జీ సినిమాలు ( డిసెంబర్ 30th )

Thursday,December 29,2016 - 10:00 by Z_CLU

tata-manavadu-zee-cinemalu

నటీనటులు  – వినోద్ కుమార్, రంజిత

ఇతర నటీనటులు – కృష్ణంరాజు, సంఘవి, శారద, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, బ్రహ్మానందం

మ్యూజిక్ డైరెక్టర్  –  మాధవపెద్ది సురేష్

డైరెక్టర్ – ఎస్.సదాశివరావు

రిలీజ్ డేట్ – 1996

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన మరో సూపర్ హిట్ మూవీ తాత-మనవడు. అప్పటికే యాక్షన్ సినిమాల నుంచి కుటుంబకథాచిత్రాల వైపు మళ్లారు హీరో వినోద్ కుమార్. పర్ ఫెక్ట్ ఫ్యామిలీ  హీరోగా కొన్ని హిట్స్ కూడా అందుకున్నారు. అందుకే తాత-మనవడు కథకు హీరో కోసం  పెద్దగా అన్వేషణలు ఏమీ పెట్టుకోలేదు నిర్మాత రామానాయుడు. అయితే తాత పాత్ర వద్దకు  వచ్చేసరికి మాత్రం చాలా డిస్కషన్ జరిగింది. ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు  పరిశీలించిన తర్వాత ఫైనల్ గా కృష్ణంరాజును అనుకున్నారు. అలా  మనవడిగా వినోద్ కుమార్, తాతగా కృష్ణంరాజు సెట్ అయిపోయారు. సదాశివరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ  సినిమాకు సంగీతం పెద్ద హైలెట్.

==============================================================================

adirindayya-chandram-zee-cinemalu

నటీనటులు  – శివాజీ, లయ

ఇతర నటీనటులు – సంగీత, మధుశర్మ, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ఏవీఎస్

మ్యూజిక్ డైరెక్టర్  – ఎం.ఎం.శ్రీలేఖ

డైరెక్టర్ – శ్రీనివాసరెడ్డి

రిలీజ్ డేట్  – 2005, ఆగస్ట్ 20

శివాజీ, లయ కలిసి నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అదిరిందయ్యా చంద్రం.  శివాజీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. శివాజీలో అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉందని మరోసారి నిరూపించింది ఈ సినిమా.

==============================================================================

paruvu-pratishta-zee-cinemalu

నటీనటులు  – సుమన్ మాలాశ్రీ

ఇతర నటీనటులు – సురేష్, మాలాశ్రీ, లక్ష్మి, శ్రీవిద్య,

మ్యూజిక్ డైరెక్టర్  – రాజ్ కోటి

డైరెక్టర్  – గుహనాధన్

రిలీజ్ డేట్ – 1993

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ పరువు-ప్రతిష్ట. లో-బడ్జెట్ లో తీసిన ఈ సినిమా భారీ విజయాన్నందుకుంది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో మాలాశ్రీ కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా… సుమన్ ఈ తరహా పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయారు. గుహనాధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. 1993 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా పేరుతెచ్చుకుంది.

==============================================================================

123-from-amalapauram-zee-cinemalu

నటీ నటులు : రవి ప్రకాష్, రాజా శ్రీధర్, అనిల్, నిత్యా దాస్

ఇతర నటీనటులు : ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణ భగవాన్, కొండవలస, మల్లాది రాఘవ, MVS హరనాథ రావు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : వెంకటేశ్వర

డైరెక్టర్ : వర్మ

ప్రొడ్యూసర్ : 9 మూవీ మేకర్స్

రిలీజ్ డేట్ : 19 ఆగస్టు 2005

అల్లరిచిల్లరగా తిరిగే ముగ్గురు యువకులు, టెన్నిస్ చాంపియన్ కావాలని కలలు కంటున్న ఒక అమ్మాయి కలను నిజం చేయడానికి ఏం చేశారు..? ఆ ప్రయత్నం వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది అన్నదే ఈ సినిమా కథాంశం.

==============================================================================

aa-intlo-zee-cinemalu

నటీ నటులు : చిన్నా, మయూరి,

ఇతర నటీనటులు : వినోద్ కుమార్, దేవన, కోట శ్రీనివాస రావు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : చిన్న

ప్రొడ్యూసర్ : S. శ్రీనివాస రెడ్డి , రాజు చౌదరి

రిలీజ్ డేట్ : 2009

చిన్నా ప్రధాన పాత్రలో నటించిన ఆ ఇంట్లో హారర్ ఎంటర్ టైనర్. తన ఇద్దరు పిల్లలతో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన హీరో అక్కడ ఏం చూశాడు..? అక్కడి పరిస్థితులను ఎదుర్కోవడానికి తాంత్రికుడిని కలుసుకున్న హీరో ఏం తెలుసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

============================================================================

dheerudu-zee-cinemalu

నటీ నటులు : విశాల్, ఐశ్వర్య అర్జున్

ఇతర నటీనటులు : సంతానం, జగన్, జాన్ విజయ్, ఆదిత్య ఓం, మురళి శర్మ, సీత తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : తమన్

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : మైకేల్ రాయప్పన్

రిలీజ్ డేట్ : 26 జూలై 2013

సినిమా సినిమాకి వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడతాడు విశాల్. సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించిన తొలి తమిళ చిత్రం “పట్టాతు యానై” సినిమాకి డబ్బింగ్ వర్షన్ ఈ ధీరుడు. ఈ సినిమా రెండు భాషలలోను ఒకేసారి రిలీజయింది. సంతానం కామెడీ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

==============================================================================

premabhishekam-zee-cinemalu

నటీనటులు : శ్రీహరి, వేణుమాధవ్, ప్రియా మోహన్

ఇతర నటీనటులు : రుతిక, ఆలీ, నాగబాబు, తదితరులు..

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : విక్రమ్ గాంధీ

ప్రొడ్యూసర్ : వేణు మాధవ్

రిలీజ్ డేట్ : 14 మార్చి 2008

వేణుమాధవ్, ప్రియా మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ప్రేమాభిషేకం. విక్రం గాంధీ డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి చక్రి సంగీతం అందించాడు. శ్రీహరి పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచింది.