సునీల్, ఆర్తి అగర్వాల్

ఇతర నటీనటులు : ఆకాశ్, వడివుక్కరసి, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ధర్మవరపు, వేణు మాధవ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్

డైరెక్టర్ : P. లక్ష్మి కుమార్

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్, పరాస్ జైన్

రిలీజ్ డేట్ : ఆగష్టు 11, 2006

సునీల్ తన కరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా నటించిన చిత్రం అందాల రాముడు. సినిమా సునీల్ కరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఆర్తి అగర్వాల్ నటన సినిమాకే హైలెట్.

=============================================================================

భగీరథ

నటీనటులు : రవి తేజ, శ్రియ

ఇతర నటీనటులు :  ప్రకాష్ రాజ్, నాజర్

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్

ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి

రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005

రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా          ‘భగీరథ’. సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా లో రవితేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

=============================================================================

బాబు బంగారం

నటీనటులు : వెంకటేష్, నయనతార

ఇతర నటీనటులు : సంపత్ రాజ్, మురళీ శర్మ, జయప్రకాష్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్

డైరెక్టర్ : మారుతి

ప్రొడ్యూసర్ : S . నాగవంశీ, P . D . V .  ప్రసాద్

రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2016

తాత జాలిగుణం వారసత్వం గా అందుకున్న కృష్ణ (వెంకటేష్) అనే పోలీస్ ఆఫీసర్ ఆ జాలి గుణం తోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకానొక సందర్భం లో తన లాగే జాలి గుణం తో ఉండే శైలు (నయనతార) ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఇక తాను ప్రేమిస్తున్న శైలు కుటుంబానికి ఎం.ఎల్.ఏ పుచ్చప్ప(పోసాని),మల్లేష్(సంపత్) లతో ఆపద ఉందని తెలుసుకున్న కృష్ణ ఆ ఫామిలీ ను అలాగే శైలు నాన్న ను ఎలా కాపాడాడు? చివరికి కృష్ణ ఆ ఇద్దరి ఆట ఎలా కట్టించాడు? అనేది చిత్ర కధాంశం.

==============================================================================

కాష్మోరా

నటీనటులు : కార్తీ, నయనతార

ఇతర నటీనటులు : సి.దివ్య, శరత్ లోహిత్ వాలా, మధుసూదన్ రావు, పట్టిమంద్రం రాజా మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సంతోష్ నారాయణన్

డైరెక్టర్ : గోకుల్

ప్రొడ్యూసర్ : S.R. ప్రకాష్ బాబు, S.R. ప్రభు

రిలీజ్ డేట్ : 28 అక్టోబర్ 2016

ప్రజల బలహీనతను వాడుకుంటూ దొంగ బాబాగా జీవితాన్ని కొనసాగించే కాష్మోరా(కార్తీ) కు అతని మంత్రశక్తులకు లోబడిన మినిస్టర్ అండదండగా నిలుస్తాడు. అలా దొంగ బాబాగా ప్రజల నుండి డబ్బు దండుకునే కాష్మోరా అనుకోకుండా రాజ్ నాయక్(కార్తీ) అనే ఓ ప్రేతాత్మ తో ఓ పాడుబడ్డ బంగ్లాలో బంధించబడతాడు. అసలింతకీ రాజ్ నాయక్ అనే ఆ ప్రేతాత్మ ఎవరు? అతను ఎందుకు ప్రేతాత్మగా మారాడు? ఆ ప్రేతాత్మకి.. ఈ కాష్మోరాకి సంబంధం ఏమిటి? చివరికి కాష్మోరా ఆ దుష్టశక్తీని ఏ శక్తితో ఎదిరించి అంతమొందించాడు? అనేది చిత్ర కథాంశం.