జీ సినిమాలు ( 30th డిసెంబర్ )

Saturday,December 29,2018 - 10:02 by Z_CLU

ఆ ఇంట్లో

నటీనటులు : చిన్నా, మయూరి

ఇతర నటీనటులు : వినోద్ కుమార్, దేవన, కోట శ్రీనివాస రావు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : చిన్న

ప్రొడ్యూసర్ : S. శ్రీనివాస రెడ్డి , రాజు చౌదరి

రిలీజ్ డేట్ : 2009

చిన్నా ప్రధాన పాత్రలో నటించిన ఆ ఇంట్లో హారర్ ఎంటర్ టైనర్. తన ఇద్దరు పిల్లలతో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన హీరో అక్కడ ఏం చూశాడు..? అక్కడి పరిస్థితులను ఎదుర్కోవడానికి తాంత్రికుడిని కలుసుకున్న హీరో ఏం తెలుసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

==============================================================================

 

యోగి

నటీనటులు ప్రభాస్నాయన తార

ఇతర నటీనటులు కోట శ్రీనివాస రావుప్రదీప్ రావత్సుబ్బరాజుఆలీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల

డైరెక్టర్ : V.V. వినాయక్

ప్రొడ్యూసర్ రవీంద్ర నాథ్ రెడ్డి

రిలీజ్ డేట్ : 12 జనవరి 2017

ప్రభాస్ హీరోగా V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ ఇద్దరి మధ్యన నడిచే ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

=============================================================================

ముకుంద

నటీనటులు : వరుణ్ తేజ్, పూజ హెగ్డే

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, రావు రమేష్, అభిమన్యు సింగ్, పరుచూరి వెంకటేశ్వర రావు, సత్యదేవ్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ. జె. మేయర్

డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల

ప్రొడ్యూసర్: ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్

రిలీజ్ డేట్ : 24, 2014

మెగా హీరో వరుణ్ తేజ్ సిల్వర్ స్క్రీన్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సూపర్ హిట్ సినిమా ముకుంద. ఒకే ఊళ్ళో రాజకీయ నేపథ్యంలో జరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో యూత్ కి , అటు ఫ్యామిలీకి సంబంధించిన ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

=============================================================================

కూలీ నం 1

నటీనటులు : వెంకటేష్టాబూ

ఇతర నటీనటులు : రావు గోపాల్ రావు, ఊర్వశి శారద, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం తదితరులు 

మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా

డైరెక్టర్ : K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. సురేష్

రిలీజ్ డేట్ : 12 జూన్ 1991

వెంకటేష్ హీరోగా K. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన కలర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ కూలీ నం 1. ఒక సాధారణ కూలీపొగరుబోతులైన తండ్రీ కూతుళ్ళ అహాన్ని ఎలా నేలకూల్చాడనే ప్రధానాంశంతో తెరకెక్కిందే ఈ సినిమా. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

==============================================================================

శివలింగ

నటీనటులు : రాఘవ లారెన్స్రితిక సింగ్

ఇతర నటీనటులు : శక్తి వాసుదేవన్రాధా రవివడివేలుసంతాన భారతి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : P. వాసు

ప్రొడ్యూసర్ : R. రవీంద్రన్

రిలీజ్ డేట్ : 14 ఏప్రియల్ 2017

ట్రైన్ లో ప్రయాణిస్తూ హఠాత్తుగా చనిపోయిన రహీం(శక్తి) కేస్ ను ఇంటరాగేషన్ చేయమని పవర్ ఫుల్ సీబీ-సీఐడీ ఆఫీసర్ శివలింగేశ్వర్(లారెన్స్) కు అప్పజెప్తారు కమిషనర్.. అలా కమిషనర్ ఆర్డర్ తో రహీం కేసును టేకప్ చేసిన శివలింగేశ్వర్ తన భార్య సత్యభామ(రితిక సింగ్)తో కలిసి వరంగల్ కి షిఫ్ట్ అవుతాడు. అలా రహీం కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన లింగేశ్వర్ ఆ కేసులో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు..చనిపోయిన రహీం బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఫైనల్ గా శివలింగేశ్వర్ ఏం చేశాడు.. అనేది సినిమా కథాంశం.

==============================================================================

మిరపకాయ్

నటీనటులు : రవితేజ, రిచా గంగోపాధ్యాయ

ఇతర నటీనటులు : సునీల్, దీక్షా సేథ్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, నాగబాబు, స్వాతి రెడ్డి, సంజయ్ స్వరూప్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : హరీష్ శంకర్

ప్రొడ్యూసర్ : రమేష్ పుప్పల

రిలీజ్ డేట్ : 12 జనవరి 2011

రవితేజ ఇంటలిజెన్స్ బ్యూరో ఇన్స్ పెక్టర్ గా నటించిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మిరపకాయ్. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో దీక్షా సేథ్ కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ, యాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్ గా నిలిచాయి.